గ్యాస్ సిలెండర్ కు ఆధార్ కార్డుకు లింక్ పెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆధార్ కార్డుల విషయమై గ్యాస్ వినియోగదారులను ఇబ్బంది పెట్టొద్దని సూచించింది. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండానే వంట గ్యాస్ సిలెండర్లను సరఫరా చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో చమురు కంపెనీలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆధార్ కార్డు లేని కారణంగా గ్యాస్ సబ్సిడీ అందడం లేదని, పోనీ ఆధార్ కార్డు తీసుకుందామంటే... దానికోసం నానా యాతనా పడాల్సి వస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా... ఆధార్ కార్డ్ అతీగతీ ఉండడం లేదని వాపోతున్న గ్యాస్ వినియోగదారులకు హైకోర్టు తీర్పు నిజంగా శుభవార్తే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి