ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని రెండేళ్ల పాటు(34 నుంచి 36 ఏళ్లకు) పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం 2011 జూలై 1వతేదీ నుంచి 2012 మార్చి 31 వరకూ విడుదలైన, విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే గరిష్ట వయోపరిమితి సడలింపు యూనిఫామ్ సర్వీసులైన పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్ల శాఖలకు వర్తించబోదని స్పష్టం చేశారు. దరఖాస్తుల సమర్పణకు ఇప్పటికే గడువు ముగిసిన నోటిఫికేషన్లకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఇప్పటివరకూ పరీక్షలు నిర్వహించని వాటికి మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి