భవన నిర్మాణ కుటుంబాలకు ప్రస్తుతం ప్రభుత్వం అందించే మ్యారేజి గిఫ్ట్ ను రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంచుతూ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. “తెలంగాణ బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డ్” ఆధ్వర్యంలో ఈ నగదు బహుమతి అందజేస్తారు. ఈ బోర్డులో నమోదు అయిన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని పెళ్లికాని యువతులకు, పద్దెనిమిది ఏండ్లు (18) నిండిన పెండ్లీడు ఆడపిల్లలకు వివాహ సమయంలో ఈ నగదు బహుమతి పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా వేలాది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి