ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జనవరి, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

విద్యుత్ నియంత్రణ మండలిపై హైకోర్టు ఆగ్రహం

విద్యుత్ సర్ చార్జిలు పెంచాలనుకున్న విద్యుత్ సంస్థలకు ఝలక్ తగిలింది. ఏడాది తర్వాత ఇంధన సర్ ఛార్జి విధించేందుకు డిస్కింలకు అనుమతి ఇవ్వడం పట్ల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు నెలల తర్వాత సర్ చార్జి విధించే అధికారం డిస్కంలకు లేదనీ తేల్చి చెప్పింది

రాజశే‍ఖర్ రెడ్డికి అక్రమ ఆస్తులు లేవు: ఉండవల్లి అరుణ్ కుమార్

 వైఎస్ రాజశే‍ఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ తప్పు చేసినా అందుకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యతని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.  రాజశే‍ఖర్ రెడ్డికి అక్రమ ఆస్తులు లేవని, ఎప్పుడూ అవినీతి, అక్రమాలకు పాల్పడలేదన్నారు.
ఈనాడులో పెట్టుబడుల గురించి సాక్షి ప్రముఖంగా ఇస్తుంటే , సాక్షి లో పెట్టుబడులు,జగన్ కంపెనీల గురించిన ఆరోపణలకు ఈనాడు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పాఠకులలో ఆసక్తి పెంచడానికి యత్నిస్తున్నాయి. ఈనాడు దినపత్రిక జగన్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టిన పదహారు కంపెనీలకు సంబంధించి డైరెక్టర్ గా ఒకరే అన్నిటిలోను ఉన్నారన్న కొత్త విసయం బయటకు వచ్చిందని ఈనాడు మొదటి పేజీలో ప్రచురించింది. ప్రభుత్వం లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు వచ్చిన వసూళ్లను మళ్లించడానికే ఇలా చేసి ఉండవచ్చని ఈనాడు పేర్కొంది. కాగా ఈనాడులో రిలయన్స్ లో పెట్టుబడులు చాలా రహస్యంగా ఉంచారని, ఇది రిలయన్స్ షేర్ హోల్డర్లను మోసం చేయడమేనని సాక్షి రాసింది. సెబి దృష్టి సారించిందని, ఇందుకు సంబంధించిన ప్రాధమిక సాక్ష్యాధారాలు దొరికాయని, ఎన్నడూ రిలయన్స్ వార్షిక నివేదికలలో ఈ పెట్టుబడుల గురించి ప్రస్తావించకపోవడమే సాక్ష్యమని తెలిపింది.మొత్తం రెండు కంపెనీలలో పెట్టుబడులలో జరిగిన అవకతవకలే అనండి,లోపాలే అనండి వాటిని ఇరుపక్షాలు తవ్వి తీసుకుంటున్నాయి.

తెలంగాణా ప్రజలకు అన్యాయం: గుత్తా

తెలంగాణా ప్రజలకు అన్యాయం జరగిందని , తెలంగాణా నేతలకు ఎలాంటి పదవులు రాలేదని ,మా రాష్ట్రం మకిస్తే అన్ని పదవులు మాకే వస్తాయని ,అలాగే జాతీయ రహదారుల విషయంలో కూడా అన్యాయం జరిగిందని గుత్తా సుకేందర్ రెడ్డి వెల్లడించారు  

నాకు సి ఎం కు ఎలాంటి వేభేధాలు లేవు : బొత్స

బొత్స సత్యనారాయణకు సి ఎం కు ఎలాంటి వేభేధాలు లేవని ,అది మీడియా సృష్టే అని ,చిరు వర్గం నేతలు మంత్రి వర్గంలో చేరటం తెలంగాణకు ముడి పెట్టవద్దని,త్వరలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉండవచ్చని,సి ఎం  తన మాట నేగ్గించుకోలేక పోయరన్నవిషయం అవాస్తవమని  పీ సి సి చీఫ్  బొత్స సత్యనారాయణ వెల్లడించారు .

చిరంజీవి వర్గం నేతలకు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు

ఎట్టకేలకు చిరంజీవి వర్గంకు చెందిన గంటా శ్రీనివాస్ ,సి రామచంద్రయ్య రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు దక్కింది .

కాబినెట్ విస్తరణ ఫై జోరుగా చర్చ

సి ఎం కిరణ్ కుమార్ రెడ్డి  సోనియా గాంధీ ,గులాం నబి ఆజాద్ తో  కొనసాగుత్న్న భేటి అయ్యారు .కాబినెట్ విస్తరణ ఫై జోరుగా చర్చ జరుగుతుంది .

మర్మాంగం కొస్తే హత్యాయత్నం కాదు : కర్ణాటక హై కోర్ట్ అభిప్రాయం

మర్మాంగం కొస్తే హత్యాయత్నం క్రింద రాదని కర్ణాటక హై కోర్ట్ అభిప్రాయపడింది .ఈ కేసు ఛార్జ్ షీట్ ను పునః పరిసిలించాలని పోలీసులకు ఆదేశించింది .బెంగాలురుకు చెందిన హర్షద్ అలీ ,అమీన్ కేసులో తన అభిప్రాయం వ్యక్తం చేసింది .అమీన్ తన ప్రియుడు హర్షద్ అలీ ,మరో అమ్మాయితో వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని ..అక్కసుతో తన క్లినిక్కు  హర్షద్ ను పిలిచి తెనేటి పనియంలో మత్తు మందు కలిపి .మర్మగంను కత్తిరించింది .ఈ కేసులో  అమీన్ కు ఏడు సంవత్సరాల శిక్ష పడింది .ప్రస్తుతం బిల్ ఫై విడుదలయింది .కోర్ట్ తీర్పును సవాలు చేస్తూ ...హై కోర్టులో ఆర్జీ పెట్టుకుంది .

ద్యుత్ వినియోగదారులకు80 ఫైసల భారం

రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు80 ఫైసలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది .ఇది సర్దుబాటులో బాగంగానే పెంచవలసిన అవసరం వస్తుందని విద్యుత్ సరఫరా చేస్తున్న సంస్థలు పేర్కొనడం జరగింది .

రాష్ట్రంలో మరో రెండ్రోజులు కొనసాగనున్న చలి తీవ్రత

మధ్య దేశం నుంచి రాష్ట్రము మీదుగా ఈశాన్య ,ఉత్తర గాలులు ప్రభావం వల్లన రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుత్న్నదని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.ఈ పరిస్థితి ఇంకా రెండ్రోజులు కొనసాగుతుందన్నారు .

సంక్రాంతి రాకతోబోసిపోయిన హైదరాబాద్ రోడ్లు

.సంక్రాంతి సెలవులకు చాల మంది సొంతూర్లకు  వెళ్ళడంతో హైదరాబాద్ రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి.ఖైరతాబాద్,పంజాగుట్ట ,లకిడికాపూల్ ,ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు సంక్రాంతితో బోసిపోయాయి.తెలుగు లోగిళ్ళు రంగు రంగు ముగ్గులతో కళకళలాడుతున్నాయి .

మెదక్ ఎంపీ విజయశాంతి సవాల్

సినీనటుడు నందమూరి బాలకృష్ణకు ధైర్యముంటే తెలంగాణలో పోటీ చేయాలని మెదక్ ఎంపీ విజయశాంతి సవాల్ విసిరారు.తెలంగాన లో పోటి చేస్తే గెలిచేది ఓడేది తెలుస్తుందని, బాలకృష్ణపై పోటీకి దిగుతారా అనే ప్రశ్నకు పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేశారు.

నారా వారి పల్లె లో చంద్ర బాబు సంక్రాంతి సందడి

నారావారి పల్లి లో నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత చంద్ర బాబు మాట్లాడుతో...పెరిగిన ధరలతో రాష్ట్ర ప్రజలు సంక్రాంతి చేసుకోనేతట్లు లేరని,దేశం తమ్ములకు అండగా ఉంటానని చెప్పారు

ఈ నెల పంతోమ్మిదిన రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం,

ఈ నెల పంతోమ్మిదిన రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని , రామచంద్రయ్య ,గంటా  శ్రీనివాస్ కు  చోటు దక్కే అవకాశంలు ఉన్నాయని రాజకిరాయ వర్గాలలో చర్చ  .

రెండో రోజు భాగసామ్య సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

రెండో రోజు భాగసామ్య సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి .ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని,పరిశ్ర్రమాలకు కావలసిన మౌలిక సదుపాయాలను కలిస్తామని,ఈ బిజినెస్ కు కేంద్ర ఆమోదం లభించిందని ,మూడు నెలల్లో పౌర సేవలన్ని  ఆన్ లైన్ లోనే ఉంటాయని  భాగసామ్య సదస్సులో పేర్కొన్నారు .

వై.ఎస్ .విజయలక్ష్మిపిటిషనన్ సోమవారంనకు వాయిదా

వై.ఎస్ .విజయలక్ష్మిపిటిషనన్ సోమవారంనకు వాయిదా  చంద్ర బాబు ఆస్తుల కేసును వేరే కోర్ట్ కు బదిలి చేయాలనీ సుప్రీం కోర్ట్ లో పిటిషనన్ దాఖలు చేసిన వై ఎస్ విజయలక్ష్మి

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దీక్ష విజయవంతం

నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దీక్షను విజయవంతంగా ముగించారుటిడిపి నేత చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ బిల్లులు చెల్లించనవారికి శిక్షలు వేయడానికి జిఓలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఉచిత కరెంటు ఇస్తానంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు గతంలో ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరవేసుకోవలసి ఉంటుందని చెప్పారని ఆయన గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రైతులకు చేసిన వివిధ మేళ్లను ఆయన ప్రస్తావించారు

ఇరవై ఐదో తేదీన తెలుగుదేశం పార్టీ పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్లీ తన బలాన్ని పెంచుకొనేందుకు గాను మరో ప్రయత్నం మొదలు పెట్టింది. చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు సాధనకోసం తెలంగాణ తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు . ఈ నెల ఇరవై ఐదో తేదీన ఈ పాదయాత్ర ఆరంభమవుతుందని టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, దేవేందర్ గౌడ్ తదితరులు ఈ విషయం వెల్లడించారు

'గాలి'కి జ్యుడిషియల్ కస్టడీ జనవరి 25వరకు

ఓఎంసీ కేసులో విచారణ ఎదుర్కొంటున్న గాలి జనార్దనరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్ లకు న్యాయస్థానం ఈనెల 25వరకూ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. విచారణ నిమిత్తం వారిని సీబీఐ అధికారులు గురువారం చంచలగూడ జైలు నుంచి నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీటు ప్రతులను న్యాయస్థానం గాలి జనార్ధనరెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు అందచేసింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.

అంతర్జాతీయ భాగసామ్య సదస్సు

రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణ లక్షంతో నగరంలో అంతర్జాతీయ భాగసామ్య సదస్సు ప్రారంభమయింది . హైదరాబాద్ HICC  వేదికగా అంతర్జాతీయ భాగసామ్య సదస్సులో45  దేశాల ప్రతినిధులు హాజరయ్ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ,కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ తదితరులు హాజరయ్యారు .మౌలిక సదుపాయాల అభిరుద్ది కై ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని,ఆర్ధిక సంక్షోభాన్ని భరత్ దీటుగా ఎదుర్కొంటోందని,ముందెన్నడూ జరగని అభిరుద్ది కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు .2003లో చివరి  అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్ లో  ఏర్పాటైంది .

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం

సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. రంగారెడ్డి జిల్లా తాండూరు వద్ద అటకాయించిన దొంగలు..బోగీల తలుపులను మూసేసి...చోరీకి విఫలయత్నం చేశారు.ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఇనుపరాడ్లతో డోర్లు తెరిచి దొంగలను అదుపులోకి తీసుకున్నారు.

మోత్కుపల్లి నరసింహులుపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి

తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నరసింహులుపై మోత్కూరు గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆయనపై వారు కోడి గుడ్లు విసిరారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నం :ముద్దు కృష్ణమనాయుడు

శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ అధిష్టానవర్గానికి దరఖాస్తు చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత ముద్దు కృష్ణమనాయుడు విమర్శించారు. అనంతపురంలో కరువు యాత్రలు చేసిన, ఎమ్మెల్యేలను గిరిజన ప్రాంతాలకు తీసుకువెళ్లిన సిడీలను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి పంపి ముఖ్యమంత్రి పదవి పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్నారు. పార్టీ లో ప్రస్తుతం ఐదు గ్రూపులు ఉన్నాయని , ఆరో గ్రూపు ను నాదెండ్ల  తయారు చేసుకుంటున్నారని తెలుగు దేశం సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు .  
పార్టీ అధిష్టానవర్గం అనుమతితో త్వరలో రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు

సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు

డి ఎల్ రవీంద్ర రెడ్డి తో జూనియర్ డాక్టర్ల  చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించారు .83కోట్ల నిధులు విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు .

ప్రత్యూష కేసు లో సిద్దార్థ రెడ్డి జైలుకు

సంచలం రేపిన ప్రత్యూష ఆత్మహత్య కేసులో నిందితుడు సిద్దార్థ రెడ్డి కి కోర్ట్ రెండు సంవత్సరాల శిక్ష విధించటం తో అతన్ని బుధవారం చంచల్ గూడా జైలు కు తరలించారు .

కోస్తా తీరం వెంబడి ఉపరితల ద్రోణి

కోస్తా తీరం వెంబడి ఉపరితల ద్రోణితో ఆకల వర్షాలకు భారీ పంట నష్టం జరిగింది .పలు చోట్ల వర్షాలు పడ్డాయి .చిలకలూరిపేట -నర్సారాపేట మధ్య రాకపోకలకు అంతరాయం.ఉత్తరాంధ్ర ,కోస్తా ప్రాంతాలలో భారివర్షలు పడే  సూచనలు ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు .

గాలి జనార్ధన్ రెడ్డి పుట్టినరోజు

చంచల్ గూడా జైలు లో పుట్టినరోజు జరుపుకున్న గాలి జనార్ధన్ రెడ్డి .శుభాకాంక్షలు తెలిపిన అనుచరులు మరియు శ్రీరాములు .

ఉత్తరప్రదేశ్ ఎన్నికల తాజా షెడ్యూల్

 ఉత్తరప్రదేశ్ ఎన్నికల తాజా షెడ్యూల్ Event Date 1. షెడ్యూల్ తేది 06.02.2012 (Monday) 2.ఆఖరి తేది (నామినేషోన్ ) 13.02.2012 (Monday) 3. నామినేషోన్ Scrutiny 14.02.2012 (Tuesday) 4. ఉపసంహరణ చివరి తేది 16.02.2012 (Thursday) 5. పోలింగ్ తేది  03.03.2012 (Saturday) 6.ఓట్ల లెక్కింపు  తేది 06.03.2012 (Tuesday) 7.  ఎన్నికలు పూర్తి చేయుటకు చివరి తేది 09.03.2012 (Friday)

విజయసాయి రెడ్డి సిబిఐ కస్టడీ

విజయసాయి రెడ్డి సిబిఐ కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు  ఆర్ధిక నేరాల ప్రత్యెక కోర్ట్ ఆదేశాలను జారి చేసింది . అయితే కస్టడీ సమయంలో షరుతులు వర్తిస్తాయని కోర్టు తెలిపింది. కస్టడీలో ఉన్నన్ని రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలి. 

వంట గ్యాస్ రాయితీ ఎత్తివేత

 వంట గ్యాస్ సిలిందర్ ఫై ఇస్తున్న 25 రూపాయల రాయితీ ని దారిద్ర రేఖకు ఎగువన ఉన్న వారికీ  రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది .

ఫిబ్రవరి 19న వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలు

గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) పోస్టులకు రాత పరీక్ష ముహూర్తం సరిగ్గా కుదరినట్లు లేదు. పరీక్షలను ఫిబ్రవరి 19న నిర్వహించాలని రెవెన్యూ శాఖ తాజాగా సోమవారం నిర్ణయించింది. ఈ పరీక్షల షెడ్యూలు ఇలా మారడమిది మూడోసారి.

రైతు దీక్ష కు భారీ భందోబస్తూ

నిజామాబాదు ఆర్మూర్ లో నేటి నుంచి మూడు రోజులపాటు వై ఎస్స్ ఆర్ కాంగ్రెస్అద్యక్షుడు జగన్  చేపట్టనున్న దీక్ష నేపద్యంలో పోలీసులు 20మంది  తెరాస కార్యకర్తలను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా అదుపులో తీసుకొన్నారు.రైతు దీక్షలో పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఆర్మూర్ బయల్దేరారు

రైతుదీక్ష

మంగళవారం ఆర్మూరులో చేపట్టే రైతుదీక్షని రాజకీయం చేయవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి విజ్ఙప్తి చేశారు. . రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈ దీక్ష చేపట్టినట్లు తెలిపారు. పంటలకు మద్దతు ధర ప్రకటించి, ఇన్ పుట్ సబ్సిడీ పెంచి రైతుని నిలబెట్టాలన్నారు.

2013 నుంచి నీట్ :MCI

నీట్  2013   నుంచి అమలు చేయాలనీ ఆంధ్ర ప్రదేశ్  కేంద్రాన్ని అభ్యతించింది .దానికి అనుకూలంగానే కేంద్రం స్పందించింది .2013   నుంచి అమలు చేస్తామని ప్రకటించింది .

అరకు చేరుకున్న 60మంది ఎమ్మెల్యేల

గిరిజన సమస్యల్ని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు అసెంబ్లీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశాఖ ఏజెన్సీకు చేరుకున్నారు . మూడు రోజులపాటు జరిగే పలు కార్యక్రమాల్లో వారు పాల్గొంటారు.

ఫిబ్రవరి 5నఉత్తర ప్రదేశ్ తోలి దస ఎన్నికలు

ఉత్తర ప్రదేశ్ తోలి దస ఎన్నికలు ఫిబ్రవరి  5న నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం  ప్రకటించింది

సుప్రీం కోర్టు చంద్రబాబు నాయుడుకు నోటీసులు

ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సుప్రీం కోర్టు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు తాజా  నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి, సిబిఐకి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో చంద్రబాబుని కూడా విచారించాలని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భీంరెడ్డి ఎల్లారెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ భండారీ, జస్టిస్ మిశ్రా ఈ పిటిషన్ పై వాదనలు విన్నారు. వాదనలు ముగిసిన తరువాత సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

సంక్రాంతి తర్వాత ఉద్యమ కార్యాచరణ:కే చంద్రశేఖర్ రావు

సంక్రాంతి తర్వాత జాయింట్ ఆక్షన్ కమిటీ నాయకులతో సంప్రతించితాజా  భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని కే చంద్రశేఖర్ రావు ప్రైవేటు ఉద్యోగుల దయరి  ఆవిష్కరణ సదస్సు లో చెప్పారు .తాజా 

మిలిటరీ ఆపరేషన్ల కొరకు అత్యధిక ఖర్చు

అమెరికా తన మిలిటరీ ఆపరేషన్ల ఫై698 బిల్లిఒన్ డాలర్   అత్యధిక ఖర్చు పెడుతుంది.రష్యా $58.7 ఫ్రాన్సు$59.3 చైనా $119 ,ఇండియా$41.౩బిల్లిఒన్ డాలర్లు ఖర్చు పెడుతుంది

హజారే డిశ్చార్జి

అన్నాహజారే ఆస్పత్రి నుంచి ఈ ఉదయం డిశ్చార్జి అయ్యారు. శ్వాసపరమైన ఇబ్బందులతో ఆయన డిసెంబరు 31న ఆస్పత్రిలో చేరారు. మరో నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారు.

టాప్ గేయర్ లో కొనసాగుతున్న బాలయ్య కృష్ణ జిల్లా టూర్ :

ఘంటసాల లో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అవిశ్ఖరించిన బాలయ్య

2009-2010 సంవత్సర నంది అవార్డులు

2009 సంవత్సరానికి ఉత్తమ టెలీ ఫిలిం అవార్డు ‘విప్రనారాయణ’, ఉత్తమ టీవీ ఫీచర్ ‘వావ్’, ఉత్తమ డైలీ సీరియల్ ‘మొగలి రేకులు’, ఉత్తమ బాలల సినిమా ‘ఆశాదీపం’, ఉత్తమ డాక్యుమెంటరీ ఫిలిం ‘చెరియాల్ కళాకృతులు’, ఉత్తమ సాంఘిక నేపథ్య సినిమా ‘డైలీ మిర్రర్’లు బంగారు నంది,2010 సంవత్సరానికి ఉత్తమ టెలిఫిలిం ‘ఓంకారం’, ఉత్తమ టీవీ ఫీచర్ ‘బతుకు జట్కా బండి’, మెగా సీరియల్ ‘పంచతంత్ర’, డైలీ సీరియల్ ‘పుత్తడి బొమ్మ’, బాలల చిత్రం ‘పెద్దలను దిద్దిన పిల్లలు’, టీవీ డాక్యుమెంటరీ ఫిలిం ‘మార్గదర్శి’, సాంఘిక నేపథ్య చిత్రం ‘సంకల్పం’, టీవీ ఎడ్యుకేషనల్ ఫిలిం ‘థింక్ టై్వస్’లకు బంగారు నంది బహుమతులు లబించాయి .

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా- బాలకృష్ణ

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా తాను ఉన్నానని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ శనివారం విజయవాడ లో ప్రకటించారు.టీడీపీ నాయకత్వం ఆదేశాల మేరకు తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధమని చెప్పారు

48వ రోజు ఓదార్పుయాత్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జిల్లాలో 48వ రోజు ఓదార్పు యాత్రని ఈ ఉదయం తాళ్లూరు గ్రామం నుంచి ప్రారంభించారు. అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఆయనని చూసేందుకు తరలి వచ్చారు

యూనిఫామ్ సర్వీసులకు అవకాశం లేదు

ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని రెండేళ్ల పాటు(34 నుంచి 36 ఏళ్లకు) పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం 2011 జూలై 1వతేదీ నుంచి 2012 మార్చి 31 వరకూ విడుదలైన, విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే గరిష్ట వయోపరిమితి సడలింపు యూనిఫామ్ సర్వీసులైన పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్ల శాఖలకు వర్తించబోదని స్పష్టం చేశారు. దరఖాస్తుల సమర్పణకు ఇప్పటికే గడువు ముగిసిన నోటిఫికేషన్లకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఇప్పటివరకూ పరీక్షలు నిర్వహించని వాటికి మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

ఈ టీవీ నెట్వర్క్ వాటాలను కొన్న టీవీ 18

10 ఈ టీవీ ఛానల్ లను 2600కోట్లకు టీవీ 18 కొనుగోలు చేసింది .ఈ టీవీ ఈ టీవీ 2 లో 24 శాతం,మిగతా ఈ టీవీ  చానల్స్ లో 50 శాతం ,100 శాతం టీవీ-18 వాటా తీసుకున్నట్లు సమాచారం .

గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ మజీద్ హుస్సేన్

గ్రేటర్  హైదరాబాద్ కొత్త మేయర్ గా అహ్మద్ నగర్ కార్పోరేటర్ మొహ్మద్ మజీద్ హుస్సేన్ ని ఎంఐఎం ఎంపిక చేసింది. . కాంగ్రెస్, ఎంఐఎం ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఎంఐఎం కార్పోరేటర్ మేయర్ గా ఎన్నుకోవాలి  .కాసేపట్లో ఎంఐఎం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 21 సంవత్సరాల తరువాత మేయర్ పగ్గాలను ఎంఐఎం చేపట్టనుంది .

పాస్ పోర్ట్ సేవ కేంద్రస్ (P SK)

పాస్ పోర్ట్ కు దరఖాస్తు   చేయ ధలచినవారు పాస్ పోర్ట్  సేవ కేంద్రస్ (P SK)  ద్వార   పొందవచ్చు.హైదరాబాద్ లో మూడు కేంద్రాలను అమీర్పేట్ ,బేగుంపేట్ ,తోలిచౌకి  ఏర్పాటు చేసారు .ఆన్ లేనే లో అప్పాయింట్మెంట్ తీసుకొని ఈ కేంద్రాల వద్ద తమ దరఖాస్తులను అందించ్చవచ్చు .ముందుగ www.passportindia.gov.ఇన్ లాగిన్ అయి ,తమ యూసర్ ఐ డి  ని క్రిఎఅట్  చేసి పాస్ వర్డ్  పొందవలెను .తర్వాత అప్లికేషను ఫిల్ చేసి ఆన్ లేన సబ్మిట్ చేయాలి .అప్లికేషను నెంబర్ ప్రింట్ ను అనుసందనించిన పాస్ పోర్ట్ సేవ కేంద్ర లకు తమ ఒరిజినల్ డాకుమెంట్స్ తో సందర్సించాలి .మరిన్నితాజా  వివరాల కొరకు 1800258-1800 కు సంప్రదించవచ్చు

పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఖాళీగా 11 వేల పోస్టులతోపాటు మరో తొమ్మిదివేల పోస్టులకు సీఎం ఆమోదం తెలిపారు. జనవరి 15 తేది తర్వాత 20 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయాలనీ నిర్ణయించింది . 11 వేల 139 ఖాళీలను ఇప్పటికే గుర్తించారు. వాటిలో 7 వేలకు పైగా ఎస్‌జీటీ పోస్టులు, 2 వేలకు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

విజయ సాయి రెడ్డి అరెస్ట్

జగన్ కు సంబందించిన కీలక వ్యక్తుల్లో ఒకరిన   విజయసాయి రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది .జగన్ ఆస్తుల కేసులో  తోలి అరెస్ట్.సోమవారం ఉదయం నుంచి9గంట లు విచారించి అరెస్ట్ చేసారు .జగన్ ఆస్తుల కేసులో సీబీఐ పరిధిని మించి విచారణ చేస్తోందని విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు .విజయసాయి రెడ్డిని మంగళవారం సిబిఐ కోర్ట్ లో హాజరుపరచనున్నారు

ముఖ్య మంత్రి నూతన సంవత్సర కానుకలు

 రాష్ట్రం అంతటా ప్రజలు ఎదుర్కుంటున్న  కరెంటు కోతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ సమన్వయ కేంద్ర కన్వీనర్ ఎ. చంద్రశేఖరరెడ్డి ప్రకటిస్తూ గ్రామలలో నాలుగు గంటల సేపే కరెంటు కోత ఉంటుంది. అలాగే మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మూడు గంటలే కోత విధిస్తారు.అలాగే మరో వరాన్ని ప్రభుత్వం ప్రకటించింది.ఎపిపిఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్ధుల వయో్ పరిమితిని మరో రెండేళ్లపాటు సడలించారు.దీనివల్ల వేలాది మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరు కాగలుగుతారు. ఇక మున్సిపల్ లే అవుట్ల క్రమబద్దీకరణ కు మరో సారి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తాజా వార్తలు

 శ్రీలక్ష్మి బెయిల్ రద్దు ఓఎమ్సి కేసులో నిందితురాలిగా ఉన్న ఐ ఎ ఎస్ అధికారిణి శ్రీలక్ష్మి బెయిల్ ను హైకోర్టు రద్దు చేసింది.ఈకేసులో కొద్ది రోజుల క్రితం అరెస్టు అయిన ఆమెకు సిబిఐ కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆమె బెయిల్ రద్దు చేయాలని సిబిఐ హైకోర్టు కు వెళ్లడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.ఈ నెల ఆరో తేదీ లోపు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో అరెస్టు అయిన తొలి మహిళా ఐ ఎ ఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కావడం విశేషం. ఇప్పటికే గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ అరెస్టు అయ్యారు. కాగా కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, బివి శ్రీనివాసరెడ్డిలు కూడా జైలులో ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు జగన్ బహిరంగ లేఖ   వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈసారి టైమ్స్ ఆఫ్ ఇండియాపై విరుచుకు పడ్డారు .కాంగ్రెస్ పార్టీలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విలీనం కావడానికి జగన్ కాంగ్రెస్ పెద్దలతో అవగాహన కుదుర్చుకున్నారని జనవరి ఒకటో తేదీన  టైమ్స్ అఫ్ ఇండియా ఒక కథనం ప్రచురించింది .తెలుగు దేశంకు అనుకూలంగా టైమ్స్ అఫ్ ఇండియా పత్రిక వ్యవహరిస్తుందని ఆరోపించారు .