కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, ఆంటోనీలతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. గతంలో తాము ఇచ్చిన విజ్ఞాపనలను మరోసారి గుర్తు చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ముందు కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తో కూడా సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. మంత్రులతో భేటీ అయిన వారిలో కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, చిరంజీవి, జేడీ శీలం ఉన్నారు. ఈ నెలాఖరుకి జీవోఎం సిఫారసులను ఖరారు చేస్తామని మొయిలీ చెప్పారు. విభజన సమస్యల పరిష్కారానికి జీవోఎం కసరత్తు చేస్తోందని, ఇరు ప్రాంతాల ప్రజలపై ప్రభావం చూపే అంశాలను పరిశీలించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్టు మొయిలీ చెప్పారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి