రాష్ట్రాన్ని హెలెన్ తుపాను వణికిస్తోంది. గ్రామాలకు గ్రామాలనే చుట్టుముడుతోంది. సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. మరోవైపు హెలెన్ తుఫాన్ రూట్ మార్చింది. నెల్లూరు జిల్లా కావలి వద్ద తీరం దాటుతుందనుకుంటే.. ఇప్పుడు మచిలీపట్నంకు తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో హెలెన్ కేంద్రీకృతమై ఉంది. రేపు మద్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దీంతో కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలతో పాటు గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హెలిన్ తుఫాను ఛాయలు విశాఖలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నగర తీర ప్రాంతంలోని సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పాటు బీచ్ కోతకు గురై సముద్రం ముందుకు వచ్చింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలుల వీస్తాయని అధికారులు హెచ్చరిస్తుండడంతో.. ఎలాంటి నష్టాన్ని కలిగిస్తోందని బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటికి మొన్న తుఫాను సృష్టించిన నష్టంతో ఇప్పడిప్పుడే కోలుకుంటున్న జనానికి.. హెలెన్ మరో పీడకలలా తయారైంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీరంలో హెలెన్ తుపాన్ ప్రబావంతో రాకాసి కెరటాలు వేలాది ఎకరాల భూమిని, లక్షలాది కొబ్బరి చెట్లను, సర్వే తోటలను మింగేస్తున్నాయి. హెలెన్ కారణంగా నరసాపురం తీరప్రాంతం చిగురుటాకులా వణుకుతోంది. తీరంలోని చినమైనవానిలంక, పెదమైనవానిలంక, పేరుపాలెం, మోళ్లపర్రు గ్రామాల్లో సముద్రం సమారు 30 మీటర్లు మేర ముందుకు వచ్చింది. దీంతో మత్సకారులు సముద్రంలోకి వేటకు వెల్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పోలీసులు సముద్రం వెంబడి గస్తీ నిర్వహిస్తున్నారు.గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక వద్ద సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం 20 అడుగుల మీర ముందుకొచ్చింది. మత్సకారులు వేట మానేసి పడవలను, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీరం దాటే సమయంలో 70.కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. ఇవాళ రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.తుఫాను తీరం దాటే సమయంలో భీభత్సం సృష్టించే అవకాశం ఉండటతో.. దీన్ని ఎదుర్కొనేందుకు ఆయా ప్రాంతాల్లో అగ్నిమాపక దళం, మెరైన్ పోలీసులు రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారులు తీర ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి