ముఖ్యమంత్రి దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలు నగదు రహిత గ్రామాలుగా మారాయి. ఈరోజు ఎర్రవల్లిలో పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి, నర్సన్నపేటను నగదు రహిత గ్రామాలుగా ప్రకటించారు. సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్ స్ఫూర్తిగా ఇకపై ఈ రెండు గ్రామాలు నగదు రహిత లావాదేవీలకు నమూనాగా మారాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీల్లో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచేలా అందరూ కృషి చేయాలన్నారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను నగదు రహిత లావాదేవీలు నిర్వహించేం దుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రెండు గ్రామాల్లోనూ 1200 మందికి ఇప్పటికే డెబిట్ కార్డులు అందించామన్నారు. మొత్తం 17 స్వైపింగ్ యంత్రాల సాయంతో నగదు లేకుండానే కొనుగోళ్లు జరిగేలా ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ యాప్‌ల వినియోగం, బ్యాంకుమిత్రల సహకారంతో లావాదేవీలు, అన్ని అంశాలను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. సిద్ధిపేట నియోజకవర్గం మొత్తాన్ని నగదు రహితంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి