ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సిఎం సమీక్ష

కొత్తగా ఏర్పాటయ్యే ప్రతీ జిల్లా కేంద్రంలో మొదటి రోజు నుంచి కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు పనిచేయాలని, అదే విధంగా కొత్తగా ఏర్పాటయ్యే మండలాల్లో కూడా పోలీస్ స్టేషన్లు, మండల రెవిన్యూ కార్యాలయాలు పనిచేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. వీలైనంత వరకు ప్రతీ రెవిన్యూ డివిజన్లో ఆర్డిఓతో పాటు డిఎస్పీ స్థాయి అధికారి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి చేపట్టాల్సిన అధికారిక కసరత్తుపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష జరిపారు. మంత్రులు టి. హరీష్ రావు, కెటి.రామారావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డిజిపి అనురాగ్ శర్మ సిఎంఒ ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంతకుమారి, స్మితా సభర్వాల్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 17 కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముసాయిదాలో ప్రకటించామని, ఇవి కాకుండా జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటు కూడా పరిశీలనలో వుందని, వీటికి తోడు కొత్త డివిజన్లు, మండలాలు కూడా ఏర్పాటవుతున్నందున అన్ని చోట్ల అధికారుల నియామకం, కార్యాలయాల ఏర్పాటు తదితర విషయాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంకా కొత్త రెవిన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించి ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధుల వినతితో ముఖ్యమంత్రి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
- సిద్దిపేటలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి పోలీసు శాఖను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయాలనుకున్న కరీంనగర్, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్లతో పాటు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కు సంబంధించి కూడా ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.
- సిద్దిపేట, మెదక్ జిల్లాల ప్రారంభ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ముఖ్యమంత్రి చెప్పారు. మిగిలిన మంత్రులు, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తలా ఒక జిల్లాను ప్రారంభించాలని సిఎం సూచించారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పరిధిలో ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్లు, మండలాలను ప్రారంభించాలని చెప్పారు. ఎవరు ఎక్కడ ఏ కార్యాలయాన్ని ప్రారంభించాలో జాబితా తయారు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.
- కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల్లో పని చేయడానికి ఉద్యోగుల విభజన వెంటనే పూర్తి చేయాలని, అవసరమైన పక్షంలో డిపిసిలు నిర్వహించి పదోన్నతులు కల్పించాలని సిఎం చెప్పారు.
- యాదాద్రి జిల్లాను రాచకొండ పోలీస్ కమిషనరేట్లో, జనగామ జిల్లాను వరంగల్ పోలీస్ కమీషనరేట్లలో భాగం చేయాలని సిఎం చెప్పారు.
- కొమురం భీమ్ పుట్టిన జోడెఘాట్‌ కొత్తగా ఏర్పాటు చేసే ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆసిఫాబాద్ జిల్లాకే కొమురంభీమ్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.
- ఆదిలాబాద్ జిల్లాలో కాగజ్ నగర్ ను, మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరును, రంగారెడ్డి జిల్లాలోని తాండూరును రెవెన్యూ డిజిన్లుగా మార్చాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.
- ముథోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త రెవెన్యూ డివిజన్ ప్రారంభించాలని నిర్ణయించినందున, ప్రజలందరకీ అందుబాటులో ఉండే విధంగా భైంసాలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సిఎం చెప్పారు.
- గజ్వెల్ నియోజకవర్గంలోని ములుగు మండలంలో మార్కూక్, తూఫ్రాన్ మండలంలో మనోహరాబాద్, నిజామాబాద్ జిల్లాలో చందూరు, ములుగు నియోజకవర్గంలో కన్నాయిగూడెం, నిర్మల్ అర్భన్, రూరల్ మండలాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
- నాగిరెడ్డి పేట మండలాన్ని కామారెడ్డి జిల్లాలో కొనసాగించాలని నిఘా వర్గాలు జరిపిన సర్వేలో తేలిందని సిఎం చెప్పారు. కాబట్టి ఆ మండలాన్ని కామారెడ్డిలో కొనసాగించాలని, అవసరమైతే మెదక్ కు సమీపంలో ఉన్న ఆ మండల పరిధిలోని గ్రామాలను మెదక్ జిల్లాలో కలపాలని చెప్పారు.
- మోయినాబాద్, శంకరపల్లి, శాబాద్ లతో పాటు చేవేళ్ల మండలాన్ని కూడా రంగారెడ్డి (శంషాబాద్) జిల్లాలోనే చేర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
- కల్వకుర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలుస్తున్నందున ఆ నాలుగు మండలాలను సైబారాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మార్చాలని సిఎం చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.