ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కేంద్ర సహాయం చేయాలి : కే సీ ఆర్

జల సంరక్షణ, భూగర్భ జలాల వృద్ధి ప్రధాన లక్ష్యంగా చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమానికి రూ.5 వేల కోట్ల కేంద్ర సహాయం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కి కేసీఆర్ శనివారం లేఖ రాశారు. వచ్చే మూడేళ్ల కోసం మిషన్ కాకతీయ కోసం రూ. 5 వేల కోట్ల కేంద్ర సాయం అందిచాలని నీతి అయోగ్ చేసిన సిపారసులను కూడా ముఖ్యమంత్రి ఈ లేఖ ద్వారా జైట్లీ కి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కూడా తెలంగాణ లోని వెనుకబడిన జిల్లాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజి అందిచాలని చెబుతోందని సిఎం గుర్తు చేశారు. చట్టం ప్రకారమే తెలంగాణలో అమలయ్యే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలకు రూ. 30,571 కోట్ల ప్యాకేజి ఇవ్వాలని కోరిన విషయాన్ని సిఎం మరోసారి గుర్తు చేశారు. కేంద్ర జలవనరుల శాఖ ద్వారా దేశ వ్యాప్తంగా జల సంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సిఎం అన్నారు. ఇదే లక్ష్యంతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపడుతున్నట్లు సిఎం వివరించారు. కాబట్టి మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని కోరారు. మిషన్ కాకతీయ పురోగతిని, చేపట్టిన కార్యక్రమాలను సిఎం ఈ లేఖ ద్వారా వివరించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు