ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సీఎం పోస్ట్

రాష్ట్ర ప్రక్రియ వేగవంతం అవుతున్న తరుణంలో సీఎం పోస్ట్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. తెలంగాణ, సీమాంధ్ర నేతలు  కొంత మంది కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారురాష్ట్ర విభజనపై తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వాదనలు ఎలా ఉన్నా... చివరికి కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తలవంచక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అనివార్యమని నేతలు ఒక నిర్ణయానికి వస్తున్నారు. జనవరి నాటికి రెండు రాష్ట్రాలు ఖాయమంటున్న తరుణంలో సీఎం పోస్ట్ ను దక్కించుకునేందుకు తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారుకొత్తగా ఏర్పడబోయే 29వ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ నుంచి పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ప్రముఖంగా సీనియర్ మంత్రి జానారెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ తో కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.  సీమాంధ్ర నుంచి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మంత్రి పురంధరేశ్వరి పోటీ ఉన్నారని తెలుస్తోంది. ఈ నేతలంతా ఎవరికి వారుగా అధిష్టానం వద్ద తమకున్న పలుకుబడితో పావులు కదుపుతున్నారు. మరి అధిష్టానం మాత్రం ఎవరికి పట్టం కడుతుందో వేచిచూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు