ఓఎంసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ లకు న్యాయస్థానం ఈనెల 25వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. విచారణ నిమిత్తం వారిని సీబీఐ అధికారులు గురువారం చంచలగూడ జైలు నుంచి నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీటు ప్రతులను న్యాయస్థానం గాలి జనార్ధనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు అందచేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి