తెలంగాణ ప్రభుత్వం
రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడొ ఏడాది దిగ్విజయం కొనసాగుతూ నెంబర్ వన్ స్టేట్
గా నిలబదింది. కేసీఆర్ నంబర్ వన్ సీఎంగా నిలిచారు.ఆ ఏడాది చెపట్టిన పాలనా సంస్కరణలు
అతి పెద్ద సంస్కరణలు గా చెప్పవచ్చు. తెలంగాణను
31 జిల్లాలు గా మార్చి ,పరిపాలన సౌలభ్యంతో పాటు,ప్రజల సమస్యలను త్వరితగంగా పరిష్కరించేందుకు కేసీ ఆర్ శ్రీ కారం చుట్టారు. వరుస ఎన్నికల విజయాలతో
తిరుగులేని పార్టీగా తెలంగాణ సమితి అవతరించింది.
మెదటి సారి గ్రేటర్ హైదరాబాద్ మన్సిపల్
కార్పోరేషన్ లో ఒంటరిగా బరిలో దిగి విజయం సాధించింది.అటు వరంగల్,ఖమ్మం కార్పోరేషన్
తో పాటు అచ్చం పేట,సిద్దిపేట్,మునిసిపాలిటీల్లో నేగ్గింది. ప్రజల శాంతిభద్రతల విషయంలో
ఎటువంటి రాజీపడకుండా సైబరాబాద్ కమిషనరేట్
ను ... సైబరాబాద్. రాచకొండ కమిషనరేట్లగా...
సిద్దిపేట్, నిజామాబద్ ,వరంగల్. కరీంనగర్ రామగుండంలో పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు
చేసింది.వివిధ ప్రైవేటు సంస్థలు జరిపిన సర్వేలలో తెలంగాణ ప్రజల మన్నను కేసీఆర్ పొందారని తెల్చాయి.వ్యవసాయ మార్కెట్ కమిటిల్లో ఎస్సీ,బీసీ,
మహిళలకు రిజర్వేషన్లను కల్పించారు.రికార్డు స్థాయిలో అతి తక్కువ సమయంలోనే క్యాంపు కార్యాలయం,ప్రగతి భవన్. జనహిత మూడు భవనాలను,
దత్తత గ్రామాలైన ఎర్రవెల్లిలో 330,నరసన్నపేటలో 159 డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆరు నెలల
వ్యవధిలో పూర్తిచేశారు.డిమానిటైజేషన్ ప్రక్రియలో సిద్దిపేట నియోజక వర్గం నగదు రహిత
నియోజక వర్గంగా కాష్లేస్ అసెంబ్లీ సెగ్మెంట్ గా
మార్చేందుకు ప్రణాళికను సిద్దంచేసి
రికార్డు సృష్టించింది.
అలాగే కొన్ని
విషయాలలో ఇబ్బందులను ఎదుర్కోంది. ఎంసెట్ లీకేజీ,రైతుల మల్లన్న సాగర్ నిర్వాసితు ఆందోళనలు,
భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతం కావడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యాలు..విద్యార్థుల
ఫీజు రీయింబర్స్‌మెంట్,రైతుల రుణమాఫీ,పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్ళు,రైతుల సబ్సిడీ,కరువు
పరిస్థితులపై విపక్షాలు పట్టుబిగించాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి