దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఆరుషి హత్య కేసులో సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుషి తల్లిదండ్రుల న్యాయవాది వాదనలు విన్న ఘజియాబాద్ సెషన్స్ కోర్టు కీలక నిర్ణయం . ఐదేళ్ల క్రితం జరిగిన 14 ఏళ్ల బాలిక హత్య అప్పట్లో సంచలనం రేపింది. 2008 మే 16.. నోయిడాలోని ఓ ఇంట్లో జంట హత్యలు. హత్యకుగురైంది 14 ఏళ్ల బాలిక ఆరుషి, వారింట్లో పనిచేసే హెమరాజ్ .. అయితే అసలీ హత్యలు ఎవరు చేశారో ఇప్పటి వరకు తేలలేదు. 2008 మే 16.. నోయిడాలోని ఓ ఇంట్లో జంట హత్యలు. హత్యకుగురైంది 14 ఏళ్ల బాలిక ఆరుషి, వారింట్లో పనిచేసే హెమరాజ్ .. అయితే అసలీ హత్యలు ఎవరు చేశారో ఇప్పటి వరకు తేలలేదు. అయితే ఆరుషి తల్లిదండ్రులు మాత్రం తమకేం తెలియదంటున్నారు. దర్యాప్తులో లోపాలు, మీడియా జోక్యం వల్లే తాము ఇరుక్కుపోయామని అంటున్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటపడతానని రాజేశ్ తల్వార్ చెప్పుకొచ్చాడు.
ఈకేసును టేకప్ చేసిన సీబీఐ ఆరుషిని, వారింట్లో పనిచేసే హేమరాజ్ ను ఆరుషి తల్లిదండ్రులే హత్య చేశారని ఆరోపించింది. ఆరుషి, హేమ్‌రాజ్ ‘అభ్యంతరకర’ స్థితిలో కనిపించడాన్ని సహించలేక తల్లిదండ్రులే వారిని హతమార్చారని దర్యాప్తు అధికారులు సీబీఐ కోర్టుకు తెలిపారు. అయితే తల్వార్ దంపతులు తరపు న్యాయవాది మాత్రం ఆరుషి తల్లిదండ్రులు నిర్దోషులని వాదించారు. నేరం చూసినట్టు నిరూపించగల ఫోరెన్సిక్, భౌతిక సాక్ష్యాలు కూడా లేవని తెలిపారు. ఇరువురు వాదనలు విన్న న్యాయస్థానం ఇవాళ కీలక తీర్పు వెలువరించనుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి