ఈనాడులో పెట్టుబడుల గురించి సాక్షి ప్రముఖంగా ఇస్తుంటే , సాక్షి లో పెట్టుబడులు,జగన్ కంపెనీల గురించిన ఆరోపణలకు ఈనాడు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పాఠకులలో ఆసక్తి పెంచడానికి యత్నిస్తున్నాయి. ఈనాడు దినపత్రిక జగన్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టిన పదహారు కంపెనీలకు సంబంధించి డైరెక్టర్ గా ఒకరే అన్నిటిలోను ఉన్నారన్న కొత్త విసయం బయటకు వచ్చిందని ఈనాడు మొదటి పేజీలో ప్రచురించింది. ప్రభుత్వం లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు వచ్చిన వసూళ్లను మళ్లించడానికే ఇలా చేసి ఉండవచ్చని ఈనాడు పేర్కొంది. కాగా ఈనాడులో రిలయన్స్ లో పెట్టుబడులు చాలా రహస్యంగా ఉంచారని, ఇది రిలయన్స్ షేర్ హోల్డర్లను మోసం చేయడమేనని సాక్షి రాసింది. సెబి దృష్టి సారించిందని, ఇందుకు సంబంధించిన ప్రాధమిక సాక్ష్యాధారాలు దొరికాయని, ఎన్నడూ రిలయన్స్ వార్షిక నివేదికలలో ఈ పెట్టుబడుల గురించి ప్రస్తావించకపోవడమే సాక్ష్యమని తెలిపింది.మొత్తం రెండు కంపెనీలలో పెట్టుబడులలో జరిగిన అవకతవకలే అనండి,లోపాలే అనండి వాటిని ఇరుపక్షాలు తవ్వి తీసుకుంటున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి