శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ అధిష్టానవర్గానికి దరఖాస్తు చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. అనంతపురంలో కరువు యాత్రలు చేసిన, ఎమ్మెల్యేలను గిరిజన ప్రాంతాలకు తీసుకువెళ్లిన సిడీలను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి పంపి ముఖ్యమంత్రి పదవి పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. పార్టీ లో ప్రస్తుతం ఐదు గ్రూపులు ఉన్నాయని , ఆరో గ్రూపు ను నాదెండ్ల తయారు చేసుకుంటున్నారని తెలుగు దేశం సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు .
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి