ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు


ప్రభుత్వాసుపత్రులలో సంస్కరణలు చేపట్టాం
ప్రభుత్వాసుపత్రులలో పనితీరు, సేవల నాణ్యత మెరుగుపర్చాం
పేదవాడి ఆరోగ్యం కాపాడటానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో వుంది
క్లినికల్ స్పెషలిస్టుల్ని పార్టు టైమ్ లేదా ఫుల్ టైమ్-ఉచితంగా లేదా పారితోషికంతో పనిచేయడానికి కొత్త విధానం తీసుకొస్తున్నాం ప్రభుత్వాసుపత్రులలో ఇది వినూత్న విధానం
ఎంసీఐ విధి విధానాలు, అర్హతలు అనుగుణంగా నియామకాలు వుంటాయి: సీయం
ప్రవాస భారతీయులు, ఐక్యరాజ్యసమితి కోసం పనిచేసే వైద్య నిపుణులు ఎవరైనా వచ్చి పనిచేసే అవకాశం
స్పెషలిస్టులు వచ్చి ప్రభుత్వాసుపత్రులలో పనిచేయడానికి ఇది ఒక అవకాశం
పారితోషికం తీసుకునేవాళ్లకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చెల్లింపులు చేస్తాంమానవ సేవే మాధవ సేవ అనే స్పిరిట్ తో తీసుకొస్తున్న సేవ ఇది
భారతదేశంలోనే ఇది వినూత్న విధానం
తొలిసారి మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానం ఇది
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం, నరువ, చిట్టివలస, బోయపాలెం, అక్కయ్యపాలెం, మెంటాడ గ్రామాల్లోని 3.55 ఎకరాల భూమిని అంధ్రా ఆర్గానిక్స్ కంపెనీకి మార్కెట్ విలువలో 10 శాతం అద్దెతో మరో ఐదు ఏళ్ల లీజు పొడిగింపుకు మంత్రిమండలి అంగీకారం తెలియజేసింది.
నెల్లూరు జిల్లా తడ మండలం కడలూరు గ్రామంలో 12.07 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి ఎకరా లక్ష రూపాయిల విలువకు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయించింది.
విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుకూరు గ్రామంలో 204.46 ఎకరాల భూమిని మెడికల్ టెక్నాలజీ మాన్యుఫ్యాక్చరింగ్ పార్కు ఏర్పాటుకోసం మెడికల్ అండ్ హెల్త్ డిపార్టుమెంటుకు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయించింది.
అనంతపురం జిల్లా కదిరిలో 421.37 ఎకరాల భూమిని ఎకరా లక్షన్నర రూపాయిల చొప్పున ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయించింది.
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు గ్రామంలో 16.55 ఎకరాల భూమిని ఎకరా రెండున్నర లక్షల రూపాయిల విలువతో ఎలక్ర్టానిక్ క్లష్టర్ ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయించింది. (జీవో ఎంస్ నెంబర్: 155-19.04.2016)
చిత్తూరు జిల్లా తొట్టెంబేడు మండలం తాటిపర్తి గ్రామంలో 315.79 ఎకరాల భూమిని రెండున్నర లక్షల రూపాయిల విలువతో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
అనంతపురం జిల్లా హిందూపురం మండలం కోటిపీ గ్రామంలో 77.01 ఎకరాల భూమిని రెండున్నర లక్షల రూపాయిల విలువతో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు నిమిత్తం ఏపీఐఐసీకి కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయించింది.
వనం-మనం కింద కనీసం కోటి మెక్కలను నాటాలని నిర్ణయించాం: సీయం
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి: సీయం చంద్రబాబు
ఇది సమాజం కోసం చేసే కార్యక్రమం, ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ముందుకురావాలి: సీయం
వనం మనం కార్యక్రమంలో మొక్కలు నాటి ఫోటోలు తీసుకుని ఆగిపోకూడదు కన్న బిడ్డల మాదిరిగా పెంచాలి. సీఎం.
అప్పుడే కార్యక్రమ లక్ష్యం నెరవేరుతుంది. సీఎం
రహదారుల పక్కన పెంచే మొక్కల కోసం ట్రీ గార్డ్స్ అందించేందుకు అందరూ ముందుకు రావాలి: సీయం చంద్రబాబు
ట్రీ గార్డులను డోనర్ల పేరు పెడతాం: సీయం
అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో వనం-మనం కార్యక్రమానికి ప్రాధాన్యం: సీయం
ప్రజా ఉద్యమంగా వనం-మనం కార్యక్రమం పెద్దఎత్తున చేపడుతున్నాం: సీయం
నదులకు, మనకు వున్న అవినాభావ సంబంధాన్ని చాటే ప్రయత్నం పుష్కరాల ద్వారా చేస్తున్నాం: సీయం
11 సాయంత్రం గోదావరి అంత్య పుష్కరాలకు వెళుతున్నాం: సీయం
గోదావరిలో ఏడాది పాటు వున్న పుష్కరుణ్ణి పట్టిసీమ ద్వారా కృష్ణానదికి తీసుకొస్తున్నా: సీయం
రెండేళ్లు పుష్కరుడు మన రాష్ట్రంలోనే వుండి, మనకు జల స్ఫూర్తిని అందిస్తున్నాడు: సీయం
గోదావరి పుష్కరాలలో నిర్వహించినట్టే కృష్ణా పుష్కరాలలో కూడా పన్నెండు రోజులు 12 అంశాలపై చర్చాగోష్ఠులు నిర్వహించాలని తలపెట్టాం: సీయం
అంశాలు : 1) జల సంరక్షణ, సాగునీరు, నదుల అనుసంధానం, 2) అమరావతి, 3) వనం-మనం, 4) వ్యవసాయం, 5) వ్యవసాయ అనుబంధ రంగాలు, 6) విద్య-నాలేడ్జ్ సొసైటీ-స్కిల్ డెవెలప్మెంట్, 7)ఆరోగ్యం-ఫిజికల్ లిటరసీ, మెరుగైన జీవన విధానం, మంచి అలవాట్లు-దురలవాట్లకు దూరం, పోషకాహారం, 8)పేదరికంపై గెలుపు-ఆదాయ వనరులు పెంచడం-ఉపాధి కల్పన, 9) స్వచ్ఛాంధ్రప్రదేశ్, 10)రెండంకెల వృద్ధి-సాధన దిశగా వ్యూహాలు-కార్య ప్రణాళిక, 11)ఇంటర్నెట్ ఆప్ థింగ్స్-ప్రభుత్వంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, -పోస్, -గవర్నెన్స్, కోర్ డాష్ బోర్డ్ మొదలైన అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చగోష్ఠులు నిర్వహిస్తాం : సీయం చంద్రబాబు
విభజనలో అన్యాయం జరిగింది, అవమానం కూడా చేశారు: సీయం చంద్రబాబు
ఏదీ శాస్త్రీయంగా జరగలేదు, విభజనలో హేతుబద్దత లేదు: సీయం
రెండేళ్లయ్యింది, చాలా ఇబ్బందులు వున్నాయి: సీయం
విభజన బిల్లులో ఏఏ అంశాలు పెట్టారో అవన్నీవాస్తవరూపం దాల్చేలా చేయడంలో పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పక్షాల బాధ్యత: సీయం
పార్లమెంటు సాక్షిగా ఆనాడు మాకు అన్యాయం జరిగింది, ఇప్పుడు అదే పార్లమెంటులో న్యాయం చేయాలి
ఎవరికీ లేని ఇబ్బందులు రాష్ట్రమే ఎందుకు ఎదుర్కోవాలి: సీయం చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టుకు మనం ఇంత ప్రాధాన్యం ఇస్తున్నా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాలేదు
ప్రత్యేక హోదా ఇచ్చి అందరితో సమానంగా ఎదిగేలా మా రాష్ట్రానికి న్యాయం చేయండి
రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందుల్ని పెద్దమనుషులు కూర్చుని తొలగించాలి
రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఎందుకు జరుపుకోవడం లేదో తెలియదా
విభజన చేసినప్పుడు వున్న ఉత్సాహం ఇవాళ కాంగ్రెస్లో కనిపించడం లేదు
చేతులు కట్టేసి ముందుకు పరిగెత్తమంటున్నారు

ఎఫ్ఆర్బీఎం వెసులుబాటు అడుగుతున్నాం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.