జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిందని ,తమిళనాడు న్యూస్ చానెల్స్ జయలలిత చనిపోయారని న్యూస్ ఇస్తున్నారు కానీ అపోలో హాస్పిటల్ నుంచి ఎటువంటి తాజా సమాచారం అందలేదు . అపోలో వైద్యులు ఈ విషయాన్నీ ఖండించారు . ఎక్మో(ECMO) మెషిన్.. ‘ఎక్స్‌ట్రా కార్పోరల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్’.. ఇప్పుడు జయలలిత ప్రాణాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. గంటలుగా తనను ఈ యంత్రంపైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇంతకూ ఎక్మో పని తీరు ఏంటి..? దానిపై ఉంచారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది? అన్న ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి.
ఎక్మో ఏం చేస్తుంది అంటే…
గుండె, ఊపిరితిత్తుల స్థానంలో ఎక్మో పరికరం పనిచేస్తుంది. క్లిష్ట పరిస్థితులలో వాటి బాధ్యతను ఎక్మో స్వీకరిస్తుంది. గుండె, ఊపిరితిత్తులు పని చేస్తూనే వాటికి ఎక్మో సహాయకారిగా ఉండటం లేదా పూర్తిగా గుండె, ఊపిరితిత్తులకు విశ్రాంతినిచ్చి ఆ బాధ్యతను ఎక్మో స్వీకరించడం జరుగుతుంది
మొదటి పద్ధతిలో గుండె, ఊపిరితిత్తులను పూర్తిగా నిలిపేస్తారు. యంత్రమే ఆక్సిజన్ హరించుకు పోయిన చెడు రక్తాన్ని స్వీకరించి, తిరిగి అదే మంచి రక్తాన్ని దేహంలోని అన్ని భాగాలకు పంపిస్తుంది. ఇందులో రక్తాన్ని వెచ్చబరిచే బాధ్యత యంత్రానిదే. ఇందులో గుండె ఊపిరితిత్తుల పాత్ర ఉండదు. అవి విశ్రాంతి తీసుకొంటాయి. అవి మెరుగుపడ్డాక ఎక్మోకు సమాంతరంగా పని చేస్తాయి. చివరకు ఎక్మోను తొలగిస్తారు.
రెండో పద్ధతిలో ఎక్మో ఎనిమిది గంటల పాటు పని చేస్తుంది. అది విజయవంతమై గుండె, ఊపిరితిత్తులు మెరుగు పడితే ఆ తర్వాత గుండె, ఊపిరితిత్తులు, ఎక్మో సమాంతరంగా పని చేయిస్తారు. ఈ పద్ధతిలో యంత్రాన్ని 1-2 వారాలు పనిచేయించవచ్చు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి