విభజన ప్రక్రియ వేగవంతం అవుతున్న తరుణంలో... సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. తాజాగా ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలంతా ... కొత్త పార్టీ పెట్టాలంటూ సీఎం పై ఒత్తిడి పెంచుతున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ప్రతిపాదనపై మథనపడుతున్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లు అసెంబ్లీకి వస్తే ... ఆ తదుపరి నిర్ణయం అంటున్న కిరణ్ ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఇప్పడు హాట్ టాపిక్.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ సర్కార్ వెనక్కి తగ్గకపోవడంతో సీమాంధ్ర లో కాంగ్రెస్ పార్టీ, నేతల పరిస్థితి దయనీయాంగా మారింది. విభజన ప్రక్రియకు కారణం కాంగ్రెస్ పార్టీయేనంటూ నేతలను గ్రామల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు సీమాంధ్ర ప్రజలు. దీనికి తోడు టీడీపీ, వైఎస్ ఆర్ సీపీ కూడా కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో తెలియక లోలోపల మథనపడుతున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి