ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అందరికీ ఒకే న్యాయం: కె. చంద్రశేఖర్ రావు


తెలంగాణ రాష్ట్రంలోని పేదలైన ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం కట్టుబడి వున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన రాజ్యాంగబద్ధ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదనే కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రిజర్వేషన్లు పెంచే విషయంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాల్సిందిగా సిఎం సూచించారు. ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే విషయంపై అనుసరించాల్సిన వ్యూహం గురించి బుదవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. బీసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మ, బీసి కమిషన్ చైర్మన్ బిఎస్. రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, జూలూరి గౌరిశంకర్, ఆంజనేయులు గౌడ్ ముస్లింల స్థితిగతులపై అధ్యయనం జరిపిన కమిషన్ చైర్మన్ సుదీర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్, పోలీస్ కమిషనర్ మహెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బీసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అధిక సంఖ్యలో వున్నారు. వారిలో ఎక్కువ శాతం సామాజిక, ఆర్థిక, విద్య విషయంలో వెనుకబాటు తనాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయాల్లో వారు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. సామాజిక అంతరాలు, ఆర్థిక అసమానతలు, వెనుకబాటు తనం వల్లే యువతలో నిరాశ నిస్పృహలు నెలకొన్నాయి. గతంలో అనేక ఉద్యమాలు కూడా జరిగాయి. ప్రాణ నష్టం కూడా జరిగింది. ప్రజలందరూ పోరాడి సాంధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మారాలి. పేదరికం అనుభవిస్తున్న బలహీనవర్గాలకు ప్రభుత్వం నుండి తగిన తోడ్పాటు అందాలి. వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అందినప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుంది. రిజర్వేషన్ల పెంపు కోసం త్రికరణశుధ్దితో పనిచేయాల్సి ఉంది. కోర్టు వివాదాల్లో కూడా చిక్కుకోకుండా, ఎవరూ ప్రశ్నించలేని విధంగా రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన ప్రక్రియను నిర్వహించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
అందరికీ ఒకే న్యాయం వుండాలి. అన్ని రాష్ట్రాలకు ఒకే చట్టం అమలు కావాలి. తమిళనాడు రాష్ట్రంలో అక్కడి బలహీనవర్గాల జనాభాకు అనుగుణంగా 69 శాతం మేర రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో మాత్రం 50 శాతానికి మించకుండా కోర్టు తీర్పులున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు పెంచి తీరాలి. ముందుగా ముస్లింలు, ఎస్టీలు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు పొందాలి. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుతాం. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో తెలంగాణలో ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం. తమిళనాడులో అనుసరించిన వ్యూహం, రిజర్వేషన్ల పెంపు నేపథ్యం గురించి అధ్యయనం చేయడానికి అధికారుల బృందం త్వరలోనే చెన్నై వెళ్లిరావాలి. అవసరమైన పక్షంలో నేను కూడా చెన్నై వెళ్లి సంబంధిత అధికారులు, న్యాయ నిపుణులతో చర్చిస్తా. మనం రిజర్వేషన్లు పెంచడం, కోర్టు దాన్ని రద్దు చేయడం జరుగకూడదు. పెంచిన రిజర్వేషన్లు అమలయ్యేవిధంగా మన విధానం ఉండాలి’’ అని సిఎం స్పష్టం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ అమలయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీల జనాభా 9 శాతానికి పైగానే ఉంది. రాజ్యాంగ ప్రకారం కూడా ఎస్టీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు కావాల్సివుంది. ముస్లింలు కూడా పేదరికం అనుభవిస్తున్నారు. వారికీ అన్ని రంగాల్లో అవకాశాలు రావాలి. రిజర్వేషన్లు పెరగాలి. ఈ రెండు వర్గాలకు రిజర్వేషన్లు పెంచుతామని టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.