తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 8న నల్గొండ జిల్లాలో
ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. అదే రోజు అన్ని
జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, అధికారులు తమ తమ
జిల్లాల్లో, తమ శాఖల పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. హరితహారం
కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారిపై
తెలంగాణ సరిహద్దుల వరకు 165 కిలోమీటర్ల మేర రోడ్డుకిరువైపులా అందమైన రకరకాల
పూల చెట్లు, నీడనిచ్చే చెట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద ముఖ్యమంత్రి
ప్రారంభించనున్నారు. అదే సమయంలో 165 కిలోమీటర్ల రోడ్డుపై ఒకేసారి 85 వేల
మంది మొక్కలు నాటుతారు. హైదరాబాద్ శివార్లలోని రామోజీ ఫిల్మ్ సిటీ
దగ్గరున్న అబ్దుల్లామెట్ నుంచి నల్గొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం
వరకు మొక్కలు నాటుతారు. ఈ మొత్తం రహదారిని 14 సెంగ్మెంట్లుగా విభజించారు.
ఒక్కో సెంగ్మెంటుకు ఒక్కో అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించారు. ఈ
కార్యక్రమాన్ని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ పర్యవేక్షిస్తున్నారు.
స్వయం సహాయక బృందాల సభ్యులు, విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ
కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతారు.
హైదరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, 10
మండలాలు, 50 గ్రామాలు వస్తాయి. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కూడా
స్వచ్చందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటేలా కార్యాచరణ
రూపొందించారు.14 సెంగ్మెంట్లలో మొక్కల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు కూడా
ఏర్పాటు చేస్తున్నారు. మొక్కలు నాటడమేకాకుండా వాటిని రక్షించే విధంగా కూడా
చర్యలు తీసుకుంటారు. ఒకే రకం పూల చెట్లు కాకుండా పది కిలో మీటర్లకు ఒకరకం,
ఒక రంగు చొప్పున చెట్లను పెంచుతారు. తెలంగాణ నుంచి వెళ్లే అన్నిజాతీయ
రహదారుల కిరువైపులా ఇలాగే మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్ లో బయల్దేరిన ప్రయాణికులు తెలంగాణ సరిహద్దు దాటే వరకు అందమైన,
ఆహ్లాదకరమైన వాతావరణంలో, చల్లని గాలుల మధ్య ప్రయాణం సాగించేలా ఈ పూలచెట్ల
పెంపకం జరుగుతుంది.
ఔషధ మొక్కల పంపిణీకి ఏర్పాట్లు
-----------------------------------
పండ్ల చెట్లు, నీడ చెట్లు, పూల చెట్లతో పాటు ఔషధ మొక్కలు కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ముఖ్యమంత్రి ఆదేశం మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న నగరంలోని కేబిఆర్ పార్కు, శంషాబాద్ ఎయిర్ పోర్టు, నక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా, హైటెక్ సిటీ,
ఔషధ మొక్కల పంపిణీకి ఏర్పాట్లు
-----------------------------------
పండ్ల చెట్లు, నీడ చెట్లు, పూల చెట్లతో పాటు ఔషధ మొక్కలు కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ముఖ్యమంత్రి ఆదేశం మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 11న నగరంలోని కేబిఆర్ పార్కు, శంషాబాద్ ఎయిర్ పోర్టు, నక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా, హైటెక్ సిటీ,
చార్మినార్, ఉప్పల్ ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు పెట్టి ఔషధ మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి