తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ప్రజలలో అవగాహన పెంచేలా, మొక్కలు నాటడాన్ని ప్రోత్సహించేలా వార్తలు, కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన మీడియా సంస్థలకు, రిపోర్టర్లకు 'హరితమిత్ర' అవార్డులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. హరితహారం కార్యక్రమంపై మంచి వార్తలు రాసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు, మంచి అధ్యయనం చేసి, విశ్లేషణ చేసే ఆర్టికల్స్ కు, ఎడిటర్స్ కు, ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత చైతన్యం కలిగించిన మీడియా సంస్థలకు అవార్డులు ఇస్తామని సిఎం చెప్పారు.
ఈ ఏడాది ఆగష్టు 15 నుంచి ప్రతీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అవార్డులు ఇస్తామన్నారు. మొక్కలు నాటి, వాటిని రక్షించి వాతావరణంలో చల్లదనం, భూగోళంలో పచ్చదనం పెంచాల్సిన అవసరాన్ని మీడియా ప్రజలకు వివరించాలని సిఎం కోరారు. ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం అందించే బహుళ ప్రయోజనాలను ప్రజలకు విడమరిచి చెప్పాలని కోరారు.
ప్రతి ప్రభుత్వ విభాగం ఉన్నత శాఖాధిపతులు వారి వారి డిపార్టమెంటులకు సంబంధించిన ఉద్యోగులు వారి వారి కార్యాలయల్లో నిర్దేశించిన ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎట్ల పాల్గొంటున్నరు.. ఎన్ని మొక్కలు నాటిండ్రు, వాటి సంరక్షణ కోసం ఎటువంటి చర్యలు చేపట్టిండ్రు..అనే విషయాలతో కూడిన నివేదికను ప్రతి రోజు సాయంత్రం కల్లా క్షేత్ర స్థాయిలోని ఉద్యోగులనుంచి పైస్థాయి అధికారులు సేకరించాలని సీఎం సీఎస్ ను ఆదేశించారు. ఆయా శాఖల ఉన్నతాదికారులు తమకు అందిన క్షేత్రస్థాయి నివేదికలను ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు అందచేయాలె..వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తరు. ఆ నివేదికలు సాయంత్రం కల్లా సిఎంవో కార్యాలయానికి చేరాలె అని సిఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు జిల్లా వ్యాప్తంగా సంచరించి ఎప్పటికప్పుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటూ పోవాలని, అన్ని గ్రామాలు పూర్తిగా కవరయ్యేటట్టు చర్యలు ప్రారంభించి, ప్రతిరోజు ప్రోగ్రెస్ రిపోర్టును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందజేయాలని అన్నారు. కింది నుంచి పై స్థాయి వరకు తెలంగాణ పోలీసులందరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని సిఎం అన్నారు.
వనాల పెంపకం సంరక్షణ పట్ల గత ప్రభుత్వాల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో పచ్చదనం పలుచబడిందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. గత పాలనలోని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు సమాజహితం కోరే దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడంలో ఉండాల్సిన విజన్, అందుకు సంబంధించిన ఓరియెంటేషన్ లేకపోవడమే అసలు సమస్య అని తెలిపిన సిఎం దాన్ని అధిగమించడానికే 'తెలంగాణకు హరితహారం' కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా చేపట్టడం జరుగుతోందని వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హరితహారం కార్యక్రమాన్ని నిమ్స్ లో ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సిఎం అదనపు కార్యదర్శులు, అటవీశాఖ ప్రత్యేక అధికారులు భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
రెండు వారాల పాటు సాగే హరితహారం కార్యక్రమాన్ని మరింతగా విజయవంతం చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు వారి సిబ్బంది పూర్తి స్థాయిలో పాల్గొనాలని తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామాన్ని ఆయా మండలాల తహశిల్దారులు, ఎంపిడీవోలు పంచుకోని ప్రతిరోజూ సందర్శించాలని తెలిపారు. మండల స్ధాయిలో తహశిల్దారులు, ఎంపిడీవోలు సహా ప్రతి ఒక్క ప్రభుత్వ విభాగం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ..."ఈ రెండు వారాల హరితహారం ప్రోగ్రాం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతో సహా గ్రామ సర్పంచుల దాకా వారి వారి పనితీరుకు నిదర్శనంగా నిలువనున్నది. వారితో పాటు అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పరీక్షా సమయం. మొక్కలు నాటే కార్యక్రమం ఆశామాషీ వ్యవహరంగా తీసుకోవద్దు. భావి తరాలకు పచ్చని తెలంగాణను మనం బహుమతిగా ఇవ్వాల్సివుంటది. వానలతో ప్రస్తుతం కాలం కూడా కనికరిస్తున్నది. ఇది మొక్కల పెంపకానికి అనువైన అవకాశం...నిర్లక్ష్యంతో చక్కటి అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. అటువంటి అలసత్వాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించదు. వేగులతో రోజువారీ ప్రోగ్రెస్ రిపోర్టును వివిధ రకాలుగా తెప్పించుకుంటున్నం. ఎవరు ఎట్ల పనిచేస్తున్నరో పది జిల్లాలనుంచి మాకు నివేదికలు ప్రతిరోజు అందడం ప్రారంభమైనయి. అలసత్వం వహించిన ప్రజాప్రతినిధులు అధికారుల పేర్లు సరైన సమయంలో బయటికొస్తయి" అని స్పష్టం చేశారు.
"మొక్కలు నాటుడే కాదు వాటిని సంరక్షించేందుకు చర్యలు ముఖ్యం. మండలస్థాయిలో తహశిల్దారులు, ఎంపిడీవోలు గ్రామాలను పంచుకోవాలె. ప్రతిరోజు గ్రామాలు తిరుగాలె. మొక్కలు ఎట్లా నాటుతున్నరు. వాటిని సంరక్షించేందుకు ఎటువంటి కార్యాచరణ చేపడుతున్నరో ప్రతి గ్రామ సర్పంచిని కలిసి మాట్లడాలె. ఈ పదిహేను రోజులు ముగిసేలోపట ఆ మండలం లోని ప్రతి గ్రామం కవర్ కావాలె... ఆ దిశగా తెలంగాణలోని అన్ని మండలాల్లోని తహశిల్దారులు, ఎంపిడీవోలు తక్షణ కార్యాచరణ ప్రారంభించాలె" అని సిఎం తెలిపారు. క్షేత్రస్తాయిలో మొక్కలు నాటి సంరక్షించే కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని అధికారులకు సిఎం సూచించారు.
ప్రతి ప్రభుత్వ విభాగం ఉన్నత శాఖాధిపతులు వారి వారి డిపార్టమెంటులకు సంబంధించిన ఉద్యోగులు వారి వారి కార్యాలయల్లో నిర్దేశించిన ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎట్ల పాల్గొంటున్నరు.. ఎన్ని మొక్కలు నాటిండ్రు, వాటి సంరక్షణ కోసం ఎటువంటి చర్యలు చేపట్టిండ్రు..అనే విషయాలతో కూడిన నివేదికను ప్రతి రోజు సాయంత్రం కల్లా క్షేత్ర స్థాయిలోని ఉద్యోగులనుంచి పైస్థాయి అధికారులు సేకరించాలని సీఎం సీఎస్ ను ఆదేశించారు. ఆయా శాఖల ఉన్నతాదికారులు తమకు అందిన క్షేత్రస్థాయి నివేదికలను ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు అందచేయాలె..వారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తరు. ఆ నివేదికలు సాయంత్రం కల్లా సిఎంవో కార్యాలయానికి చేరాలె అని సిఎం ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు జిల్లా వ్యాప్తంగా సంచరించి ఎప్పటికప్పుడు మొక్కలు నాటే కార్యక్రమాన్ని సమన్వయం చేసుకుంటూ పోవాలని, అన్ని గ్రామాలు పూర్తిగా కవరయ్యేటట్టు చర్యలు ప్రారంభించి, ప్రతిరోజు ప్రోగ్రెస్ రిపోర్టును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు అందజేయాలని అన్నారు. కింది నుంచి పై స్థాయి వరకు తెలంగాణ పోలీసులందరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని సిఎం అన్నారు.
గ్రామాలపట్టున్నే వుంటూ ప్రజలతో మమేకమయి కలియ తిరిగి మొక్కలునాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్ ఎంపీటిసీ తదితర స్థాయిల్లోని ప్రజాప్రతినిధులకు సిఎం సూచించారు. చెట్లను పెంచడంతో పాటు పెరిగిన చెట్లను నరికివేయడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని తెలిపిన ముఖ్యమంత్రి అక్రమంగా అడవులనుంచి కలపను స్మగ్లింగ్ చేసే ప్రొఫెషనల్ స్మగ్లర్ల ఆటకట్టించే దిశగా ఇప్పటికే ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించిందని అన్నారు. స్మగ్లింగునే వృత్తిగా ఎంచుకున్న వారికి ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలనుంచి దూరం పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో చర్యలు ప్రారంభమయినాయని సిఎం తెలిపారు. అడవుల్లో రోజు రోజుకూ చెట్ల సంఖ్య క్షీణిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అడవుల పునరుజ్జీవనం తక్షణ కర్తవ్యంగా పేర్కొన్నారు. సామాజిక అడవుల పెంపకం కార్యక్రమాన్ని దీనికి సమాంతరంగానే చేపట్టాలని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రాన్ని ఎక్కువకాలం ఏలిన ప్రభుత్వాలు వనాల పెంపకానికి చేపట్టిన కార్యక్రమాలు శూన్యమని, అడవులన్నీ తరిగిపోతున్నా ఏనాడూ పట్టించుకోని వీరు హరితహారం కార్యక్రమాన్ని విమర్శించడం హాస్యాస్పదం అని సిఎం దుయ్యబట్టారు. యే సంవత్సరం అచ్చంగా కోటి మొక్కలు నాటిన పాపాన పోని కొంతమంది నేతలు, హరితహారం కార్యక్రమం ప్రజా వుద్యమంలా సాగుతుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంతో కూడ సరిగా తెలుసుకోలేని ప్రతిపక్ష నేతలు హరితహారం ప్రాజెక్టులో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. మేమెట్ల చేసినమో మాలెక్కనే ఆగమాగంగా కేసిఆర్ ప్రభుత్వం నడువాలని నిన్నటిదాకా ఉమ్మడి రాష్ట్రాన్నేలిన పార్టీ అనుకుంటున్నదని అట్లా భావించడం సరికాదని సీఎం హితవు పలికారు. తెలంగాణ ప్రజలకోసం భవిష్యత్తు తరాల కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విమర్శించడం మానుకోవాలన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి