ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని

ప్రధాన మంత్రి  నరేంద్రమోడీ ఆగస్టు 7 రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేయాల్సిందిగా ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆహ్వానించడం జరిగింది. ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. ఏడవ తేది మధ్యాహ్నం 2:20 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3:00 గంటలకు మెదక్ జిల్లా గజ్వేల్ చేరుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి తో కలిసి పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన చేస్తారు. సాయంత్రం 4:30 గంటలకు గజ్వేల్లో బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 6:40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు.

ప్రారంభించనున్న కార్యక్రమాల వివరాలు

1.
మిషన్ భగీరథ తొలి దశ ప్రారంభం
2.
ఆదిలాబాద్ జిల్లా జైపూల్ సింగరేణి నిర్మించిన 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు జాతికి అంకితం
3. రామగుండంలో ఎన్.టి.పి.సి ఆధ్వర్యంలో నిర్మించే 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటుకు శంఖుస్థాపన
4.
ఫర్టిలైజర్ ప్లాంటుకు శంఖుస్థాపన
5.
వరంగల్లోని కాలోజి నారయణ రావు హెల్త్ యూనివర్సిటీ ప్రారంభం
6.
మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వే లైన్కు శంఖుస్థాపన
7.
గజ్వేల్లో బహిరంగ సభ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు