ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు-కేజి టు పీజి విద్యా విధానం :తెలంగాణ ముఖ్య మంత్రి

బావి తరానికి మంచి విద్యను అందించడం ద్వారానే పేదల జీవితాల్లో గుణాత్మక మార్పు వస్తుందని ,ఈ లక్ష్య సాధన కోసమే ప్రభుత్వం కేజి టు పీజి విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా గురుకుల విద్యాలయాలు ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నదని తెలంగాణ ముఖ్య మంత్రి  చంద్ర శేఖర్ రావు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకు వారి జనాభాను అనుసరించి గురుకుల విద్యాలయాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో గురుకుల విద్య విస్తరణపై క్యాంపు కార్యాలయంలో శనివారం సిఎం సమీక్ష నిర్వహించారు. 
పేదల సంక్షేమం కోసం ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ, రేషన్ బియ్యం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ బావి తరాలకు మంచి విద్య అందించడం ద్వారానే పేదల జీవితాలు బాగుపడతాయని తానూ బలంగా నమ్ముతున్నట్లు సిఎం వెల్లడించారు. అందుకు ఒక్కో విద్యార్థిపై దాదాపు 84 వేల రూపాయల ఖర్చు పెడుతూ మంచి విద్య, వసతి, ఆహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బిసిలకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 గురుకులాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మైనారిటీ వర్గాలకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఏడాది 71 మైనారిటీ గురుకుల పాఠశాలలు ప్రారంభించామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం మరో 89 విద్యాలయాలు ప్రారంభిస్తామని, దీంతో గురుకులాల సంఖ్య 160 కి చేరుకుంటున్నారు. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో మైనారిటీల జనాభా, స్థలాల అందుబాటు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంకా అదనంగా గురుకులాలు మంజూరు చేయడానికి కూడా సిద్ధమని సిఎం ప్రకటించారు. 2016-17 విద్యా సంవత్సరంలో 71 మైనారిటీ గురుకుల విద్యాలయాల ద్వారా 17 వేల మందికి విద్య అందుతున్నదని, దీనికోసం రూ. 143.21 కోట్లు వెచ్చిస్తున్నామని వెల్లడించారు. 160 గురుకులాల ద్వారా వచ్చే ఐదేళ్లలో లక్ష మంది విద్యార్థులకు గురుకుల విద్యాలయాల ద్వారా మంచి విద్య అందుతుందన్నారు. ఇందుకోసం రూ. 2,568 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. దీనికి అదనంగా గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల కోసం మరో 3 వేల కోట్లు వెచ్చిస్తామన్నారు. లక్ష కుటుంబాలకు మంచి భవిష్యత్ అందుతుందని చెప్పారు. ఇది సామాజిక మార్పు దిశగా వేస్తున్న గొప్ప ముందడుగుగా సిఎం అభివర్ణించారు. రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరిన్ని మైనారిటీ గురుకులాలు ఏర్పాటు కావాలని, ఆయా ప్రాంతాల్లో మైనారిటీ జనాభా ఆధారంగా వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మైనారిటీ జనాభా ఎక్కువున్న చోట ఒక బాలికల, ఒక బాలుర గురుకులంతోనే సరిపెట్టకుండా ఎన్ని అవసరమైతే అన్ని స్థాపించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాలు చాలా గొప్పగా పనిచేస్తున్నాయని అదే తరహాలో మైనారిటీ గురుకులాలు కూడా మొదటి ఏడాదే మంచి పేరు తెచ్చుకోవడం పట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో గురుకుల విద్యాలయాల సంఖ్యను విరివిగా పెంచుకుంటామన్నారు. ఇది కేజీ టు పిజీ విద్యా విధానానికి పునాది వంటిదని పేర్కొన్నారు. ఈ సమీక్ష లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు నిరంజన్ రెడ్డి, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, ఎంపిలు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మేల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, బాబు మోహన్, గణేష్ గుప్తా, సిఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.