విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్ర అసెంబ్లీ స్థానాలను పెంచే ప్రతిపాదనను కేంద్ర మంత్రుల బృందం చురుకుగా పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు రాజకీయ సుస్థిరత కోసం విభజన తర్వాత అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నారు.విభజన పై అన్ని రకాల తాయిలాలను పరిశీలిస్తున్న కేంద్రం...ఇప్పడు మరో అడుగు ముందుకేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇరు ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలనే చర్చకు తెరలేపింది. 1966లో పంజాబ్ రాష్ట్రం విభజన జరిగినప్పుడు హర్యానాలో 54 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటి సంఖ్యను 1971లో 90కి పెంచారు. పార్లమెంటు సిఫార్సు మేరకు అసెంబ్లీ సీట్లను పెంచవచ్చు. అలాగే 2000లో ఉత్తరప్రదేశ్‌ను విభజించి ఉత్తరాఖండ్ ఏర్పాటు చేశారు. అప్పటికి 25 అసెంబ్లీ స్థానాలతో ఉన్న ఉత్తరాఖండ్‌ను 2002లో 70 స్థానాలకు విస్తరించారు. జార్ఖండ్‌లో 80 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. దీనివల్లే రాజకీయ అస్థిరత్వం రాజ్యమేలుతోందని, ఈ సంఖ్యను 150కు పెంచాలని ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్ సహా అన్ని పక్షాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.పార్లమెంటు చట్టం ప్రకారం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల తర్వాతే లోక్‌సభ సీట్లను పెంచాలి. కాబట్టి లోక్‌సభ సీట్లను పెంచేందుకు అవకాశం లేదు. కాని అసెంబ్లీ స్థానాలను పెంచుకోవచ్చు. వీటిని ఆయా లోక్‌సభ సీట్లలో సర్దుబాట్లు చేయాలి. ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో 119, ఆంధ్రాలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. తెలంగాణలో 119 సీట్లను 153కు పెంచాలనే డిమాండ్ ఎక్కువవుతోంది. అంటే, ఒక్కో లోక్‌సభ నియోజకవర్గంలో రెండు సీట్లు పెంచవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లోక్‌సభలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రలో కూడా మరో 50 సీట్లను పెంచాలనే డిమాండ్ ఉంది. రెండు ప్రాంతాల్లో రాజకీయ పార్టీలను కూల్ చేసేందుకు.. రాజకీయ ఉపాధి పెంచేందుకు అసెంబ్లీ స్థానాల పెంపుదలను కేంద్రం తెరపైకి తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలు ఇప్పటికిప్పుడు అమలుకాకున్నా, 2019లో జరిగే ఎన్నికలలోపు అసెంబ్లీ స్థానాలను పెంచవచ్చు. జిహెచ్‌ఎంసి పరిధిలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీలోనే 3.5 లక్షలు, మేడ్చల్ అసెంబ్లీలో 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు అసెంబ్లీలు మల్కాజగిరి లోక్‌సభ పరిధిలో ఉన్నాయి. డీలిమిటేషన్ చట్టం కింద పార్లమెంటు ప్యానెల్‌కు అసెంబ్లీ సీట్లను పెంచేందుకు సిఫార్సులు చేసే అధికారం ఉంద భారత రాజ్యాంగం ప్రకారం ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అసెంబ్లీలో 60 సీట్లు, కేంద్ర పాలిత రాష్ట్రం ఏర్పాటుకు 30 సీట్లు అవసరం.
మీరు వ్యయమం చేయటానికి నిశ్చయించుకున్నారా … మరీ ఎప్పుడు ఎక్సైజ్ చేయాలి .. ఏ సమయం అనుకులం అనే అంశాలను న్యూయార్క్ కు చేందిన ఓ రిసర్చ్ సంస్థ కొన్ని సూచనలు చేసింది . ఉదయం టిఫిన్ చేయక ముందు వ్యయమానికి పూనుకొనటం తో దినమంతా శరీరంలో ఉన్న ఫ్యాట్‌ను కరిగించటానికి ఉపయోగపడుతూ శక్తిని ఇస్తుంది . ఉదయం చేయటం వలస బరువు తగ్గటానికి ముఖ్యంగా లావు కాకుండా ఉండటానికి దొహదపడుతుంది . శరీరానిక కావసిన శక్తిని సమకూరుస్తూ , మనం తీసకున్న ఆహారాన్ని జీర్ణించుకొవడమే కాకుండా దినమంతా కొవ్వును కరిగించటానికి ఉపయోగపడుతుంది . ఓ పరశీలన లో ఎక్సైజ్ చేసిన వారు . ఎక్సైజ్ చేయని వారు ఇరువురిని వారం పాటు ఒకే రకమైన ఆహారం తీసుకున్న తర్వాత పరిశీలిస్తే , ఉదయం ఎక్సైజ్ చేసివారు , చేయని వారి మధ్య వ్యత్తాసం కనిపించింది . చేయని వారు కొంత శరీర బరువు పెరగడం జరిగింది . ఉదయం వ్యయమం చేయటం మంచిదని చెబుతున్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి