ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

చెరువుల్లో జలకళ

చేపకు, చెరువుకూ వున్న గత బంధాన్ని తిరిగి నెలకోల్పేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ చెరువులు జలకళను సంతరించుకున్న నేపథ్యంలో చెరువు చెరువుకు చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 48 కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా వున్న 4,533 చెరువులలో 35 కోట్ల చేప పిల్లలను పోసి సొసైటీల ద్వారా పెంచడానికి సిఎం నిర్ణయించారు. చెరువులలో చేప పిల్లలు పెంచే కార్యక్రమాన్ని అక్టోబర్ 3 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, మత్స్య, పాడి అభివృద్ధి శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను సిఎం ఆదేశించారు. ఈ మేరకు మంత్రితో ముఖ్యమంత్రి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ పల్లెలు మరింతగా స్వయం సమృద్ధి సాధించి బంగారు తెలంగాణకు బాటలు వేసే దిశగా చేపల పెంపకం కార్యక్రమం సాగాలని సిఎం ఆకాంక్షించారు. చేపల పెంపకం వృత్తిగా గల ముదిరాజులు, బెస్తవారితో పాటు ఇతర కులాలకు చెందిన చేపల పెంపకం దారుల సొసైటీ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని సిఎం పునరుద్ఘాటించారు. చేపల పెంపకాన్ని పల్లెల్లో ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం గుర్తిస్తున్నదని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాల హాయాంలో తూతూ మంత్రంగా చేపట్టిన చేపల పెంపకం కార్యక్రమం మత్స్యకారులను ఏ మాత్రం ఆదుకోలేకపోయిందన్న సిఎం అందుకు సంబంధించి గణాంక తదితర వివరాలను పరిశీలించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సహకారం నామ మాత్రంగానే వుండేదని, ఒక్కోజిల్లాలో వందలాది సొసైటీలుంటే కేవలం ఐదారు సొసైటీలకు మాత్రమే అరకొర లబ్ది చేకూరేదన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడు చేపల పెంపకాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టి ఉచిత సరఫరా చేపట్టలేదని అన్నారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మత్స్యకారులు 50% సబ్సిడీ చెల్లించాలంటే కూడా భారమైపోయేదని సిఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులను ఆదుకుని వారికి ఆర్ధికంగా లబ్దిచేకూర్చేదిశగా చేపపిల్లను 100% ఉచితంగా సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం తెలిపారు. దీనితో పాటు మత్స్యకారులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణనిప్పించడం, తదితర అనుబంధ శిక్షణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపడుతున్నదని తెలిపారు.
ఇప్పటికే ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన హరితహారం తదితర ప్రతిష్టాత్మక కార్యక్రమాల తరహాలో చెరువుల్లో చేపల పెంపకాన్ని చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారిగా ఈ నెల 3వ తేది నుండి అందరి భాగస్వామ్యంతో ఉధృతంగా ప్రారంభించాలని సిఎం ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పెద్దఎత్తున పాల్గొని చేప పిల్లలను చెరువుల్లోకి వదిలే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
చేపల కొనుగోలు పంపిణీ వ్యవహారాల్లో గత ప్రభుత్వాల మాదిరి ఎటువంటి అవకతవకలు లేకుండా పూర్తి పారదర్శకతతో ఆన్ లైన్ టెండర్లను ఇటివలే పిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి తలసాని సిఎం దృష్టికి తీసుకురాగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
కాగా బతుకమ్మ పండుగలో పాల్గొన్నట్టే అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న చెరువుల్లోకి చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, చెరువుల్లో జలకళలతో పాటు చేపల కళ సంతరించుకోవాలని, సిఎం కేసిఆర్ ఆశయాలను నిజం చేసే దిశగా కదలాలని సంబంధిత శాఖామంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విజ్ఞప్తి చేశారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..