ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తహసీల్దారు కార్యాలయానికి రూ.10 లక్షలు- 3 నుంచి ధరణి సేవలు




3 నుంచి ధరణి సేవలుతహసీల్దారు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను వచ్చే నెల నుంచి అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఏకీకృత డిజిటల్‌ సేవల పోర్టల్‌ ‘ధరణి’ని అక్టోబరు 3న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దారు కార్యాలయాల్లో నిర్వహించనున్న నేపథ్యంలో సాంకేతిక, మౌలిక వసతుల కల్పనకు ఒక్కో కార్యాలయానికి ప్రభుత్వం రూ.10 లక్షలు కేటాయించింది. కంప్యూటర్లు, ప్రింటర్ల సరఫరా బాధ్యతలను ఒక సంస్థకు అప్పగించినట్లు తెలిసింది. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘ధరణి’ సేవలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీచేశారు. దీనికి అనుగుణంగా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పోర్టల్‌ నిర్వహణ, ఇతర శాఖలకు అనుసంధానంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు కార్యాచరణ ప్రారంభించారు.


గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్వో) వ్యవస్థ రద్దయినప్పటికీ వారిని ఇంకా ఇతర శాఖలకు కేటాయించలేదు. వారికి ఇతర శాఖల్లో బాధ్యతలు అప్పగించే వరకు భూ సంబంధిత వ్యవహారాలు కాకుండా ఇతరత్రా పథకాలు, సమాచార సేకరణకు వారి సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది. అప్పటివరకు వారి వేతనాలను రెవెన్యూశాఖ తరఫునే అందించాలని చెప్పినట్లు తెలిసింది.


ధరణి పోర్టల్‌ నిర్వహణకు వీలుగా తహసీల్దార్‌ కార్యాలయాల్లో అవసరమైన  సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్లను ఆదేశించారు.  ఇప్పటివరకు నమోదు కాని వ్యవసాయేతర ఆస్తుల వివరాలను పక్షం రోజుల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్న సీఎం ఆదేశాలను వెంటనే అమలుచేయాలని సూచించారు. రైతువేదికల నిర్మాణం, పల్లెప్రకృతి వనాలు, వీధి వ్యాపారుల సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు