ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి అరెస్ట్


    ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం నరసింహారెడ్డికి రూ.75 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. అనంతపురంలో 55 ఎకరాలు, సైబర్ టవర్స్ దగ్గర 4 ప్లాట్లు, హఫీజ్‌పేట్‌లో G+3 భవనం, రెండు ఇళ్ళు, రూ.15 లక్షల నగదు, రెండు బ్యాంక్ లాకర్లున్నట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్ మరియు ఇతర వ్యాపారాలలో పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. గతంలో ఉప్పల్ సీఐగా నరసింహారెడ్డి పని చేశారు. పలు ల్యాండ్ సెటిల్మెంట్లు,  భూ వివాదాల్లో ఏసీపీ తల దూర్చినట్లు తెలుస్తోంది. నరసింహా రెడ్డితో పాటు అతని కుటుంబీకుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేశారు. హైదరాబాదులో ఆరు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు