సోషల్ మీడియా ప్రచుయ్యమయ్యంతో పెస్ బుక్,వాట్సాప్‌లో తమ
పోటోలను
తీసి ఎప్పటికప్పుడు పెడుతున్నారు. ఈ ఫీవర్ ప్రాణాలను హరించేవిదంగా తయారైంది. కోంతమంది
విద్యార్థులు జాలీ ట్రప్‌కు వెళ్ళి లోయల వద్ద సెల్పీ దిగటానికి ప్రయత్నించి ప్రాణాలు
పొగొట్టుకున్నారు. సెల్ఫీ కోసం ఎంతటి రిస్కీ ఫీట్
చేసేందుకైనా రెడీ అవుతారు. ప్రమాదం పక్కనే
పొంచివున్నా పట్టించుకోరు. సెల్ఫీ దిగేవారు కాన్‌సన్‌ట్రేషన్
అంతా సెల్‌ఫోన్ వైపే పెడతారు. దృష్టంతా కెమెరా పైనే ఉంచుతారు. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు ప్రాచుర్యం పొందిన తర్వాత సెల్ఫీ ఫీవర్ మరింత
ఎక్కువైంది. వీటిలో కొన్నాళ్ల క్రితం ఎదుటి వారు తీసినవో..
తాము తీసిన ఫొటోలనో అప్‌లోడ్ చేసుకునే వారు. సెల్ఫీ
మూడ్ పెరగడంతో సోషల్ మీడియాలో ఎవరి ప్రొఫైల్ ఫొటోచూసినా... అప్‌లోడ్
చేసిన ఫొటోలు పరిశీలించినా సగానికి సగం ఇవే కనిపిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు ఈ బాట పడుతున్నారు. ఈ ధోరణి వారితో
పాటు ఇతరులకూ ఇబ్బందికరంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. . ప్రతిపకూల వాతావరణ పరిస్థితులు, ఎత్తయిన భవనాలు,
కదులుతున్న వాహనాల్లో ఫొటోలు దిగేటపుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.
బీచ్ ఒడ్డున, లోయల అంచుల్లో, రైలు పట్టాలపై, రోడ్లపై సెల్ఫీ దిగకపోవడమే మంచిది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి