తెలంగాణ ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవసరమైన సమాచారం అందించడానికి, విషయ పరిజ్ఞానం పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు అధికార మాస పత్రిక ‘‘తెలంగాణ’’ ఇకపై ఇంగ్లీషు భాషలో కూడా వెలువడడం సంతోషకరమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. . తెంలంగాణ (ఇంగ్లీషు) మాసపత్రిక తొలి కాపీని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో కేసిఆర్ ఆవిష్కరించారు. ఆయా అంశాలపై విషయ నిపుణులు, అనుభవజ్ఞులు వెలిబుచ్చే అభిప్రాయాలు ప్రచురించాలని సూచించారు.
తెలంగాణలో అన్ని అంశాలకు ప్రాధాన్యత, సముచిత స్థానం కల్పించాలన్నారు. తెలంగాణ సంస్కృతికున్న ప్రత్యేక లక్షణాలు, ఆధ్యాత్మిక అంశాలను, సౌభ్రాతృత్వ విశేషాలు అందించాలని చెప్పారు. తెలంగాణ పత్రిక ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత రెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సిఎం ఓ.ఎస్.డి దేశపతి శ్రీనివాస్, సిఎం పిఆర్ఓలు గటిక విజయ్ కుమార్, రమేష్ హజారి, మిట్ట సైదిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి