ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సుప్రీం కోర్టు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తాజా నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, సిబిఐకి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో చంద్రబాబుని కూడా విచారించాలని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భీంరెడ్డి ఎల్లారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ భండారీ, జస్టిస్ మిశ్రా ఈ పిటిషన్ పై వాదనలు విన్నారు. వాదనలు ముగిసిన తరువాత సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి