ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2016లోని పోస్ట్‌లను చూపుతోంది

కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ ప్రాజెక్టు పూర్తి

రైల్వే బడ్జట్‌ 2007-2208 లో ప్రవేశపెట్టిన   కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తెంది. ఈ రైల్వే లైన్‌ 207 కి.లో. దూరాన్ని 113 కి.లో. కర్ణాటక,94 కి.లో. ఆంద్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. కావసిన భూ సేకరన జరగక.ఆర్ధిక వనరులు లేక కుంటుపడ్డ ప్రాజెక్టు పనులు 2011 సంవత్సరంలో మెదలై ఇప్పటికి ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రైల్వే లైన్‌  ద్వారా  కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ మద్య చిన్నిచిన్న గ్రామాలను కలుపుతు రెండు రాష్ట్రాల ప్రజలకు రవాణా సౌకర్యం సాకారమైంది. ఆంద్రప్రదేశ్ నుంచి 810 ఎకరాలు  కావసిఉండగా అందులో 630 ఎకరాలు.,కర్ణాటక నుంచి 1185 ఎకారల అవసం ఉండగా 152 ఎకారలు మాత్రమే సాధ్యమయింది. రైల్వే మినిస్టర్‌ సురేష్‌ ప్రభు .1714 కోట్ల వ్యయంతో చేపట్టిన కల్యాణదుర్గం -టుమ్‌కూర్‌ రైల్వే లైన్‌ వ్యయం రైల్వే 857.25 కోట్లు,ఆంద్రప్రదేశ్‌ 390.17, మరియు కర్ణాటక 467.08 కోట్లు పంచుకున్నాయి.

పైపులైన్‌ గ్యాస్‌ -పదకొండు వందల కుటుంబాలకు లబ్ది

 తూర్పుగోదావరి ,మోరీ గ్రామంలో గ్యాస్‌ పైప్‌ లైన్‌ తో వంట గ్యాస్‌ సరఫరా చేయటానికి  ఆంధ్రప్రదేశ్‌ ప్రభత్వం,ఏపీగ్యాస్‌ డిస్ట్రీబూషన్‌ కార్పొరేషన్‌ తో ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఒప్పందంతో మోరీ లోని 1100 కుటుంబాలకు వంట గ్యాస్‌ సరఫరా చేయనున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. మోరీ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఒఎన్‌జీసీ,గ్యాస్‌ ఆథారిటీ ఆప్‌ ఇండియా సంస్థలకు సంబందించిన గ్యాస్‌ నిక్షేపాలున్నాయి. వీరికి మోరీ ప్రాంతానికి వంట గ్యాస్‌ అందించటం సులువౌతుందని చెబుతున్నారు.

అందరికీ ఒకే న్యాయం: కె. చంద్రశేఖర్ రావు

తెలంగాణ రాష్ట్రంలోని పేదలైన ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం కట్టుబడి వున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన రాజ్యాంగబద్ధ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదనే కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రిజర్వేషన్లు పెంచే విషయంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాల్సిందిగా సిఎం సూచించారు. ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే విషయంపై అనుసరించాల్సిన వ్యూహం గురించి బుదవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. బీసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, బీసి కమిషన్ చైర్మన్ బిఎస్. రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరి గౌరిశంకర్, ఆంజనేయులు గౌడ్ ముస్లింల స్థితిగతులపై అధ్యయనం జరిపిన కమిషన్ చైర్మన్ సుదీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్, పోలీస్ కమిషనర్ మహెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్న...

2016 లో ...తెలంగాణం

తెలంగాణ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడొ ఏడాది దిగ్విజయం కొనసాగుతూ నెంబర్‌ వన్‌ స్టేట్‌ గా నిలబదింది. కేసీఆర్‌ నంబర్‌ వన్‌ సీఎంగా నిలిచారు.ఆ ఏడాది చెపట్టిన పాలనా సంస్కరణలు అతి పెద్ద సంస్కరణలు గా చెప్పవచ్చు. తెలంగాణను  31 జిల్లాలు గా మార్చి ,పరిపాలన సౌలభ్యంతో పాటు,ప్రజల సమస్యలను త్వరితగంగా పరిష్కరించేందుకు  కేసీ ఆర్‌ శ్రీ కారం చుట్టారు. వరుస ఎన్నికల విజయాలతో తిరుగులేని పార్టీగా  తెలంగాణ సమితి అవతరించింది. మెదటి సారి గ్రేటర్‌ హైదరాబాద్‌ మన్సిపల్‌  కార్పోరేషన్‌ లో ఒంటరిగా బరిలో దిగి విజయం సాధించింది.అటు వరంగల్‌,ఖమ్మం కార్పోరేషన్‌ తో పాటు అచ్చం పేట,సిద్దిపేట్‌,మునిసిపాలిటీల్లో నేగ్గింది. ప్రజల శాంతిభద్రతల విషయంలో ఎటువంటి రాజీపడకుండా  సైబరాబాద్‌ కమిషనరేట్‌ ను ... సైబరాబాద్‌. రాచకొండ  కమిషనరేట్లగా... సిద్దిపేట్‌, నిజామాబద్‌ ,వరంగల్‌. కరీంనగర్‌ రామగుండంలో పోలీస్‌ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది.వివిధ ప్రైవేటు సంస్థలు జరిపిన సర్వేలలో తెలంగాణ ప్రజల  మన్నను కేసీఆర్‌  పొందారని తెల్చాయి.వ్యవసాయ మార్కెట్‌ కమిటిల్లో ఎస్సీ,బీసీ, మహిళలకు రిజర్వేషన...

జలుబే కదా... అని నిర్లక్షం చేస్తే అంతే...

. చలికాలంలో మనం సాదారణంగా ఇబ్బింది పెట్టే వ్యాధి... మాములు వ్యాధి జలుబు... జలుబే కదా పోతుందిలే అనుకుంటే కష్టం..అది ఫ్లూ డా మారితే... పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. తుమ్ములు,ముక్కునండి నీరు కారడం,తీవ్ర జ్వరం,తలనొప్పి,ఒళ్లనోప్పులు,దగ్గు,అలసట వాంతులు ఉండే అవకాశముంది. ఈ లక్షణాలు సాదారణంగా జలుబైతే ఐదు రోజుల వరకు తగ్గిపోతాయి. కానీ అలా కాకుండా ఒళ్ళు నొప్పులు తగ్గకపోవడం,శరీర శక్తి క్షీనించటం కనసాగితే ప్లూ వైరస్‌ సొకిందని గమనించాలి.  ఈ వైరస్‌ ఇతరులకు రోగి తుమ్మునప్పుడు,దగ్గినపుడు గాలి ద్వారా సోకుతుంది. చలికాలంలో ఎక్కువగా ఈ ప్లూ వాప్తి చెందుతుంది. ఇలాంటి ప్లూ లక్షణాలు గమనించి, డీహైడ్రెషన్‌ కాకుండా నీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ,గొంతు నొప్పి ఉంటే ..ఉప్పు కలిపిన వేడి నీటితో పుక్కలించాలి. డాక్టర్‌ ను 48 గంటలలోపు సంప్రాదిస్తే,మందులతో  ఈ వ్యాధి తీవ్రత తగ్గించే అవకాశముంటుంది. యాంటివైరల్‌ ముందులు ఒసొల్టోమివీర్‌(టామిప్లూ),పెరమివీర్‌, ఉపసమనం కలిగిస్తాయి. ప్లూను గుర్తించి,వెంటనే డాక్టర్‌ సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే  ప్లూ భారీ నుండి ఉపసమనం పొందవచ్చును. ప్లూ సొకకుండా త...

తెలంగాణ సర్కారు కంపాషనేట్ అపాయింట్ మెంట్ జి వో విడుదల

ప్రభుత్వం ఉద్యోగి మారనంతరం ఆ కుటుంబ సభ్యులకు కంపాషనేట్ కెటగిరి లో ఆప్లికేషన్‌ అందిన 10 రోజులలో మరణించిన వ్యక్తి కుటుంబంకు ఉద్యోగం ఇవ్యాలని ఈ జి. వో సూచిస్తుంది.

తెలంగాణ సీఎం దత్తత గ్రామాలు... ఇక నగదు రహితం

ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు నగదు రహిత గ్రామాలుగా మారాయి. ఈరోజు ఎర్రవల్లిలో పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి, నర్సన్నపేటను నగదు రహిత గ్రామాలుగా ప్రకటించారు. సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్‌ స్ఫూర్తిగా ఇకపై ఈ రెండు గ్రామాలు నగదు రహిత లావాదేవీలకు నమూనాగా మారాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలి చేలా అందరూ కృషి చేయాలన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను నగదు రహిత లావాదేవీలు నిర్వహించేం దుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్‌ వెంకటరామరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రెండు గ్రామాల్లోనూ 1200 మందికి ఇప్పటికే డెబిట్‌ కార్డులు అందించామన్నారు. మొత్తం 17 స్వైపింగ్‌ యంత్రాల సాయంతో నగదు లేకుండానే కొనుగోళ్లు జరిగేలా ఏర్పాటు చేశామన్నారు. మొబైల్‌ యాప్‌ల వినియోగం, బ్యాంకుమిత్రల సహకారంతో లావాదేవీలు, అన్ని అంశాలను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. సిద్ధిపేట నియోజకవర్గం మొత్తాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు....

పాములపర్తి వేంకట నరసింహారావు-పీవీ

 భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన ఒకే ఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం. తెలంగాణ లోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించాడు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున...

జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమం

జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిందని ,తమిళనాడు న్యూస్ చానెల్స్  జయలలిత చనిపోయారని న్యూస్ ఇస్తున్నారు కానీ అపోలో హాస్పిటల్ నుంచి ఎటువంటి తాజా సమాచారం అందలేదు . అపోలో వైద్యులు  ఈ విషయాన్నీ ఖండించారు . ఎక్మో(ECMO) మెషిన్.. ‘ఎక్స్‌ట్రా కార్పోరల్‌ మెంబ్రేన్‌ ఆక్సిజనేషన్‌’.. ఇప్పుడు జయలలిత ప్రాణాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి.  గంటలుగా తనను ఈ యంత్రంపైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇంతకూ ఎక్మో పని తీరు ఏంటి..? దానిపై ఉంచారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది? అన్న ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి. ఎక్మో ఏం చేస్తుంది అంటే… గుండె, ఊపిరితిత్తుల స్థానంలో ఎక్మో పరికరం  పనిచేస్తుంది.  క్లిష్ట పరిస్థితులలో  వాటి బాధ్యతను ఎక్మో స్వీకరిస్తుంది. గుండె, ఊపిరితిత్తులు పని చేస్తూనే వాటికి ఎక్మో సహాయకారిగా ఉండటం లేదా  పూర్తిగా గుండె, ఊపిరితిత్తులకు విశ్రాంతినిచ్చి ఆ బాధ్యతను ఎక్మో స్వీకరించడం జరుగుతుంది మొదటి పద్ధతిలో గుండె, ఊపిరితిత్తులను పూర్తిగా నిలిపేస్తారు. యంత్రమే ఆక్సిజన్‌ హరించుకు పోయిన చెడు రక్తాన్ని స్వీకరించి, తిరిగి అదే మంచి రక్తాన్ని దేహంలోని అన్ని భ...

ఐటీ సవరణ బిల్లు అమోదం

పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ముప్పుతిప్పలు పడుతున్న తరునంలో ... మోడీ సర్కార్‌ మరో చర్యకు పునుకొంది. నల్లధనం ఆరికట్టాలనే నిశ్చయం, నగదుతో పాటు ప్రజల వద్ద గల  బంగారంకు  సంబందించిన సమాచారం ఇవ్వాలని కొరుతుంది. పెద్ద నోట్ల రద్దుతో ఖగ్గుతిన్న బాఢా బాబులు బంగారం రూపంలో తన వద్దనున్న పెద్దనోట్లతో మార్పు చేసుకొవటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ...ఇంటలిజెన్స్ సంస్ధలు కేంద్రానికి సమాచారం ఇవ్వటంతో కేంద్ర ప్రభుత్వం బంగారానికి సంబందించిన  సమాచారం బహిర్గతల చేయాలని సూచించింది.  ఈ రోజు ప్రతిపక్షాలు నోట్ల మార్పడిపై చర్చను కొనసాగించాలని,నరేంద్రమోడీ సభకు హజరు కావలని పట్టుపట్టడంతో లోక్‌ సభ, రాజ్యసభ వాయిదా వేయడం జరిగింది.తర్వాత సమావేశమైన లోక్‌ సభ ఐటీ సవరణ బిల్లును ప్రవేశపెట్టి, సభ అమోదం పొందంది. మూజువాణి ఓటుతో బిల్లు అమోదం పొందింది.

పెద్ద నోట్ల రద్దు-ప్రజల ఇబ్బందులు

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంవల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మౌన ప్రేక్షక పాత్ర వహించడం సరైంది కాదని, ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందులను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులు, సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ప్రగతి భవన్ లో ఆదివారం సిఎం సమీక్ష నిర్వహించారు. లక్షలాదిమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగిం చేందుకు ఏ చర్యలు తీసుకోవాలనే విషయంపై అధికారులు, మంత్రులు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం సహాయకారిగా వుండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం ఏమి చేయాలనే విషయంపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆర్థికశాఖను ఆదేశించారు. సోమవారం క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై కూలంకషంగా చర్చ జరిగేందుకు వీలు...

నోట్ల రద్దుతో తక్షణం ప్రయోజనాలు... పరిణామాలు

రకరకాల అభిప్రాయాలన్నీ ఒకేచోట క్రోడీకరించింది గుడ్ గవర్నెన్స్ సంస్థ… ఇప్పటికైతే కొన్ని లాభాల్ని గుర్తించింది… ఇందులో నిజాలు ఇవే అవి…. 1. మావోయిస్టులు, ఇతర స్వదేశీ తీవ్రవాదులు తీవ్రంగా దెబ్బతినిపోయారు 2. జమ్ము కాశ్మీర్ లో అద్దె ఆందోళనలు ఆగిపోయాయి… రాళ్ల దెబ్బలూ ఆగిపోయాయి 3. జమ్ము కాశ్మీర్ లో స్కూళ్లను తగులబెట్టే కార్యక్రమం పూర్తిగా ఆగిపోయింది 4. అవినీతి పరులు దిక్కులేక తమ నల్లధనాన్ని తామే తగులబెట్టుకుంటున్నారు 5. ఉత్తర ప్రదేశ్ లో వంటకు ఉపయోగించే పప్పు ధర కిలో 80 దాకా దిగొచ్చింది 6. కిరాణా షాపులు, పాన్ షాపులు కూడా డెబిట్ కార్డు యంత్రాలను మొదలుపెట్టారు 7. మునిసిపాలిటీలు రికార్డు స్థాయిలో ఇంటి పన్నులను వసూలు చేసుకోగలుగుతున్నాయి 8. విద్యుత్తు సంస్థలకు పాత బకాయిలతోపాటు అన్నీ రికార్డు స్థాయిలో వసూలవుతున్నాయి 9. మందుల షాపుల్లో సేల్స్ విపరీతంగా పెరిగాయి 10. ఢిల్లీ మెట్రో స్మార్ట్ కార్డుల విక్రయం బాగా పెరిగిపోయింది 11. చాలా మంది వ్యాపారులు పాత బకాయిలను వసూలు చేసుకుని, కొత్త అడ్వాన్సులు తీసుకుంటున్నారు 12. మొబైల్ వ్యాలెట్ కంపెనీలకు సూపర్ అవకాశాలు వస్తున్నాయి 13. బ్యాంకులకు ధనం విపర...

పాత నోట్ల చలామణి పొడగింపు

పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న కష్టాలపై ప్రభుత్వం ఉపసమనమిచ్చే చర్యలు మెదలు పెట్టింది.ఇది వరకు ప్రకటించిన విధంగా ఏటీఎం లనుంచి 2వేల కాకుండా 2500 తీసుకొనే విధంగా.రోజుకు 24 వేలు బ్యాంకులనుంచి డ్రా చేసుకొనే వెసులుబాటును,పెట్రొల్ బంకులు,మందుల దకాణాలు,పన్నుల చెల్లింపులు,ఎయిర్‌ పోర్టులు,రెల్వే స్టేషన్ల లో పాత నోట్ల చెలామణి చేససుకొనే ఆవకాశం నవంబర్ 24 వరకు ఇస్తున్నట్లు శక్తికాంతదాస్‌ ,పైనన్స్ సెక్రటరీ తెలిపారు

ఎన్‌ డి టివి ప్రసారలు నిలుపుదల

ఎన్‌ డి టివి పై ఒక రోజు, నవంబర్ 9న  ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర సమాచార పౌరసంబందాల శాఖ నోటిసు జారీ చేయడం మీడియా స్వేచ్చను హరించినట్లేనని పలువురు పాత్రికేయ మిత్రులు అభిప్రాయ వ్యక్తపరిచారు. ఇది వాక్ స్వతంత్రానికి అడ్డుపడడమేనని...నేషనల్‌ సెక్యూరిటీని హాని కలిపించేవిధంగా పఠాన్‌కోట్‌ సంఘటన ప్రసారాలు, కేబుల్‌ టెలివిజన్‌ రెగ్యూలరైజేషన్‌ యాక్టు 1995 ప్రకారం ఉల్లంగణ జరిగిందని,నేషనల్‌ సెక్యూరిటి ప్రధాన  అంశం ఇందులో ఏలాంటి జోక్యం సరికాదని ప్రభుత్వం పేర్కోంది. కేబుల్‌ టెలివిజన్‌ నెట్వార్క్ (రెగ్యూలేషన్‌) యాక్ట్ ,సెక్షన్ 20 ప్రకారం కేంద్ర సమాచార శాఖ కు దేశ సర్వభౌమత్వ పరిరక్షణ,జాతీయ సమగ్రత,సెక్యూరిటి అశ్లీలం, స్టేట్‌ పబ్లిక్‌ ఆర్డర్‌, దృష్ట్యా   టివి ప్రసారలను,లేక కంటెంటును అధికారం ఉంది. ఇందులో బాగంగానే ఆర్టికల్‌ 19 (2) ప్రకారం ప్రీడం ఆప్‌ స్పచ్‌ పై కొన్ని షరతులను విధించటం జరిగింది. రాజ్యంగం లోని ఆర్టికల్‌ 19 (1) (a) ప్రతి పౌరునికి భావ వ్యక్తీకరణ స్వేచ్చను ప్రసాదించింది.  

సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకుసింగరేణి బోర్డు అఫ్ డైరెక్టర్స్ ,సింగరేణి కార్మిక కుటుంబాలకు  40 పైగా కేటగిరీలకు సంబందించిన ఉద్యోగాలను భర్తీ చేయాలనీ నిర్ణయ0 తీసుకున్నారు . 

నరేంద్ర మోడీ దీవాలి సెలెబ్రేషన్స్

పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు-కేజి టు పీజి విద్యా విధానం :తెలంగాణ ముఖ్య మంత్రి

బావి తరానికి మంచి విద్యను అందించడం ద్వారానే పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు వస్తుందని ,ఈ లక్ష్య సాధన కోసమే ప్రభుత్వం కేజి టు పీజి విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా గురుకుల విద్యాలయాలు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నదని తెలంగాణ ముఖ్య మంత్రి  చంద్ర శేఖర్ రావు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకు వారి జనాభాను అనుసరించి గురుకుల విద్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో గురుకుల విద్య విస్తరణపై క్యాంపు కార్యాలయంలో శనివారం సిఎం  సమీక్ష నిర్వహించారు.  పేదల సంక్షేమం కోసం ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ, రేషన్ బియ్యం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ బావి తరాలకు మంచి విద్య అందించడం ద్వారానే పేదల జీవితాలు బాగుపడతాయని తానూ బలంగా నమ్ముతున్నట్లు సిఎం వెల్లడించారు. అందుకు ఒక్కో విద్యార్థిపై దాదాపు 84 వేల రూపాయల ఖర్చు పెడుతూ మంచి విద్య, వసతి, ఆహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బిసిలకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకులాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడి...

రైతులందరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు

దరఖాస్తు చేసిన రైతులందరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందచేయాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దాదాపు ఐదేళ్ళ నుంచి రాష్ట్రంలో రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసి ఎదురు చూస్తున్నారని, కనెక్షన్లు ఇచ్చే క్రమంలో అనేక అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని సిఎం అభిప్రాయపడ్డారు. రైతుల ఎదురు చూపులకు స్వస్తి పలికేందుకు, కనెక్షన్ల మంజూరులో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిఎం వెల్లడించారు. వచ్చే ఏడు నెలల్లో అందరికీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ ముగించాలని కూడా సిఎం ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ విద్యుత్ అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జెన్ కో & ట్రాన్స్ కో సిఎండి డి. ప్రభాకర్ రావు, ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి రఘుమారెడ్డి, ఎన్.పి.డి.సి.ఎల్. సిఎండి గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 97వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, దాదాపు ఐదేళ్ల నుంచి ఇవి పేరుకుపోతున్నాయని, అందరికీ కనెక్షన్లు ఇవ్వాలంటే దాదాపు రూ. 600 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డిమాండ్ కు అనుగుణంగా కనెక్షన్లు ఇవ్వకపో...

వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రహదారులు

ప్రమాద రహిత ప్రయాణమే లక్ష్యంగా అంతర్జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాలతో తెలంగాణలో రహదారుల వ్యవస్థను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో రహదారులు ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, రాబోయే పదేళ్ల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కోరారు. రాష్ట్రంలో ప్రస్తుత రహదారులు ఎలా ఉన్నాయి? ఎలా ఉండాలి? భవిష్యత్తులో మెరుగైన రహదారుల వ్యవస్థ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలేంటి? జాతీయ రహదారులుగా మార్చాల్సిన రూట్లు ఏవి? కేంద్ర పథకాల ద్వారా నిర్మించాల్సిన రోడ్లు ఎక్కడున్నాయి? ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకునేలా రహదారులను నిర్మించడం ఎలా? తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేసి, భవిష్యత్తుకు పనికొచ్చేలా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలని సిఎం చెప్పారు. మనిషి ప్రాణాలు అత్యంత విలువైనవి కాబట్టి ప్రమాద రహిత ప్రయాణానికి అనుగుణంగా రహదారుల వ్యవస్థను తీర్చిదిద్దాలని సిఎం చెప్పారు. రహదారుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం అవలంభించే విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఉండాలని సిఎం సూచించారు.  క్యాంపు కార్య...

ఇక నుంచి యాదాద్రి జిల్లా- యాదాద్రి భువనగిరి జిల్లా

యాదాద్రి జిల్లాను ‘‘యాదాద్రి భువనగిరి’’ జిల్లాగా పిలవాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. టెంపుల్ సిటీగా యాదగిరిగుట్ట, జిల్లా కేంద్రంగా భువనగిరి జంటగా అభివృద్ది చెందుతాయని సిఎం అన్నారు. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెంచాలని సూచించారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన భువనగిరిలోని ఎలిమినేటి క్రిష్ణారెడ్డి ఇంటికి బుధవారం సాయంత్రం సిఎం వెళ్లారు. ఆరోగ్యం, కుటుంబ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ సమయంలో గడిపిన సందర్భాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. జిల్లా కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో భువనగిరి పట్టణం చాలా అభివృద్ది చెందుతుంది అన్నారు. ఎంఎంటిఎస్, రీజినల్ రింగ్ రోడ్ భువనగిరి నుండే వెళతాయి కాబట్టి రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని సిఎం హామి ఇచ్చారు. రాబోయే కాలంలో యాదాద్రిని సందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని దీనికి అనుగుణంగా యాదాద్రిలో వసతి, రహదారులు, క్యూలైన్ల వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. రోజ...

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం మధ్మాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు, కొత్త సెక్రటేరియట్ నిర్మాణం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 

తెలంగాణ చరిత్రలో సరికొత్త అధ్యాయం

తెలంగాణ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది.తెలంగాణ లోజిల్లాల సంబురం మెదలైంది. 31 జిల్లాలతో  ఉదయం 11.13 గంటలకు ఆట్టహసంగా తెలంగాణ జిల్లాలను సిద్దిపేట్‌ కలెక్టరెట్‌ ఆవరణ లోజాతీయ జండా ఆవిష్కరించి,  ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు  ప్రారంభించారు.

అభివృద్ధి దిశగా తెలంగాణ రాష్ట్రం

అభివృద్ధి దిశగా పయనిస్తున్న నూతన తెలంగాణ రాష్ట్రం దేశ విదేశాల ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైన ఇండియన్ బ్యాంక్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ సి.ఇ.ఓ ఎం.కె జైన్ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును సోమవారం క్యాంపు కార్యాలయంలో తన బృందంతో కలిసారు. హెచ్.ఎమ్.డి.ఏ., జీ.హెచ్.ఎం.సీ పరిధిలో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు ఆర్ధిక సహకారం ఋణం రూపంలో అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్ల ు తెలిపారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో అభివృద్ధి కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్న పట్టణాల పరిధిలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు తమ సంసిద్ధతను సిఎంకు బ్యాంకు ఎండీ వ్యక్తపరిచారు. కాగా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు ఇండియన్ బ్యాంకు ముందుకు రావడం శుభపరిణామమని, వారిని తాను ఆహ్వానిస్తున్నానని సిఎం తెలిపారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఇతర అభివృద్ధి, సేవారంగంలో వ్యవస్థల బలోపేతానికి ఇండియన్ బ్యాంకు అందించే ఆర్ధిక సహకారం దోహదం పడుతుందని సిఎం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్...

అశోక్ లేలాండ్ - తెలంగాణ ఒప్పందం

భారీ వాహనాల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్న అశోక్ లేలాండ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో బాడీ బిల్డింగ్ యూనిట్ నెలకొల్పే ఒప్పందం కుదుర్చుకుంది. 500 కోట్లతో దశల వారీగా నెలకొల్పే ఈ యూనిట్ ద్వారా 1000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వందల మందికి ఉపాధి లభించనుంది. ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, పరిశ్రమలు, ఐటి, మున్సిపల్ శాఖల మంత్రి కెటి. రామారావు, విద్యుత్, షెడ్యూల్ కులాల శాఖల మంత్రి జి. జగదీష్ రెడ్డిల సమక్షంలో సోమవారం నాడు క్యాంప్ కార్యాలయంలో సిఎం అదనపు ప్రిన్సిప ల్ సెక్రటరీ శాంతి కుమారి, అశోక్ లేలాండ్ కంపెనీ ఎం.డి వినోద్ కె దాసరి అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూ) మార్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మాట్లాడుతూ ఉత్పాదక రంగాలకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. పరిశ్రమలకు భూమి, ఇతర మౌళిక సౌకర్యాలు కల్పించడంతో పాటు అన్ని రకాల అనుమతులను 15 రోజుల్లో మంజూరు చేసేందుకే టిఎస్ఐపాస్ విధానాన్ని తీసుకొచ్చినట్లు వివరించారు. తెలంగాణ ఆర్.టీ.సికి, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వాహనాలను ఇక్కడ నెలకొల్పిన పరిశ్రమల నుండే కొనుగోలు చేయడానికి ప్...

List of VIPs proposed for Inauguration of New Districts

1. Siddipet: Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao, Hon'ble Minister Sri T. Harish Rao  2. Jangoan: Hon'ble Chairman Sri K. Swamy Goud 3. Jayashankar: Hon'ble Speaker Sri S. Madhusudhana Chary 4. Jagitial: Hon'ble Dy. Chief Minister Sri Md. Mahamood Ali 5. Warangal (Rural): Hon'ble Dy. Chief Minister Sri Kadiyam Srihari 6. Yadadri: Hon'ble Home Minister Sri Naini Narsimha Reddy 7. Peddapally: Hon'ble Minister Sri Etela Rajendra 8. Kamareddy: Hon'ble Minister Sri Pocharam Srinivas Reddy 9. Medak: Hon’ble Dy. Speaker Smt. Padma Devender Reddy 10. Mancherial: Hon'ble Minister Sri T. Padma Rao Goud 11. Vikarabad: Hon’ble Minister Sri P. Mahender Reddy 12. Rajanna: Hon’ble Minister Sri KT. Rama Rao 13. Asifabad: Hon’ble Minister Sri Jogu Ramanna 14. Suryapet: Hon'ble Minister Sri G. Jagadish Reddy 15. Kothagudem: Hon’ble Minister Sri Tummala Nageshwar Rao 16. Nirmal: Hon’ble Minister Sri A. Indra Karan Reddy 17. Wanaparthy: Dy. Chairma...

తెలంగాణ కొత్త జిల్లాలకు కాలెక్టర్స్

తెలంగాణ కొత్త జిల్లాల కలెక్టర్ల జాబితా ఈవిధంగా ఉండే అవకాశం   1. అతిలాబాద్  జ్యోతి బుద్దప్రకాష్.  2.మంచిర్యాల -కర్ణన్ ఆర్ వి. 3. నిర్మల్ ఇలంబర్తి. 4. ఆసిఫాబాద్-చంపాలాల్ 5. నిజమాబాద్ - యోగితరాణ 6. కామారెడ్డి-సత్యన్నారాయణ 7.ఖమ్మం- లోకేష్ 8.కొత్తగూడెం-రాజీవ్ జీ హన్మంత్ 9.హైద్రాబాద్- రాహుల్ బోజ్జా 10.వరంగల్- అమ్రపాలి, 11. హన్మ కొండా జిల్లా కి ప్రశాంత్ 12. భూపాల పల్లి-మురళీ 13-మహబుబాబాద్ -ప్రీతి మీనా 14-జనాగం-దేవసేనా 15.కరీంనగర్- సర్పరాజ్ అహ్మద్ 16.జగిత్యాల-శరత్. 17.పెద్దపల్లి- వర్షీణి 18.సిరిసిల్ల - కృష్ణా భాస్కర్ 19.మహాబుబ్ నగర్- రోనాల్డ్ రాస్ 20. నాగర్ కర్నూల్ -  శ్రీదర్ 21. వనపర్తి- శ్వేత మహాంతి 22.గద్వాల -రజత్ కుమార్ శైనీ 23. మెదక్- భారతీ హోళీ కేరి 24.సిద్దిపేట- వెంకట్ రామి రెడ్డి 25. సంగారెడ్డి - మాణిక్ రాజ్ 26. రంగారెడ్డి-రఘునందన్ రావ్ 27. వికారాబాద్ -దివ్య 28.మల్కాజ్ గిరి - ఎం వి రెడ్డి 29. నల్గోండ- గౌరవ్ ఉప్పల్ 30. యాదాద్రి -అనితా రామచంద్రన్ 31. సూర్యాపేట- సురేంధ్ర మోహన్.

తెలంగాణ కార్పొరేషన్లకు చైర్మన్లు

తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదివారం నిర్ణయం తీసుకున్నారు.  వాటి వివరాలు ఇలా ఉన్నాయి:   1. మందుల సామేల్: వేర్ హౌజింగ్ 2. కన్నెబోయిన రాజయ్య యాదవ్: షీప్ అండ్ డెవలప్‌మెంట్ 3. పెద్ది సుదర్శన్ రెడ్డి: సివిల్ సప్లయిస్ 4. జి. బాలమల్లు: టిఎస్-ఐఐసి 5. ఎ. వెంకటేశ్వర్ రెడ్డి: స్పోర్ట్స్ అథారిటీ 6. ఈద శంకర్ రెడ్డి: ఇరిగేషన్ డెవలప్‌మెంట్ 7. బండ నరేందర్ రెడ్డి: ఫారెస్ట్ డెవలప్‌మెంట్ 8. మర్రి యాదవ రెడ్డి: కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ 9. లింగంపల్లి కిషన్ రావు: టిఎస్ ఆగ్రోస్ ఈ నియామకాలకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

కార్యాలయాలు తరలించవద్దు : కె. చంద్రశేఖర్ రావు

తెలంగాణ కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన కార్యాలయాలు కొత్తగా ఏర్పాటు చేయాల్సిందే తప్ప ఎక్కడ కూడా ఉన్న కార్యాలయాలు తొలగించవద్దని   ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లో కార్యాలయాలు తరలిస్తారనే ప్రచారం జరుగుతున్నదని మంత్రి లక్ష్మారెడ్డి, ములుగులో ఏ ఒక్క కార్యాలయాన్ని తరలించవద్దని మంత్రి చందూలాల్, మరిపెడలో కార్యాలయాలు తరలించవద్దని మాజీ మంత్రి రెడ్యానాయక్ ముఖ్యమంత్రిని కోరారు. మర ికొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి వినతులే ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు ముఖ్యమంత్రి విస్పష్టమైన ఆదేశిలిచ్చారు. ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ పట్టణాలు, ప్రాంతాల్లో వివిధ స్థాయిల కార్యాలయాలున్నాయి. కొత్తగా మళ్లీ జిల్లాలు, డివిజన్లు, మండలాలు వస్తున్నాయి. కొత్తగా కార్యాలయాలు అవసరం ఉన్న చోట ఏర్పాటు చేయండి. కానీ ఒక్క చోట నుంచి కూడా ఒక్క కార్యాలయాన్ని కూడా వేరే చోటకి తరలించవద్దు. సౌకర్యాలు పెంచేందుకు పరిపాలన విభాగాలు పెంచుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ...

భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటా0

తెలంగాణ ఇంద్ర కీలాద్రిగా ప్రసిద్ధి గాంచిన వరంగల్ భద్రకాళి అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కే సీ ఆర్ దంపతులు దర్శించుకొని అమ్మవారికి స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు

గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన తెలంగాణ బతుకమ్మ

తెలంగాణకే ప్రత్యేకమయిన పూల పండుగ చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన రాష్ట్రంలో ప్రకృతిమాత సహకరించడంతో విస్తృతంగా కురిసిన వర్షాల వల్ల గ్రామాల్లోని చెరువులు నీటితో నిండి జలకళ సంతరించుకున్నాయని ఈ సందర్భంగా జరుగుతన్న బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతుందని ఆకాంక్షించారు.

సిఎం సమీక్ష

కొత్తగా ఏర్పాటయ్యే ప్రతీ జిల్లా కేంద్రంలో మొదటి రోజు నుంచి కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు పనిచేయాలని, అదే విధంగా కొత్తగా ఏర్పాటయ్యే మండలాల్లో కూడా పోలీస్ స్టేషన్లు, మండల రెవిన్యూ కార్యాలయాలు పనిచేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వీలైనంత వరకు ప్రతీ రెవిన్యూ డివిజన్లో ఆర్డిఓతో పాటు డిఎస్పీ స్థాయి అధికారి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చేపట్టాల్సిన అధికారిక కసరత్తుపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష జరిపారు. మంత్రులు టి. హరీష్ రావు, కెటి.రామారావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ సిఎంఒ ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంతకుమారి, స్మితా సభర్వాల్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 17 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముసాయిదాలో ప్రకటించామని, ఇవి కాకుండా జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కూడా పరిశీలనలో వుందని, వీటికి తోడు కొత్త డివిజన్లు, మండలాలు ...

చెరువుల్లో జలకళ

చేపకు, చెరువుకూ వున్న గత బంధాన్ని తిరిగి నెలకోల్పేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ చెరువులు జలకళను సంతరించుకున్న నేపథ్యంలో చెరువు చెరువుకు చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 48 కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా వున్న 4,533 చెరువులలో 35 కోట్ల చేప పిల్లలను పోసి సొసైటీల ద్వారా పెంచడానికి సిఎం నిర్ణయించారు. చెరువులలో చేప పిల్లలు పెంచే కార్యక్రమాన్ని అక్టోబర్ 3 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర పశు  సంవర్ధక శాఖ, మత్స్య, పాడి అభివృద్ధి శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను సిఎం ఆదేశించారు. ఈ మేరకు మంత్రితో ముఖ్యమంత్రి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ పల్లెలు మరింతగా స్వయం సమృద్ధి సాధించి బంగారు తెలంగాణకు బాటలు వేసే దిశగా చేపల పెంపకం కార్యక్రమం సాగాలని సిఎం ఆకాంక్షించారు. చేపల పెంపకం వృత్తిగా గల ముదిరాజులు, బెస్తవారితో పాటు ఇతర కులాలకు చెందిన చేపల పెంపకం దారుల సొసైటీ సభ్యుల...

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేసులు హైకోర్టు ద్వారానే...

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో పెండింగ్ లో ఉన్న కేసులన్నీ హైదరాబాద్ లోని ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అవసరం లేదని భావించి, దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో కోరింది. దీంతో ఎపి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిధిలోకి తెలంగాణ రాష్ట్రం రాదని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15న  గెజిట్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ విచారణలో ఉన్న కేసులను హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఇప్పటి వరకు ట్రిబ్యునల్లో పెండింగ్ లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అన్ని కేసుల విచారణ ఇకపై హైకోర్టులో జరుగుతుంది. కేసుల విచారణకు సంబంధించిన సమాచారం కూడా ఇప్పటి నుంచి కక్షిదారులకు హైకోర్టు ద్వారానే అందుతుంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రస్తుతం జరగడం లేదు కనుక, రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు మేరకు గవర్నర్ ఈ ఆర్డినెన్స్ జారీ చేశారు. ...

ఆంద్రప్రదేశ్‌ లో మూడు ఎయిర్‌ పోర్టులకు అనుమతి..

ఆంద్రప్రదేశ్‌ లో మూడు విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. విజయ నగరం జిల్లా భోగాపురం,నెల్లూరు జిల్లా దగదర్తి, కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో విమానాశ్రయాల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణహించానలని ,భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో  నిర్మించాలని భావిస్తుంది. భోగపురం విమానాశ్రయంలో భారీ విమానాల రాక పోకలు,సంబంధిత పరిశ్రమల స్థాపన, ఎయిర్ క్రాప్ట్ల మెయింటెనెన్స్, రిపేర్‌,ఓవర్‌హాల్ సౌకర్యాలు,ల్యాబొరేటరీలు, రీసెర్చసెంటర్లు,లీజర్‌,ఎంటర్టైన్మోంట్‌ సెంటర్లు,విమానయాన విద్య,శిక్షన వసతులను 5311 ఎకరాల విస్తర్ణంలో  ఏర్పాచలని తలుస్తుంది. తొలి విడతగా రెండువేల నాలుగు ఎకరాల్లో ఎయిర్‌ పొర్టు పనులు చేపట్టలని నిర్ణయించారు. విమానశ్రయం కోసం సేకరించనున్న భూమిలో ల57 శాతం ప్రైవెటు స్థలాలు కాగా, 43 శాతం ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే 800 ఎకరాల భూమిని ప్రైవెట్‌ వ్యక్తులు ఇపవ్వటానికి ముందుకొచ్చారని ,మిగిలిన 800 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిచంచాల్సిన ఉందని,ఎయిర్‌ పోర్టు నిర్మాణానికి హడ్కో రూ.1500 కోట్లు ఇవ్వటానికి అంగీకిరంచిందని ప్రభుత్వం చేబుతుంది. దగదర్తి గ్రీన్‌ ఫీల్డ్ ఎయిర్‌...

ఆంధ్ర ప్రదేశ్ కలెక్టర్ల సదస్సు

విజయవాడ లో జరిగిన కలెక్టర్ల సదస్సు లో రాయలసీమ ప్రవేశ పెట్టిన రైన్ గన్స్ తో పంటలను కాపాడుకోగలిగామని ,పవర్ సెక్టార్ రిఫార్మ్స్ అమలు ,నీటి పారుదల మెరుగు పరచడం అధికారుల కృషిని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి కొనియాడారు 

యాదాద్రి దేవస్థానం తుది నమూనా ఆమోదముద్ర

వ చ్చే ఏడాది దసరానాటికి యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్ది భక్తుల సందర్శనార్థం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే ప్రత్యేక నిర్మాణ కౌశలంతో దైవభక్తి ఉట్టిపడే విధంగా పవిత్ర శిల్పకళా నైపుణ్యంతో రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దేవస్థానం తుది నమూనాకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. ప్రధాన ఆలయ సమూదాయాల నిర్మాణం, భక్తులు సేదతీరేందుకు నిర్మించనున్న వివిధ రకాల కాటేజీల నిర్మాణానికి సంబంధించి త్రీడి వీడియో ఫోటోలను సిఎం వీక్షించారు. సిఎం సూచనల మేరకు ఆగమశాస్త్ర పండితుల నిర్దేశాల మేరకు నిర్మితమవుతున్న ఆలయ కట్టడాల త్రీడి నమూనాల పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. బుధవార సిఎం క్యాంపు కార్యాలయంలో యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతికి సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఐటి శాఖ మంత్రి కె.టి. రామారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి, సిఎం స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి, యాదాద్రి...

హైదరాబాద్ మహా గొప్ప నగరం

హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలను కూల్చివేయడంతో పాటు రోడ్లు ఇతర మౌళిక సౌకర్యాల కల్పనను సమాంతరంగా చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. బుధవారం నాడు క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ నగరంలో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. నగర అభివృద్ధికి బ్యాంకర్ల నుంచి ఆర్ధిక సహాయం తీసుకుని అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని మున్సిపల్ మంత్రి కె.టి. రామారావును, అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో మ ిషన్ భగీరథ వంటి పథకాలను చేపడుతుండడంతో బ్యాంకర్లలో విశ్వాసం ఏర్పడి రుణాలు ఇవ్వడానికి ముందుకొచ్చారని సిఎం పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం వ్యాపార రంగంలో ఇంకా అభివృద్ధి దిశగా వేళ్లే అవకాశం ఉన్నందున ప్రభుత్వరంగ బ్యాంకులను రుణాల కోసం సంప్రదించి పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందని సిఎం తెలిపారు. నగరంలో అత్యవసరంగా రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ నగరం ఆదాయం భవిష్యత్ లో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మహా గొప్ప నగర...