ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

తాజా వార్తలు

 శ్రీలక్ష్మి బెయిల్ రద్దు
ఓఎమ్సి కేసులో నిందితురాలిగా ఉన్న ఐ ఎ ఎస్ అధికారిణి శ్రీలక్ష్మి బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది.ఈకేసులో కొద్ది రోజుల క్రితం అరెస్టు అయిన ఆమెకు సిబిఐ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆమె బెయిల్ రద్దు చేయాలని సిబిఐ హైకోర్టు కు వెళ్లడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.ఈ నెల ఆరో తేదీ లోపు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో అరెస్టు అయిన తొలి మహిళా ఐ ఎ ఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కావడం విశేషం. ఇప్పటికే గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ అరెస్టు అయ్యారు. కాగా కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, బివి శ్రీనివాసరెడ్డిలు కూడా జైలులో ఉన్నారు.
టైమ్స్ ఆఫ్ ఇండియాకు జగన్ బహిరంగ లేఖ 
 వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈసారి టైమ్స్ ఆఫ్ ఇండియాపై విరుచుకు పడ్డారు .కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విలీనం కావడానికి జగన్ కాంగ్రెస్ పెద్దలతో అవగాహన కుదుర్చుకున్నారని జనవరి ఒకటో తేదీన  టైమ్స్ అఫ్ ఇండియా ఒక కథనం ప్రచురించింది .తెలుగు దేశంకు అనుకూలంగా టైమ్స్ అఫ్ ఇండియా పత్రిక వ్యవహరిస్తుందని ఆరోపించారు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు