ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఆర్టికల్‌ 371-డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనపై వేగంగా ముందుకు వెళుతున్న కేంద్ర ప్రభుత్వానికి మరో అడ్డంకి వచ్చినట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371-డిని సవరించకుండా ముందుకు వెళ్లడం కష్టమనే అభిప్రాయాన్ని అటార్నీ జనరల్‌ వాహనవతి... మంత్రుల బృందానికి వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టికల్‌ 371- డి అమలులో ఉండగా రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం ఏదైనా రాష్ట్రాన్ని విభజిస్తే, మిగిలిన భాగానికి అది వర్తించదని ఆయన స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజ్యాంగంలోని 4వ అధికరణలో వివరించారని ఆయన మంత్రుల బృందానికి తెలిపినట్లు న్యాయనిపుణుల వర్గాలకు అందిన సమాచారం. ఈ ప్రకారం చూస్తే రాష్ట్ర విభజనకు ముందే ఆర్టికల్‌ 371-డి మార్చడమో లేదా రద్దు చేయడమో జరగాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.రాష్ట్ర విభజన ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా ముగించి ఎన్నికలకు వెళదామని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అనుకోని చిక్కులు వచ్చిపడుతున్నాయి. మరో 15 రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్‌, కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిర్ణయించిన నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371-డితో విభజన ప్రక్రియకు బ్రేక్‌ పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర విభజనతో తలెత్తనున్న సమస్యలు, పరిష్కారంపై ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఏర్పాటు చేసిన కేంద్రమంత్రుల బృందానికి న్యాయ శాఖ సమర్పించిన నివేదిక ఈ మొత్తం ప్రక్రియలో కీలకం కానుంది. పార్లమెంటులో టీ-బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు జీవోఎం కేవలం ఒక్క భేటీతో విభజన ప్రక్రియకు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని పూర్తి చేయాలని భావిస్తుండగా, దానికి ముందే కేంద్ర అటార్నీ జనరల్‌ వాహనవతి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371-డిని సవరించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకు పార్లమెంటు ఆమోదం పొందడం కూడా తప్పనిసరి అని తేల్చి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం రాష్ట్ర విభజనకు అత్యంత కీలకంగా మారిన ఆర్టికల్‌ 371-డిని ఓ సారి పరిశీలిస్తే... 1973 సెప్టెంబర్‌ 21న రాజ్యాంగంలో ఈ ఆర్టికల్‌ను ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ఈ ఆర్టికల్‌ సవరించకుండా లేదా రద్దు చేయకుండా రాష్ట్రాన్ని విభజిస్తే కొత్తగా ఏర్పడనున్న రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు సైతం హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులను వెళ్లిపొమ్మనే హక్కు ఎవరికీ ఉండదు. అలాంటప్పుడు ఎక్కడ ఉన్న వారు అక్కడే పని చేయొచ్చు. ఉద్యోగాలలో జోనల్‌, కేడర్‌ విధానం అమలు చేయడం కూడా సాధ్యం కాదు. అలా కాకుండా, దీనిని ఇలాగే కొనసాగిస్తే ప్రత్యేక రాష్ట్ర హోదా ఉండదు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా రాష్ట్ర విభజన విషయంలో ముందుకు వెళ్లిన పక్షంలో రెండు రాష్ట్రాలలోనూ ఈ ఆర్టికల్‌ను కొనసాగించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిణామం పరిపాలనాపరంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది.రాష్ట్ర విభజన, 371-డి అధికరణ ఒక దాంతో ఒకటి ముడిపడినట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని విభజించి, 371-డిని మాత్రం యథాతథంగా ఉంచడం కుదరదని మంత్రుల బృందానికి అటార్నీ జనరల్ వాహనవతి స్పష్టం చేసినట్లు తెలిసింది. 371-డి సవరణ తప్పదంటూ సమైక్యవాదులు... రాజ్యాంగ సవరణ లేకుండానే చక్కదిద్దవచ్చంటూ తెలంగాణవాదులు ఎవరి వాదన వారు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అలాగే... విభజన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో 371-డిని కొనసాగించాలని టీ-ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో 371-డిపై అడుగు ముందుకు వెయ్యడమెలా? దీనిని ఏం చేయాలి? అనే అంశంపై మంత్రుల బృందం అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని అత్యవసరంగా కోరింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... జీవోఎం లేఖ అందిన ఒక్క రోజులోనే వాహనవతి ఈ అధికరణపై తన అభిప్రాయం చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంట్‌లో బిల్లును ప్రతిపాదించే ముందు రాజ్యాంగ అధికరణ 371-డిని తొలగించాల్సి ఉంటుంది. అందుకు రాజ్యాంగ సవరణ తప్పదు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే రాజ్యాంగంలోని 371-డి మూలంగా ఆంధ్రప్రదేశ్‌కు ఒనగూరిన ప్రత్యేక హోదా రద్దవుతుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు వీలుగా 371-డి విషయంలో రాజ్యాంగ సవరణ చేపట్టక తప్పదు. హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే నేతృత్వంలోని జీవోఎం ఇటీవల వాహనవతిని పిలిచి, 371-డిపై న్యాయ సలహా కోరటంతో ఆయన ఒక నివేదికను అందించారు. నివేదికలో 371-డి పూర్వాపరాలు వివరించటంతోపాటు రాష్ట్ర విభజన అనంతరం దీని విషయంలో అనుసరించాల్సిన విధానంపైనా న్యాయ సలహా ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆర్టికల్ 371-డిని రెండు రాష్ట్రాల్లో కొనసాగించాలంటే మరోసారి రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి ఉంటుంది. 371-డిపై వాహనవతి వ్యక్తం చేసిన అభిప్రాయాలను జీవోఎం ఆమోదించిందా? లేదా? అనేది స్పష్టం కావటం లేదు. అయితే, వాహనవతి వ్యక్తం చేసిన అభిప్రాయాల దృష్టా 371-డిపై ఇతర న్యాయ నిపుణుల అభిప్రాయం కూడా తీసుకోవాలని జీవోఎం యోచిస్తోంది. ఆర్టికల్ 371-డిపై మరికొందరి అభిప్రాయం తీసుకున్న తరువాతే అటార్నీ జనరల్ వాహనవతి నివేదికను ఆమోదించటం లేదా తిరస్కరించటం జరుగుతుందని హోంశాఖ అధికారులు చెబుతున్నారు. ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాన్ని పునర్ వ్యవస్థీకరించే చట్టం వస్తుంది. ఈ క్రమంలో కొన్ని నిబంధనలు, సవరణలు వస్తాయి. కనుక ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం ఏర్పడే సమయంలో వచ్చే పర్యవసానాలను తొలగించడం కానీ, సవరించడం కానీ జరుగుతుంది. దీని ప్రకారం ఆర్టికల్ 371(డి) ని కూడా తొలగించడం కానీ, సవరించడం కానీ జరుగుతుంది. ఈ విషయాన్ని కేబినెట్ నోట్ లోనూ స్పష్టం చేశారు. విభజన విషయంలో ఆర్టికల్ 3కి లోబడే మిగిలిన సవరణలు ఉంటాయి. అయితే ఈ ఆర్టికల్ 3 మొత్తం రాజ్యాంగానికి పైన మాత్రం ఉండదు. ఈ రెండు ఆర్టికల్స్ ను కలపడం సరైనది కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 371-డి విషయంలో కేంద్రానికి రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని పూర్తిగా తొలగించవచ్చు. అయితే, ప్రస్తుతం కేంద్రం ఆ ఆలోచనలో లేదని తెలుస్తోంది. ఈ ఆర్టికల్ ను కొత్త రాష్ట్రాలకు పొడిగించవచ్చు. లేదా ఆర్టికల్ ను సమీక్షించి దానికి సవరణలు చేయొచ్చు. ఇక్కడ అందరూ గుర్తించాల్సిన అంశం ఒకటి ఉంది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే ఉంటుంది. అందులో కొంత భాగం విడిపోయి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడుతుంది. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని రాజ్యాంగ నిబంధనలు అలాగే ఉంటాయి. అయితే, అందులో కొన్ని సవరణలు మాత్రం చేయాల్సి వస్తుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

చానెల్‌ ల రెటింగ్ పద్ధతలో మార్పు అవసరం- నియంత్రన తప్పని సరి

  గత వారం, ముంబై పోలీసులు మూడు న్యూస్ ఛానెళ్లతో కూడిన టిఆర్పి (టార్గెట్ రేటింగ్ పాయింట్స్) రాకెట్టును ఛేదించినట్లు చెప్పారు. అప్పటి నుండి, టిఆర్పిలను పర్యవేక్షించే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) న్యూస్ ఛానల్స్ రేటింగ్లను మూడు నెలలు నిలిపివేసింది. ఈ కుంభకోణం మరోసారి నియంత్రణ అవసరాన్ని ఎత్తి చూపింది. టెలివిజన్ ఛానెల్‌లు టిఆర్‌పిలచే నడపబడతాయి. వీక్షకుల సంఖ్య వారి వ్యాపారాన్ని నడిపిస్తుంది. భారతదేశంలో వారానికి 760 మిలియన్ -800 మిలియన్ల వ్యక్తులు టీవీని చూస్తున్నారు. గ్రామీణ భారతదేశంలో టీవీ ప్రసారాలు   52% కాగా , పట్టణ భారతదేశంలో ఇది 87%. ఈ డిటిహెచ్ ( డైరెక్ట్ టు హోమ్ ) ద్వారా సుమారు 70 -80 మిలియన్ల గృహాలు , కేబుల్ తో 60 మిలియన్లు టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. డెంట్సు   అంచనా (2020)   ప్రకారం భారతదేశం లో మొత్తం ప్రకటనల మార్కెట్ 10 -12 బిలియన్లు . వీటిలో డిజిటల్ వాటా సుమారు 2 బిలియన్లు. ప్రతిరోజూ 550 మిలియన్ల మంది వ్యక్తులు, సుమారు 3.45 గంటలు టీవీ టీవీలో వీక్షిస్తున్నారు.   భారత దేశంతో ఈ 800 కి పైగా ...

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..