ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నదీ జలాల సద్వినియోగం

గోదావరి నది మీద నిర్మిచతలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండగానే ఆ పనులకు సమాంతరంగా లిఫ్టు ద్వారా నీటిని ఎల్లంపల్లి ద్వారా దిగువ రిజర్వాయర్లకు మల్లించే విధంగా కార్యాచరణ రూపొందిచాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నీటిపారుదల విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిచడంతో పాటు నల్లగొండ జిల్లాకు కృష్ణా జలాలందించే డిండి నీటి ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్ల నిర్మాణాలపై నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆ జిల్లా ఎంపీలు, ఎమ్మేల్యేలు ఇంజనీరింగ్ శాఖ ఉన్నతాధికారులతో శనివారం క్యాంపు కార్యాలయంలో సిఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
అటు గోదావరి ఇటు కృష్ణా నదులు మీద నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులు రిజర్వాయర్లకు సంబధించిన డిజైన్లు పనుల పురోగతి మీద ఈ సందర్భంగా సిఎం సమీక్షించారు. మల్లన్న సాగర్ నుంచి బస్వాపూర్ వరకు నిర్మించతలపెట్టిన ప్రధాన రిజర్వాయర్లల్లో నిండిన నీల్లను నిండినట్లే గొలుసుకట్టు చెరువులకు మళ్లించాలని సిఎం తెలిపారు. నీటిని లిఫ్టుల ద్వారా నింపుతూనే చుట్టుపక్కల గ్రామాలలో చెరువులను కుంటలను సమృద్ధిగా నదీ జలాలతో నింపాలని తద్వారా గ్రామాలలో జలకళ తొణికిసలాడుతుందని సిఎం అభిలాషించారు. మల్లన్న సాగర్ నిర్మాణం ద్వారా అటు ఉత్తర తెలంగాణ ఇటు దక్షిణ తెలంగాణకు సాగు అవసరాన్ని బట్టి నీటిని పంపిణీ చేసుకునే వెసులుబాటు వుంటుందని తెలిపారు.
రెండేండ్లలోపే మల్లన్న సాగర్ రిజర్వాయర్ కు నీరు తరలించే విధంగా నిర్మాణం పనులు పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి, డిండి ప్రాజెక్టునుండి నల్లగొండ జిల్లా చౌటుప్పల్ వరకు సాగునీటిని తరలించే కాలువల నిర్మాణం డిజైన్ లను పరిశీలించారు. డిండి నుంచి శివన్నగూడెం వరకు కాలువ నిర్మాణం పైన చర్చించారు. డిండి ప్రాజెక్టు ద్వారా నల్లగొండ కరువు ప్రాంతాలయిన మునుగోడు, దేవరకొండ, చౌటుప్పల్, చిట్యాల ప్రాంతాలకు సాగు నీటిని అందిచాలన్నారు. చింతపల్లి, గొట్టిముక్కల, సింగరాయిపల్లి, కృష్టంపల్లి రిజర్వాయర్లను కృష్ణా జలాలతో నింపి నల్లగొండ కరువును తీర్చేదిశగా పనులు సాగాలని జిల్లా ఇంజనీర్లను సిఎం ఆదేశించారు. నర్లాపూరు నుంచి డిండి ప్రధాన కాలువ నిర్మాణ పనులను చేపట్టాలన్నారు.
ఈ నాలుగు రిజర్వాయర్ల నిర్మాణాల పరిధిలో ముంపు అతి తక్కువగా ఉండేవిధంగా, దూరం పెరగకుండా ఇంజనీరింగ్ నైపుణ్యంతో నీటి కాల్వల నిర్మాణం చేపట్టాలని తెలిపారు.
నీటిని రిజర్వాయర్లలో నిరంతరం నిల్వ వుంచేలా చూడడం ద్వారా చెరువులు, కుంటలు నింపాలని తద్వారా భూగర్భ జలాలల్లో నీటిమట్టం పెరుగుదల ఉంటుందని వివరించారు. తరుచూ వర్షాలు కూడా కురవడానికి రిజర్వాయర్లు దోహదం చేస్తాయని సిఎం అన్నారు. అటు కాళేశ్వరం నుంచి బస్వాపూర్ వరకు ఇటు డిండి నుంచి చివరి రిజర్వాయర్ వరకు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తయ్యే దిశగా నల్లగొండ జిల్లా ఇంజనీర్లు కృషి చేయాలని సిఎం కేసీఆర్ సూచించారు. ఖమ్మం జిల్లా మణుగూరు ప్రాంతానికి లిఫ్టు ద్వారా సాగునీటిని అందిచాలని సిఎం ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లాలు మండలాల పునర్విభజన పై ప్రజల ఆకాంక్షలను సిఎం అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, వేముల వీరేశం, పైళ్ల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రవీంద్ర నాయక్, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలు నాయాక్, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. కే. జోషి, ఇ. ఎన్. సి మురళీధర్, ఒఎస్డీ దేశపతి శ్రీనివాస్, నల్లగొండ జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.