ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఎక్కడ సంపద ఉంటే...అక్కడ దోపిడి

ఇన్ని రోజులు సీమాంధ్ర నేతలను టార్గెట్ చేసిన టిఆర్ఎస్ నేతలు ఇప్పుడు సీమాంధ్ర అధికారులపై దృష్టి సారించారు. నాయకుల భూ ఆక్రమణలకు అధికారులు సహకరిస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నారు. ఒక్కొక్క ఆక్రమణను, అధికారులు, నాయకుల పేర్లను బయటపెడుతామంటున్నారు. కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు కుక్కల వలె వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.


ఎక్కడ సంపద ఉంటే...అక్కడ దోపిడి ఉంటుందనేది నానుడి. హైదరాబాద్ రాజధాని కావడంతో సహజంగానే ఆ ప్రాంతంలోని భూములకు, దాని చుట్టుపక్కల నున్న రంగారెడ్డి జిల్లా భూములకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పాటు హైదరాబాద్ ఐటి హబ్ గా మారడం, రియల్ ఎస్టేట్ బూమ్ రావడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత దశాబ్దకాలంగా నగరంలో భూములకు ఎక్కడ లేని విలువ పెరిగింది. దీంతో నాయకుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా భూ ఆక్రమణలు, దందాలు బాగానే చేశారు. అనేక కేసులు నమోదయ్యాయి. ఇది అందరికి కనిపిస్తున్న దందానే. అయితే ఇటీవల గత కొంతకాలంగా టిఆర్ఎస్ నేతలు భూ దందాలపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విభజన జరుగుతున్న సమయంలో సీమాంధ్ర నేతలు, అక్కడి ప్రాంత అధికారుల సహకారంతో ప్రభుత్వానికి చెందిన భూములను ఇష్టారాజ్యంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని మండిపడుతున్నారు. ముఖ్యంగా సిఎం కిరణ్ కుమార్ రెడ్డి గత నాలుగైదు నెలలుగా తన సోదరుడి ఆధ్వర్యంలో ఇదే పనిలో ఉన్నారని విమర్శిస్తున్నారు. ఇట్లాంటి భూ పందేరాలను వదలబోమని, కచ్చితంగా వీటిపై రివ్యూ చేస్తామని టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ స్వయంగా హెచ్చరించారు. ఇప్పుడు ఆ పార్టీ టిఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు మరోసారి దీనిపై మరోసారి మాట్లాడారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి కలిసి సచివాలయం అడ్డాగా ఈ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, రెవెన్యూ మంత్రి ఓఎస్ డి ఆధ్వర్యంలో భూ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయని ఆరోపించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు