భద్రాచలంతో కూడిన తెలంగాణ కావాలని తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రులు పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన GOMతో వారి భేటీ ముగిసింది. భేటీకి జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ హాజరయ్యారు. ముగ్గురు మంత్రులు లిఖిత పూర్వకంగా ఒకే నోట్ ఇచ్చినట్లు సమావేశం అనంతరం వారు వెల్లడించారు. హైదరాబాద్ పై అంక్షలతో ప్రయోజనం ఉండదన్న జైపాల్ రెడ్డి... రెండు ప్రాంతాల ఉద్యోగుల మనోగతం ప్రకారం 371 D ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాలపై ట్రైబ్యునల్ సరిపోతుందని, గోదావరిపై ట్రైబ్యునల్ అవసరం లేదన్నారు. తెలంగాణకు విద్యుత్ సమస్య ఉందంటూనే... ప్రస్తుత ఫార్ములా ప్రకారమే విద్యుత్ ఇవ్వాలని అన్నారు. అంతకుముందు తెలంగాణ కేంద్రమంత్రులు... జైపాల్ రెడ్డి నివాసంలో సమైవేశమై...GOM కు అందించాల్సిన నివేదికపై చర్చించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి