ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2013లోని పోస్ట్‌లను చూపుతోంది

తెలంగాణా బిల్లుకు రంగం సిద్దం

తెలంగాణా  బిల్లుకు రంగం సిద్దం .నివేదికను ఖరారు చేసిన మంత్రుల బృందం ఆ నివేదికను కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సమర్పించవచ్చని అది డిసెంబరు నాలుగో కావచ్చని కథనాలు వస్తున్నాయి .పది జిల్లాల తెలంగాణ ఖరారు చేసిందని, హైదరాబాద్ ను యుటి చేయాలన్న డిమాండ్ , రాయల తెలంగాణ డిమాండ్ ను కాంగ్రెస్ హై కమాండ్ తోసిపుచ్చినట్లే నని ,ఆ తర్వాత ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రివర్గం లో పెడతారని చెబుతున్నారు.

వర్గ పోరు

కాంగ్రెస్ లో వర్గ పోరు ముదురుతోంది.అధిష్టానానికి మద్దతు ఇస్తున్నవారు ఒక వర్గంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇస్తున్నవారు.కొందరు కిరణ్ కు అనుకూలంగా  మరికొందరు తెలంగాణా కు మద్దతుగా మాటలడుతున్నారు .

రాయల తెలంగాణకు ప్రజలు అంగీకరించరు

రాయల తెలంగాణకు ప్రజలు అంగీకరించే ప్రసక్తే లేదని... తెలుగుదేశం తెలంగాణ ఫోరం నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. సోనియా, కేసీఆర్ నాటకంలో భాగంగానే... రాయల తెలంగాణ అంటూ... కాంగ్రెస్ మరో కొత్త డ్రామాకు తెరతీసిందని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లలాగే తెలంగాణ బిల్లునూ... పార్లమెంటులో పెట్టి వదిలేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు

సీఎంపై వైసీపీ నేత రోజా తీవ్ర వ్యాఖ్యలు

ముఖ్యమంత్రిగా కిరణ్ మూడేళ్ల పాలనంతా అస్తవ్యస్తమేనని... వేసీపీ నేత రోజా విమర్శించారు. ఆయనకు మూడేళ్లూ కుర్చీ కాపాడుకోవటానికి సరిపోయిందన్న రోజా... వైఎస్ పథకాలను పేర్లు మార్చి మళ్లీ ప్రవేశపెడుతున్నారని ఆరోపించింది. కిరణ్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసుంటే... 2009లోనే ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించి ఉండేవారు కాదని వ్యాఖ్యానించింది

రాయల తెలంగాణ ప్రతిపాదన

రాయల తెలంగాణ ప్రతిపాదన శుభపరిణామం అన్నారు మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి.  రాయల తెలంగాణపై సోనియా చెప్పిందే ఫైనల్ అన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికే ఈ ప్రతిపాదన చేస్తున్నారన్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. కిరణ్ తనకు శక్తికి మించి సమైక్య వాదాన్ని వినిపిస్తున్నారని జేసీ అన్నారు

ఆరుషి హత్య కేసులో సీబీఐ కోర్టు తీర్పు

 దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఆరుషి హత్య కేసులో సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుషి తల్లిదండ్రుల న్యాయవాది వాదనలు విన్న ఘజియాబాద్ సెషన్స్ కోర్టు  కీలక నిర్ణయం .  ఐదేళ్ల క్రితం జరిగిన 14 ఏళ్ల బాలిక హత్య అప్పట్లో సంచలనం రేపింది. 2008 మే 16.. నోయిడాలోని ఓ ఇంట్లో జంట హత్యలు.   హత్యకుగురైంది  14 ఏళ్ల బాలిక  ఆరుషి, వారింట్లో పనిచేసే హెమరాజ్ .. అయితే అసలీ హత్యలు ఎవరు చేశారో ఇప్పటి వరకు తేలలేదు.  2008 మే 16.. నోయిడాలోని ఓ ఇంట్లో జంట హత్యలు.   హత్యకుగురైంది  14 ఏళ్ల బాలిక  ఆరుషి, వారింట్లో పనిచేసే హెమరాజ్ .. అయితే అసలీ హత్యలు ఎవరు చేశారో ఇప్పటి వరకు తేలలేదు. అయితే ఆరుషి తల్లిదండ్రులు మాత్రం తమకేం తెలియదంటున్నారు.  దర్యాప్తులో లోపాలు, మీడియా జోక్యం వల్లే   తాము    ఇరుక్కుపోయామని అంటున్నారు. భారత న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటపడతానని రాజేశ్ తల్వార్   చెప్పుకొచ్చాడు.  ఈకేసును టేకప్ చేసిన సీబీఐ ఆరుషిని, వారింట్లో పనిచేసే హేమరాజ...

ఆంధ్ర అసెంబ్లీ స్థానాలను పెంచే ప్రతిపాదన

విభజన తర్వాత  తెలంగాణ, ఆంధ్ర అసెంబ్లీ స్థానాలను పెంచే ప్రతిపాదనను కేంద్ర మంత్రుల బృందం చురుకుగా పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు రాజకీయ సుస్థిరత కోసం విభజన తర్వాత అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నారు.విభజన పై  అన్ని రకాల తాయిలాలను పరిశీలిస్తున్న కేంద్రం...ఇప్పడు మరో అడుగు ముందుకేసింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ఇరు ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలనే చర్చకు తెరలేపింది. 1966లో పంజాబ్ రాష్ట్రం విభజన జరిగినప్పుడు హర్యానాలో 54 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటి సంఖ్యను 1971లో 90కి పెంచారు. పార్లమెంటు సిఫార్సు మేరకు అసెంబ్లీ సీట్లను పెంచవచ్చు. అలాగే 2000లో ఉత్తరప్రదేశ్‌ను విభజించి ఉత్తరాఖండ్ ఏర్పాటు చేశారు. అప్పటికి 25 అసెంబ్లీ స్థానాలతో ఉన్న ఉత్తరాఖండ్‌ను 2002లో 70 స్థానాలకు విస్తరించారు. జార్ఖండ్‌లో 80 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. దీనివల్లే రాజకీయ అస్థిరత్వం రాజ్యమేలుతోందని, ఈ సంఖ్యను 150కు పెంచాలని ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్ సహా అన్ని పక్షాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.పార్లమెంటు చట్టం ప్రక...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న పెన్షన్ నియమాలనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తించేలా చేయాలని పీఆర్సీ నివేదికను కోరినట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్, ఎడ్యుకేషనల్ రీ ఇంబర్స్ మెంట్. విశాఖపట్నం నుంచీ ఆదిలాబాద్ వరకూ ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు మినిమం ఏడాది మాగ్జిమమ్ రెండేళ్లు పనిచేసేలా నియమాలలో మార్పులు చేయాలని పీఆర్సీని కోరినట్లు ఆయన చెప్పారు. పీఆర్సీతో మూడు గంటలపాటు  సమావేశమైన ఏపీఎన్జీవోలు.. వివిధ డిమాండ్లపై చర్చలు జరిపారు. తమ డిమాండ్లపై త్వరలో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశం కావాలనుకుంటున్నారు. ౨015 డిసెంబర్ 15 లోపు పీఆర్సీ నివేదిక పూర్తి చేసి ప్రభుత్వానికి అందించాలని కోరారు.

ఎక్కడ సంపద ఉంటే...అక్కడ దోపిడి

ఇన్ని రోజులు సీమాంధ్ర నేతలను టార్గెట్ చేసిన టిఆర్ఎస్ నేతలు ఇప్పుడు సీమాంధ్ర అధికారులపై దృష్టి సారించారు. నాయకుల భూ ఆక్రమణలకు అధికారులు సహకరిస్తే వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తున్నారు. ఒక్కొక్క ఆక్రమణను, అధికారులు, నాయకుల పేర్లను బయటపెడుతామంటున్నారు. కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు కుక్కల వలె వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. ఎక్కడ సంపద ఉంటే...అక్కడ దోపిడి ఉంటుందనేది నానుడి. హైదరాబాద్ రాజధాని కావడంతో సహజంగానే ఆ ప్రాంతంలోని భూములకు, దాని చుట్టుపక్కల నున్న రంగారెడ్డి జిల్లా భూములకు డిమాండ్ ఏర్పడింది. దీంతో పాటు హైదరాబాద్ ఐటి హబ్ గా మారడం, రియల్ ఎస్టేట్ బూమ్ రావడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. గత దశాబ్దకాలంగా నగరంలో భూములకు ఎక్కడ లేని విలువ పెరిగింది. దీంతో నాయకుల అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా భూ ఆక్రమణలు, దందాలు బాగానే చేశారు. అనేక కేసులు నమోదయ్యాయి. ఇది అందరికి కనిపిస్తున్న దందానే. అయితే ఇటీవల గత కొంతకాలంగా టిఆర్ఎస్ నేతలు భూ దందాలపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విభజన జరుగుతున్న సమయంలో సీమాంధ్ర నేతలు, అక్కడి ప్రాంత అధికారుల సహకారంతో ప్రభుత్వానికి చెందిన భూ...

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ

విభజన ప్రక్రియ వేగవంతం అవుతున్న తరుణంలో... సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. తాజాగా ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలంతా ... కొత్త పార్టీ పెట్టాలంటూ సీఎం పై ఒత్తిడి పెంచుతున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ప్రతిపాదనపై మథనపడుతున్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లు అసెంబ్లీకి వస్తే ... ఆ తదుపరి నిర్ణయం అంటున్న కిరణ్ ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఇప్పడు హాట్ టాపిక్. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ సర్కార్ వెనక్కి తగ్గకపోవడంతో సీమాంధ్ర లో కాంగ్రెస్ పార్టీ, నేతల పరిస్థితి దయనీయాంగా మారింది. విభజన ప్రక్రియకు కారణం కాంగ్రెస్ పార్టీయేనంటూ నేతలను గ్రామల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు సీమాంధ్ర ప్రజలు. దీనికి తోడు టీడీపీ, వైఎస్ ఆర్ సీపీ కూడా కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో తెలియక లోలోపల మథనపడుతున్నారు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు.

ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో... శ్రీవారి పాదాల చెంత ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశవిదేశాల్లో వివిధ సంస్థలు నడుపుతున్న హీరా గ్రూప్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఇస్లాం యూనివర్సిటీ ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోయినప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలతో యూనివర్సిటీ భవన నిర్మాణం జరుగుతోంది. కానీ నిర్వాహకులు తమ పరపతిని ఉపయోగించి అనుమతులు తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇస్లాం కాలేజ్ పై గతంలోనే ఇంటిలిజెన్సు అధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది

కన్నా అభిమానులు సందడి

గుంటూరులో కన్నా అభిమానులు  సందడి చేస్తున్నారు. నెల రోజుల నుంచి ముఖ్యమంత్రిని మార్చేస్తారంటూ రాష్ట్రంలో జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గుంటూరులో  ఫ్లెక్సీలు వెలిశాయి. నిజంగా సీఎంను మారుస్తారా... లేక కాంగ్రెస్ వ్యూహమా అనేది పక్కన పెడితే. ముఖ్యమంత్రిగా కన్నా పేరు మాత్రం విస్త్రతంగా ప్రచారం జరుగుతుంది. కన్నా అభిమానులు మాత్రం ప్లెక్సీలు ఏర్పాటు చేసి హల్ చల్ చేస్తున్నారు.

హెలెన్‌ తుపాను -తీరప్రాంతం వణుకు

రాష్ట్రాన్ని హెలెన్‌ తుపాను వణికిస్తోంది. గ్రామాలకు గ్రామాలనే చుట్టుముడుతోంది. సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. మరోవైపు హెలెన్ తుఫాన్ రూట్ మార్చింది. నెల్లూరు జిల్లా కావలి వద్ద తీరం దాటుతుందనుకుంటే.. ఇప్పుడు మచిలీపట్నంకు తూర్పు ఆగ్నేయంగా 230 కిలోమీటర్ల దూరంలో హెలెన్ కేంద్రీకృతమై ఉంది. రేపు మద్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. దీంతో కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలతో పాటు గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హెలిన్ తుఫాను ఛాయలు విశాఖలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నగర తీర ప్రాంతంలోని సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో పాటు బీచ్ కోతకు గురై సముద్రం ముందుకు వచ్చింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలుల వీస్తాయని అధికారులు హెచ్చరిస్తుండడంతో.. ఎలాంటి నష్టాన్ని కలిగిస్తోందని బెంబేలెత్తిపోతున్నారు. మొన్నటికి మొన్న తుఫాను సృష్టించిన నష్టంతో ఇప్పడిప్పుడే కోలుకుంటున్న జనానికి.. హెలెన్ మరో పీడకలలా తయారైంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీరంలో హెలెన్ తుపాన్ ప్రబావంతో రాకాసి కెరటాలు వేలాది ఎకరాల భూమిని, లక్షలాది కొబ్బరి చెట్లను, సర్వే తోటలను మింగేస్తున్నాయ...

గ్యాస్ సిలెండర్ కు ఆధార్ కార్డుకు లింక్

గ్యాస్ సిలెండర్ కు ఆధార్ కార్డుకు లింక్ పెట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆధార్ కార్డుల విషయమై గ్యాస్ వినియోగదారులను ఇబ్బంది పెట్టొద్దని సూచించింది. ఆధార్ కార్డుతో సంబంధం లేకుండానే వంట గ్యాస్ సిలెండర్లను సరఫరా చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో చమురు కంపెనీలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆధార్ కార్డు లేని కారణంగా గ్యాస్ సబ్సిడీ అందడం లేదని, పోనీ ఆధార్ కార్డు తీసుకుందామంటే... దానికోసం నానా యాతనా పడాల్సి వస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా... ఆధార్ కార్డ్ అతీగతీ ఉండడం లేదని వాపోతున్న గ్యాస్ వినియోగదారులకు హైకోర్టు తీర్పు నిజంగా శుభవార్తే.

బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి

 బెంగళూరులోని ఏటీఎంలో మహిళపై దాడి ఘటనపై  దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది . ఏటిఎం దగ్గర  సెక్యూరిటీ గార్డు లేకపోవడం వల్లే ఈ ఘటన  చోటు చేసుకుందని ప్రజా సంఘాలు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి .  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ను కర్నాటక సర్కార్  కూడా సీరియస్ గా  తీసుకుంది .  సీఎం సిద్ధరామయ్య .. సమగ్ర విచారణకు ఆదేశించారు కొడుకు పుట్టిన రోజు ఖర్చుల కోసం డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎంకు వెళ్లిన జ్యోతి పై దుండగుడు విచక్షణారహితంగా గాయపర్చాడు . ఆ దృశ్యాలన్ని  ఏటీఎంలోని సీసీ టీవీ లో రికార్డ్  అయ్యాయి . సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని  బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర తెలిపారు.  ఈ కేసు ఛేదించేందుకు  ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని పొరుగునున్న ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు కూడా పోలీసు బృందాలు పంపించామన్నారు. బాధితురాలు జ్యోతి ఉదయకుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగాను, ఫుటేజ్ ఆధారంగాను నిందితుడుని పట్టుకోగలమని ధీమా వ్యక్తం చేశారు

ఆంటోనీలతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ

 కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, ఆంటోనీలతో సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. గతంలో తాము ఇచ్చిన విజ్ఞాపనలను మరోసారి గుర్తు చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ముందు కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తో కూడా సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. మంత్రులతో భేటీ అయిన వారిలో కావూరి సాంబశివరావు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి,  చిరంజీవి, జేడీ శీలం ఉన్నారు. ఈ నెలాఖరుకి జీవోఎం సిఫారసులను ఖరారు చేస్తామని మొయిలీ చెప్పారు. విభజన సమస్యల పరిష్కారానికి జీవోఎం కసరత్తు చేస్తోందని, ఇరు ప్రాంతాల ప్రజలపై ప్రభావం చూపే అంశాలను పరిశీలించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్టు మొయిలీ చెప్పారు

ఆర్టికల్‌ 371-డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనపై వేగంగా ముందుకు వెళుతున్న కేంద్ర ప్రభుత్వానికి మరో అడ్డంకి వచ్చినట్లు కనిపిస్తున్నది. రాష్ట్ర విభజన విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 371-డిని సవరించకుండా ముందుకు వెళ్లడం కష్టమనే అభిప్రాయాన్ని అటార్నీ జనరల్‌ వాహనవతి... మంత్రుల బృందానికి వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టికల్‌ 371- డి అమలులో ఉండగా రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం ఏదైనా రాష్ట్రాన్ని విభజిస్తే, మిగిలిన భాగానికి అది వర్తించదని ఆయన స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాజ్యాంగంలోని 4వ అధికరణలో వివరించారని ఆయన మంత్రుల బృందానికి తెలిపినట్లు న్యాయనిపుణుల వర్గాలకు అందిన సమాచారం. ఈ ప్రకారం చూస్తే రాష్ట్ర విభజనకు ముందే ఆర్టికల్‌ 371-డి మార్చడమో లేదా రద్దు చేయడమో జరగాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.రాష్ట్ర విభజన ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా ముగించి ఎన్నికలకు వెళదామని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అనుకోని చిక్కులు వచ్చిపడుతున్నాయి. మరో 15 రోజుల్లో ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని కాంగ్రెస్‌, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ...

సీఎం పోస్ట్

రాష్ట్ర ప్రక్రియ వేగవంతం అవుతున్న తరుణంలో సీఎం పోస్ట్ కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. తెలంగాణ, సీమాంధ్ర నేతలు  కొంత మంది కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నారురాష్ట్ర విభజనపై తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతల వాదనలు ఎలా ఉన్నా... చివరికి కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తలవంచక తప్పని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అనివార్యమని నేతలు ఒక నిర్ణయానికి వస్తున్నారు. జనవరి నాటికి రెండు రాష్ట్రాలు ఖాయమంటున్న తరుణంలో సీఎం పోస్ట్ ను దక్కించుకునేందుకు తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారుకొత్తగా ఏర్పడబోయే 29వ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ నుంచి పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ప్రముఖంగా సీనియర్ మంత్రి జానారెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ తో కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.  సీమాంధ్ర నుంచి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, కేం...

జీవోఎంతో ముగిసిన తెలంగాణ కేంద్రమంత్రుల భేటీ

భద్రాచలంతో కూడిన తెలంగాణ కావాలని తెలంగాణ ప్రాంత కేంద్రమంత్రులు పునరుద్ఘాటించారు. రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన GOMతో వారి భేటీ ముగిసింది. భేటీకి జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ హాజరయ్యారు. ముగ్గురు మంత్రులు లిఖిత పూర్వకంగా ఒకే నోట్ ఇచ్చినట్లు సమావేశం అనంతరం వారు వెల్లడించారు. హైదరాబాద్ పై అంక్షలతో ప్రయోజనం ఉండదన్న జైపాల్ రెడ్డి... రెండు ప్రాంతాల ఉద్యోగుల మనోగతం ప్రకారం 371 D ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాలపై ట్రైబ్యునల్ సరిపోతుందని, గోదావరిపై ట్రైబ్యునల్ అవసరం లేదన్నారు. తెలంగాణకు విద్యుత్ సమస్య ఉందంటూనే... ప్రస్తుత ఫార్ములా ప్రకారమే విద్యుత్ ఇవ్వాలని అన్నారు. అంతకుముందు తెలంగాణ కేంద్రమంత్రులు... జైపాల్ రెడ్డి నివాసంలో సమైవేశమై...GOM కు అందించాల్సిన నివేదికపై చర్చించారు.

నరేంద్ర మోడీ నిప్పులు

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై బిజేపీ ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. అభివృద్ధిలో పోటీ పడాలని, అబద్ధాలాడటంలో కాదని చురకలు అంటించారాయన. కాంగ్రెస్ చేసిన పాలనా తప్పిదాలను సరిదిద్దడానికి తమకు చాలా కాలం పట్టిందని వ్యాఖ్యానించారు మోడీ.బిజేపీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ ను  మాటలతో కడిగేశారు. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి. అబద్ధాలతో ఎన్నాళ్లు మోసగిస్తారని మండిపడ్డారు. మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ లో ఏర్పాటైన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ..ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అబద్ధాల కోరులుగా అభివర్ణించారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు గుజరాత్ ముఖ్యమంత్రి. శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలో  మధ్య ప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందిందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పాలనా  వైఫల్యాలను సరిచేసేందుకు బిజేపీ సర్కారుకు చాలా కాలం పట్టిందని చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ. మధ్యప్రదేశ్ లో పర్యా...

జీఓఎం ముందు...రాష్ట్ర కేంద్ర మంత్రులు

రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన జీఓఎం ముందు.... .. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు మళ్లీ తమ పాత వాదనలు వినిపించారు. వీరితో పాటు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా జీవోఎంకు రెండు నివేదికలు ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగితే... సీమాంధ్ర తో పాటు తెలంగాణలో కూడా అభివృద్ధి కుంటుపడుతుందన్నారు సీఎం.  హైదరాబాద్, విద్య, ఉద్యోగ సమస్యలు ఉత్పన్నమవుతాయి. నక్షలిజం, మతకలహాలుతో పాటు తీవ్రవాద సమస్యలతో పాటు రెండు రాష్ర్టాల మధ్య జలవిధాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. మావోల కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎక్కువ మంది తెలంగాణ ప్రాంతం వారేనన్న విషయాన్ని కూడా సీఎం తన నివేదికలు గుర్తు చేశారు. ఢిల్లీలో  కేంద్ర మంత్రుల గ్రూపుతో భేటి అయిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు పలు అంశాలపై లోతుగా చర్చంచారు. మొదటగా రాష్ట్రాన్ని సమైక్యంగా నే ఉంచాలని కోరారు. విభజన అనివార్యమైతే  హైదరాబాద్ ను యూటీ చేయడమో లేక రెండు రాష్ట్రాలకు శాశ్వత ఉమ్మడి రాజధానిగా చేయడమో చేయాలన్నారు. HMDA పరిధిలోని హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు ...  భద్రాచలాన్ని సీ...

సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నాటకాలు

 సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నాటకాలు ఆడడం మానాలని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. టిడిపి మొదటి నుంచి ఒకే విధానంతో ఉందని బాబు తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కు తెలియకుండానే కేంద్ర ప్రభుత్వం విభజన నిర్ణయం చేసిందా అని బాబు ప్రశ్నించారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను సచిన్ కు ప్రకటించినందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సచిన్ ఆటతో పాటు గొప్ప విలువలు నెలకొల్పిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సచిన్ యువతకు ఆదర్శప్రాయమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కోరారు.

భారత్ ఘనవిజయం

 క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వీడ్కోలు టెస్టులో భారత్ ఘనవిజయం సాధించింది. మంబై టెస్టులో మూడో రోజే విండీస్ ను ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో మట్టికరిపించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను ధోనీసేన 2-0తో సొంతం చేసుకుంది. 43/3 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 187 పరుగులకు కుప్పకూలింది. భారత స్పిన్నర్లు ప్రజ్ఞాన్ ఓజా, అశ్విన్ విండీస్ పతనాన్ని శాసించారు. రెండో ఇన్నింగ్స్ లో ఓజా ఐదు, అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ ఆడే అవసరం రాకపోవడంతో మళ్లీ బ్యాటింగ్ కు దిగని సచిన్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసి అభిమానులను అలరించాడు. మాస్టర్ కు వాంఖడే స్టేడియంలో ఘనమైన వీడ్కోలు లభించింది.

వ్యూహం మార్చిన ముఖ్యమంత్రి

రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీఎం కిరణ్ ను పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం ఊపందుకోవడం.. ప్రస్తుత ముఖ్యమంత్రి పదవిని మరో సీమాంధ్ర నేతకు  అప్పగిస్తారని ఊహాగానాలు రావడంతో  .. ముఖ్యమంత్రి కూడా వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. మొన్న ఢిల్లీ పర్యటనను కూడా అర్థాంతరంగా వాయిదా వేసుకున్న ఆయన రచ్చబండలకు పయనమయ్యారు. రచ్చబండలనే వేదికగా మార్చుకుని సమైక్యవాదాన్ని వినిపిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే పరిస్థితి ఇలా ఉంటుందని ప్రసంగాలు ప్రారంభించారు. ఈనెల 18న జీవోఎం  భేటీలో కూడా తాను సమైక్యవాదాన్ని వినిపిస్తానని సీఎం ఖరాకండిగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ కొత్త పార్టీ పెడతారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇందిరా సమైక్య రాష్ట్ర సమితి పేరుతో త్వరలో పార్టీ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే సీఎం సన్నిహితులు చెప్పుకుంటున్నారు. సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న కిరణ్ కు సీమాంధ్ర ప్రజలు బ్రహ్మరథం పట్టే అవకాశమున్నందున ఆయన సారథ్యంలోనే కొత్తపార్టీ వస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కూడా రచ్చబండలను సమైక్యవాదానికి వేదిక చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.

పురంధేశ్వరి ప్యాకేజీల కోసం సమాయత్తం

రాష్ట్ర విభజన అయిపోయింది.. అందుకోసం కేంద్రం వడివడిగా దూసుకుపోతుందని కేంద్రమంత్రి పురంధేశ్వరి అన్నారు.  తెలంగాణ బిల్లు తయారౌతుందని... నేడో రేపో బిల్లుగా రూపాంతరం  సంతరించుకుంటుందని విశాఖలో వెల్లడించారు.  కేంద్రం విభజనపై దూకుడుగా ఉంటే మనం మాత్రం సమైక్యంగా ఉంటే లాభం లేదని ఆమె విశాఖ ప్రజలకు హితవు పలికారు. రాష్ట్ర విభజనపై మనకు రావాల్సిన హక్కుల,ప్యాకేజీల కోసం పోరాడేలా సమాయత్తం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

విభజన బిల్లు రాజ్యాంగ విరుద్దం-ఎపి ఎన్.జి.ఓ నేత అశోక్ బాబు

తెలంగాణ బిల్లుపై తాము కూడా సుప్రింకోర్టులో కేసు వేస్తామని ఎపి ఎన్.జి.ఓ నేత అశోక్ బాబు చెప్పారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన బిల్లు రాజ్యాంగ విరుద్దంగా జరుగుతోందని జరుగుతోందని అన్నారు,