ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నోట్ల రద్దుతో తక్షణం ప్రయోజనాలు... పరిణామాలు



రకరకాల అభిప్రాయాలన్నీ ఒకేచోట క్రోడీకరించింది గుడ్ గవర్నెన్స్ సంస్థ… ఇప్పటికైతే కొన్ని లాభాల్ని గుర్తించింది… ఇందులో నిజాలు ఇవే అవి….
1. మావోయిస్టులు, ఇతర స్వదేశీ తీవ్రవాదులు తీవ్రంగా దెబ్బతినిపోయారు
2. జమ్ము కాశ్మీర్ లో అద్దె ఆందోళనలు ఆగిపోయాయి… రాళ్ల దెబ్బలూ ఆగిపోయాయి
3. జమ్ము కాశ్మీర్ లో స్కూళ్లను తగులబెట్టే కార్యక్రమం పూర్తిగా ఆగిపోయింది
4. అవినీతి పరులు దిక్కులేక తమ నల్లధనాన్ని తామే తగులబెట్టుకుంటున్నారు
5. ఉత్తర ప్రదేశ్ లో వంటకు ఉపయోగించే పప్పు ధర కిలో 80 దాకా దిగొచ్చింది
6. కిరాణా షాపులు, పాన్ షాపులు కూడా డెబిట్ కార్డు యంత్రాలను మొదలుపెట్టారు
7. మునిసిపాలిటీలు రికార్డు స్థాయిలో ఇంటి పన్నులను వసూలు చేసుకోగలుగుతున్నాయి
8. విద్యుత్తు సంస్థలకు పాత బకాయిలతోపాటు అన్నీ రికార్డు స్థాయిలో వసూలవుతున్నాయి
9. మందుల షాపుల్లో సేల్స్ విపరీతంగా పెరిగాయి
10. ఢిల్లీ మెట్రో స్మార్ట్ కార్డుల విక్రయం బాగా పెరిగిపోయింది
11. చాలా మంది వ్యాపారులు పాత బకాయిలను వసూలు చేసుకుని, కొత్త అడ్వాన్సులు తీసుకుంటున్నారు
12. మొబైల్ వ్యాలెట్ కంపెనీలకు సూపర్ అవకాశాలు వస్తున్నాయి
13. బ్యాంకులకు ధనం విపరీతంగా వచ్చి చేరుతున్నది… 4 రోజుల్లో 3 లక్షల కోట్లు
14. క్యూ వరుసల్లో నిలబడుతున్నందుకు కూలీలకు మంచి కూలీ దొరుకుతున్నది
15. ఆస్తుల క్రయవిక్రయాలకు ఇచ్చిన అన్నిరకాల బయానాలు, అడ్వాన్సులూ గల్లంతు
16. ఆస్తుల విలువలు ఇప్పటికే కనీసం 25 శాతం తగ్గాయి
17. ప్రజాస్వామ్యం బలపడినట్టయింది… కులాలు, జాతులకు అతీతంగా ఒకే క్యూలలో నిలబడుతున్నారు
18. ఫేక్ కరెన్సీ ముఠాలన్నీ దెబ్బతినిపోయాయి
19. యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో పార్టీలు నిల్వ చేసిన నల్లధనం మటాష్
20. 2000 విలువైన పెద్ద నోట్ల కారణంగా ప్రభుత్వ కరెన్సీ ముద్రణ ఖర్చు తగ్గింది
21. నల్లకుబేరులు తమ దగ్గరున్న నిల్వల్ని కాల్చేయడం వల్ల రెవిన్యూలోటు మాయం
22. అన్ని ఏటీఎంలనూ రీప్రోగ్రామ్ చేయించే పనిలో సాఫ్ట్ వేర్ సంస్థలకు లాభాలు
23. పంజాబ్ లో మాదకద్రవ్యాల ముఠాలు దెబ్బతినిపోయాయి
24. ఐటీ దాడులతో అనేకచోట్ల అక్రమ ఆదాయం, నల్లధనం బయటికి వస్తున్నది
25. నాకాబందీ కార్యక్రమాలతో పోలీసులు పెద్ద ఎత్తున నగదును పట్టుకుంటున్నారు
26. తిక్క క్రికెట్ మ్యాచులు, పిచ్చి సినిమాలకు జనం టైమ్ వేస్ట్ చేయకుండా నిజజీవితాన్ని అర్థం చేసుకుంటున్నారు
27. దేశవ్యాప్తంగా హవాలా రాకెట్లు స్తంభించిపోయాయి
28. బెట్టింగ్, సట్టా రాకెట్లు మూాటాముల్లే సర్దుకున్నాయి
29. రాజకీయ మూల్యం ఆలోచించకుండా నాయకులు ఎలా నిర్ణయాలు తీసుకోవాలో దేశానికి ఓ ఉదాహరణ దొరికింది
30. స్వార్థం లేని రాజకీయ నాయకులు కూడా ఉంటారని జనానికీ అర్థమైంది
31. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్వల్పకాలిక ఇబ్బందుల్ని ఎదుర్కునే గుణం జనానికి అలవడింది
32. ఇన్నిరకాల వైవిధ్యాలున్న ఇండియాలో కఠిన నిర్ణయాలు తీసుకోగలరనీ, ప్రజలూ ఆమోదిస్తారని ప్రపంచానికి చెప్పినట్టయింది
33. ఒకే దెబ్బ, అనేక లాభాలు అనే విషయాన్ని చెప్పటానికి ఇదో ఉదాహరణగా మారింది.

పరిణామాలు 
1. ఆర్ధిక భారం ఎక్కువ మరియు ప్రయోజనం  తక్కువ

2. బ్లాక్ మనీ లేదు నోట్లన్నీ వైటే

3. కరెన్సీ టాక్స్ కట్టనోళ్ల దగ్గరకు చేరితే అది బ్లాక్ మనీ ,టాక్స్ కట్టే వారికి  చేరితే అది వైటే

4. పక్రియ, వ్యక్తులు నింధితులు,కానీ మనం నోట్లను ఆపేస్తున్నాం 

5. పక్రియ, వ్యక్తులు మారనంతవరకు ,బ్లాక్ మనీ బంగారం,  ఇతర ఆస్తుల రూపం లో  మార్చుకోవటానికి కరెన్సీ ని ఉపయోగిస్తారు

6.ప్రభుత్వం అధిక మొత్తం లో బ్లాక్ మనీ ధనికులు వద్ద ఉన్నదని భావిస్తుంది , కానీ కాష్  అధిక మొత్తం లో పేదల వద్ద ఉంటుంది
7. 90 శాతం లిక్విడిటీ కాష్ పేదల వద్ద ఉన్నదీ... అయితే ఇప్పుడు వారి వద్ద కాష్  లేదు

8. వర్తక వాణిజ్యం దెబ్బ తింటున్నది

9. ప్రజలు, బ్యాంకులు  నగదు బదలీ Q - లో ప్రజలను మేనేజ్ చేయటానికే సమయం మొత్తం వృధా చేస్తుంది , దీనివలన మన ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తినే అవకాశముంది .

10.నోట్లను బదిలీ చేయటానికి , నోట్ల ముద్రణ ఖర్చు పెరుగుతుంది .

11. ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశముంది . లిక్విడిటీ   క్రంచ్ ఏర్పడి, లావాదేవీలు తగ్గిపోయి వ్యవస్థ దెబ్బతినే అవకాశముంది 

12. నగదు లేకపోవడం తో కొనుగోలు శక్తి లేకుండా కూరగాయల కొనలేని పరిస్థితి


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.