ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నరేంద్ర మోడీ నిప్పులు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై బిజేపీ ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. అభివృద్ధిలో పోటీ పడాలని, అబద్ధాలాడటంలో కాదని చురకలు అంటించారాయన. కాంగ్రెస్ చేసిన పాలనా తప్పిదాలను సరిదిద్దడానికి తమకు చాలా కాలం పట్టిందని వ్యాఖ్యానించారు మోడీ.బిజేపీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ను  మాటలతో కడిగేశారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి. అబద్ధాలతో ఎన్నాళ్లు మోసగిస్తారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ లో ఏర్పాటైన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ..ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అబద్ధాల కోరులుగా అభివర్ణించారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు గుజరాత్ ముఖ్యమంత్రి. శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో  మధ్య ప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పాలనా  వైఫల్యాలను సరిచేసేందుకు బిజేపీ సర్కారుకు చాలా కాలం పట్టిందని చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ. మధ్యప్రదేశ్ లో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందిందని,  యాభై ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఇంకా పాఠశాలలకు, రహదారి సౌకర్యాలకు నోచుకోని గ్రామాలున్నాయని నరేంద్ర మోడీ విమర్శించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు