రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన జీఓఎం ముందు.... .. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు మళ్లీ తమ పాత వాదనలు వినిపించారు. వీరితో పాటు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా జీవోఎంకు రెండు నివేదికలు ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే... సీమాంధ్ర తో పాటు తెలంగాణలో కూడా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు సీఎం. హైదరాబాద్, విద్య, ఉద్యోగ సమస్యలు ఉత్పన్నమవుతాయి. నక్షలిజం, మతకలహాలుతో పాటు తీవ్రవాద సమస్యలతో పాటు రెండు రాష్ర్టాల మధ్య జలవిధాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. మావోల కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతం వారేనన్న విషయాన్ని కూడా సీఎం తన నివేదికలు గుర్తు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రుల గ్రూపుతో భేటి అయిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు పలు అంశాలపై లోతుగా చర్చంచారు. మొదటగా రాష్ట్రాన్ని సమైక్యంగా నే ఉంచాలని కోరారు. విభజన అనివార్యమైతే హైదరాబాద్ ను యూటీ చేయడమో లేక రెండు రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేయడమో చేయాలన్నారు. HMDA పరిధిలోని హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు ... భద్రాచలాన్ని సీమాంధ్రకే ఇవ్వాలని జీవోఎంను కోరారు. హైదరాబాద్ పన్నుల ఆదాయాన్ని రెండు ప్రాంతాలకు కేటాయించాలన్నారు. సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలని కూడా సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. వెనుకబడ్డ జిల్లాలకు, నియోజకవర్గాల అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల కోసం కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి