అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. అధికార రిపబ్లికన్‌లు, ప్రతిపక్ష డెమోక్రాట్‌లు పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న భారతీయుల మనసులు దోచుకోవడానికి కొత్తకొత్త పోకడను అవలంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో తమ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ గురించి డిజిటల్ ప్రచార ప్రకటనలు రూపొందించారు. ఆ ప్రకటనల ద్వారా ఇండో-అమెరికన్‌ల ఓట్లు అడుగుతున్నారు.
ఆ డిజిటల్ ప్రకటనల్లో హామీలు, అభ్యర్థనలతోపాటు కొటేషన్‌లు, పాటలు కూడా ఉన్నాయి. బిడెన్ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్ జైన్ భుటోరియా భారతీయ భాషల్లో రూపొందించిన డిజిటల్ ప్రకటనల గురించి వెల్లడించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్ కో ఓట్ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్ న జానా బిడెన్-హారిస్ కో ఓట్ దేనా' పేరుతో మరో పాటను విడుదల చేసినట్లు తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి