బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది . ఏటిఎం దగ్గర సెక్యూరిటీ గార్డు లేకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ప్రజా సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి . దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ను కర్నాటక సర్కార్ కూడా సీరియస్ గా తీసుకుంది . సీఎం సిద్ధరామయ్య .. సమగ్ర విచారణకు ఆదేశించారు కొడుకు పుట్టిన రోజు ఖర్చుల కోసం డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎంకు వెళ్లిన జ్యోతి పై దుండగుడు విచక్షణారహితంగా గాయపర్చాడు . ఆ దృశ్యాలన్ని ఏటీఎంలోని సీసీ టీవీ లో రికార్డ్ అయ్యాయి . సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర తెలిపారు. ఈ కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని పొరుగునున్న ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు కూడా పోలీసు బృందాలు పంపించామన్నారు. బాధితురాలు జ్యోతి ఉదయకుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగాను, ఫుటేజ్ ఆధారంగాను నిందితుడుని పట్టుకోగలమని ధీమా వ్యక్తం చేశారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి