దేశంలోని ప్రైవేటు ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) శుభవార్త చెప్పింది. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త పద్ధతి ప్రకారం ఉద్యోగి ఏ రోజైతే పదవీ విరమణ పొందుతాడో అదే రోజు నుంచి పింఛన్ మొదలవుతుంది. ఇది ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు నిజంగా ఒక వరం లాంటిదని ఈపీఎఫ్‌వో వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త పద్ధతి ఈ నెల 30 నుంచే అమల్లోకి రానుందని ఈపీఎఫ్‌వో వెల్లడించింది.
ఉద్యోగి పదవి విరమణ పొందిన తర్వాత పింఛన్ ప్రక్రియ మొదలు కావాలంటే గతంలో నెలల తరబడి పెన్షన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఎంతో పేపర్ వర్క్ ఉండేది. కానీ ఈ నెల 30 నుంచి ఇక ఆ పరిస్థితి ఉండదు. ఉద్యోగి రిటైర్ అయిన రోజు నుంచే ఆటోమేటిక్‌గా పెన్షన్ మొదలవుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి