.
చలికాలంలో మనం
సాదారణంగా ఇబ్బింది పెట్టే వ్యాధి... మాములు వ్యాధి జలుబు... జలుబే కదా పోతుందిలే అనుకుంటే
కష్టం..అది ఫ్లూ డా మారితే... పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. తుమ్ములు,ముక్కునండి నీరు
కారడం,తీవ్ర జ్వరం,తలనొప్పి,ఒళ్లనోప్పులు,దగ్గు,అలసట వాంతులు ఉండే అవకాశముంది. ఈ లక్షణాలు
సాదారణంగా జలుబైతే ఐదు రోజుల వరకు తగ్గిపోతాయి. కానీ అలా కాకుండా ఒళ్ళు నొప్పులు తగ్గకపోవడం,శరీర
శక్తి క్షీనించటం కనసాగితే ప్లూ వైరస్ సొకిందని గమనించాలి. ఈ వైరస్ ఇతరులకు రోగి తుమ్మునప్పుడు,దగ్గినపుడు
గాలి ద్వారా సోకుతుంది. చలికాలంలో ఎక్కువగా ఈ ప్లూ వాప్తి చెందుతుంది.
ఇలాంటి ప్లూ
లక్షణాలు గమనించి, డీహైడ్రెషన్ కాకుండా నీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ,గొంతు నొప్పి
ఉంటే ..ఉప్పు కలిపిన వేడి నీటితో పుక్కలించాలి. డాక్టర్ ను 48 గంటలలోపు సంప్రాదిస్తే,మందులతో
ఈ వ్యాధి తీవ్రత తగ్గించే అవకాశముంటుంది. యాంటివైరల్
ముందులు ఒసొల్టోమివీర్(టామిప్లూ),పెరమివీర్, ఉపసమనం కలిగిస్తాయి. ప్లూను గుర్తించి,వెంటనే
డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకుంటే ప్లూ భారీ నుండి ఉపసమనం పొందవచ్చును.
ప్లూ సొకకుండా
తీసుకొవలసిన జాగ్రతలు
ప్లూ కలిగించే
క్రిములు చలి కాలంలో వ్యాప్తి చెందే అవకాశముండటంతో
చేతులతో ముక్కు,కండ్లలను,నోరు తాకరాదు. చేతులను
సబ్బుతో కడగాలి.ఆరు మాసాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో ఎక్కువ
జాగ్రతలు తీసుకొవాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి