ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

రైతులందరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు

దరఖాస్తు చేసిన రైతులందరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందచేయాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. దాదాపు ఐదేళ్ళ నుంచి రాష్ట్రంలో రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసి ఎదురు చూస్తున్నారని, కనెక్షన్లు ఇచ్చే క్రమంలో అనేక అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని సిఎం అభిప్రాయపడ్డారు. రైతుల ఎదురు చూపులకు స్వస్తి పలికేందుకు, కనెక్షన్ల మంజూరులో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిఎం వెల్లడించారు. వచ్చే ఏడు నెలల్లో అందరికీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ ముగించాలని కూడా సిఎం ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ విద్యుత్ అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. జెన్ కో & ట్రాన్స్ కో సిఎండి డి. ప్రభాకర్ రావు, ఎస్.పి.డి.సి.ఎల్. సిఎండి రఘుమారెడ్డి, ఎన్.పి.డి.సి.ఎల్. సిఎండి గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 97వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, దాదాపు ఐదేళ్ల నుంచి ఇవి పేరుకుపోతున్నాయని, అందరికీ కనెక్షన్లు ఇవ్వాలంటే దాదాపు రూ. 600 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డిమాండ్ కు అనుగుణంగా కనెక్షన్లు ఇవ్వకపోవడం వల్ల ఎవరు డబ్బులిస్తే వారికే కనెక్షన్లు ఇచ్చే దందా నడుస్తున్నదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా, రైతులు విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరక్కుండా, ప్రజా ప్రతినిధుల సిఫారసు లేకుండా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందితేనే ఈ అక్రమాలకు తెరపడతుందని సిఎం అన్నారు. అందుకే దరఖాస్తు చేసిన రైతులందరికీ పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న 97 వేల దరఖాస్తులతో పాటు రాబోయే నెలల్లో వచ్చే 20-30 వేల దరఖాస్తులను కూడా పరిగిణలోకి తీసుకుని కనెక్షన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని సిఎం చెప్పారు. ఇంత పెద్ద మొత్తంలో కనెక్షన్లు ఇవ్వడానికి అవసరమైన పరికరాలు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడానికి, లైన్లు వేయడానికి, ఇతరత్రా పనులకు సమయం పడుతుంది కాబట్టి ఏడు నెలల వ్యవధిలో అన్ని పనులు పూర్తి చేసి దరఖాస్తు దారులందరికీ కనెక్షన్లు ఇవ్వాలని చెప్పారు. ఎవరికి ఎప్పుడు కనెక్షన్ వస్తుందో తెలియని అనిశ్చితి తొలగించడానికి కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ మండలంలో ఎప్పుడు కనెక్షన్లు ఇస్తారో షెడ్యూల్ రూపొందించాలని, ఆ వివరాలను బహిర్గతం చేయాలని, గ్రామ పంచాయితీ నోటీసు బోర్డుపై పెట్టాలని సిఎం చెప్పారు. రైతులకు కూడా ఎప్పుడు కనెక్షన్ ఇచ్చేదీ తెలుపుతూ లేఖలు రాయాలని ఆదేశించారు. షెడ్యూల్ రూపొందించిన తర్వాత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని సిఎం అన్నారు. రైతులకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం ఖర్చుకు వెనకాడదని, కావాల్సిన వైర్లు, పోళ్లు, ట్రాన్స్ ఫార్మర్లు, ఇతర సామాగ్రికి ఆర్డర్ ఇవ్వాలని సిఎం ఆదేశించారు.
వ్యవసాయ విద్యుత్ కు ఢోకా లేదు
----------------------------------
తెలంగాణ రాష్ట్రంలో రైతులతో సహా ఏ వర్గం కూడా కరెంటుతో ఇబ్బందులు పడవద్దని సిఎం అన్నారు. ఎండాకాలంలో కూడా కరెంటు కోతులు లేకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రబీ సీజన్లో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. పదివేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ తట్టుకునేలా రూ. 2,450 కోట్ల వ్యయంతో కొత్త సబ్ స్టేషన్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వ్యవసాయ డిమాండ్ కు తగినట్లు విద్యుత్ సరఫరా ఉండాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే బోర్ల ఉపయోగం తగ్గుతుందని, ప్రాజెక్టుల లిఫ్టులకు విద్యుత్ అవసరం పెరుగుతుందని సిఎం అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. చెడిపోయిన ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో వెంటనే మరో ట్రాన్స్ ఫార్మర్ పెట్టాలని సిఎం చెప్పారు. తెలంగాణలో 5,46,000 వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లు ఉన్నాయని, దీనికి 4శాతం మేర ట్రాన్స్ ఫార్మర్లు రోలింగ్ స్టాక్ పెడుతున్నామని వెల్లడించారు. ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని సిఎం కోరారు.
‘జిల్లాల్లో ఏం ఉండాలో తేల్చండి’
--------------------------------
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తయినందున అధికారులు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి పెట్టాలని సిఎం ఆదేశించారు. జిల్లాల్లో పరిపాలనా విభాగాలు సమర్థంగా పనిచేసే విధానం రూపకల్పనపై క్యాంపు కార్యాలయంలో సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష జరిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపిలు కె. కేశవరావు, జితేందర్ రెడ్డి, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, సీనియర్ అధికారులు ఎస్. నర్సింగ్ రావు, శాంతి కుమారి, బి.పి. ఆచార్య, జనార్థన్ రెడ్డి, వాకాటి కరుణ, సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతీ జిల్లాలో ఖచ్చితంగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఉండాల్సిన విభాగాలు నిర్ణయించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫుణ విధిగా ఏమేమి ఉండాలనే విషయంపై ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతీ జిల్లాలో ఖచ్చితంగా నిర్వహించే విభాగాలు గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపాలని సిఎం చెప్పారు. ప్రతీ జిల్లాలో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రం ఉండాలని, ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లా యూనిట్ గా ఏమి సాధించుకోవచ్చో ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. జిల్లా యూనిట్ గా అమలు చేసే పథకాలను కూడా గుర్తించాలని చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

వ్యయమం ఎప్పుడు చేయాలి…..

మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్‌ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా   శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి   ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ ,    మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో   ఎక్సైజ్‌ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని   వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత   శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .

తెలంగాణకు హరితహారం

తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ తమ జిల్లాల్లో, తమ శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై తెలంగాణ సరిహద్దుల వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా అందమైన రకరకాల పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కా ర్యక్రమాన్ని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయంలో 165 కిలోమీటర్ల రోడ్డుపై ఒకేసారి 85 వేల మంది మొక్కలు నాటుతారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరున్న అబ్దుల్లామెట్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు మొక్కలు నాటుతారు. ఈ మొత్తం రహదారిని 14 సెంగ్మెంట్లుగా విభజించారు. ఒక్కో సెంగ్మెంటుకు ఒక్కో అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ కార్యక్రమాన్ని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యవేక్షిస్తున్నారు. స్వయం సహాయక బృందాల సభ...

సీఎంపై వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రిగా కిరణ్ మూడేళ్ల పాలనంతా అస్తవ్యస్తమేనని... వేసీపీ నేత రోజా విమర్శించారు. ఆయనకు మూడేళ్లూ కుర్చీ కాపాడుకోవటానికి సరిపోయిందన్న రోజా... వైఎస్ పథకాలను పేర్లు మార్చి మళ్లీ ప్రవేశపెడుతున్నారని ఆరోపించింది. కిరణ్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసుంటే... 2009లోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించింది