ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సమ్మర్ లో రిలీజ్ అవుతున్నతెలుగు చిత్రాలు

విద్యార్థులకు పరీక్షలు మెదలయ్యాయి.టాలీవుడ్‌లో సమ్మర్‌ సీజన్‌ మొదలవుతోంది. ఈ సీజన్‌లోనే బాక్సాఫీస్‌ను షేక్‌ చేయడానికి సిద్ధమవుతున్నాయి సినిమాలు. ఏప్రిల్ నెలలో టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బిజీ కాబోతున్నాయి.  అప్పటికే ఎండలు కాస్తా ముదిరి స్కూళ్లు మూతపడుతాయి. స్టూడెంట్స్‌కు ఎగ్జామ్స్‌కూడా అయిపోతాయి. అందుకే ఆటైమ్‌లో థియేటర్లో సినిమాల తాకిడికూడా భారీగా పెరగనుంది. అదికాస్తా మార్చి చివరి వారంనుంచే సినిమాల సందడి ప్రారంభంకానుంది. ఎందుకంటే మార్చి 24న కాటమరాయుడు భారీ అంచనాలతో ప్రేక్షకులముందుకు రానుంది. కాటమరాయుడు తాకిడి కాస్తా తగ్గేసరికే  ఏప్రిల్ 28న బాహుబలి సినిమాలు విడుదల అవుతోంది. ఈ సినిమాను వెయ్యి కళ్లతో కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మెదటి పార్ట్ లో కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడని ప్రశ్నలపై విభిన్న కథనాలు సోషల్‌ మిడియాలో హల్‌ చల్‌ చేశాయి. కానీ అసలు కథ రాజమౌళి ఈ నె ఏప్రిల్‌లో బహుబలి -ది కంక్లూషన్‌ చేప్పబోతున్నాడు. అయినాసరే టాలీవుడ్ లో మాత్రం అసలు ఏప్రిల్ సినిమాల హవా తగ్గట్లేదు. ఏప్రిల్ 7 వెంకటేష్ హీరోగా రూపొందిన సాలా కడూస్‌ సినిమా రీమేక్ ''గురు'' రిలీజవుతోంది. ఇకపోతే అదే తేదీన మణిరత్నం డైరక్షన్లో రూపొందిన ''చెలియా'' సినిమా కూడా రిలీజయ్యే ఛాన్సుంది. తెలుగులో దిల్ రాజు రూపొందిస్తున్న సినిమాలో కార్తి అండ్ అదితి రావ్ హైదారీ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఏప్రియల్ 14.. శ్రీను వైట్ల రూపొందిన వరుణ్ తేజ్ సినిమా ''మిష్టర్'' కూడా రిలీజవుతున్నట్లు ఇటీవలే ప్రకటించారు నిర్మాతలు. సినిమాలో లావణ్య త్రిపాఠి , హెబ్బా పటేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే దారుణమైన ఫ్లాపులు చవిచూసిన శ్రీను వైట్ల రికవర్ కావాల్సి ఉంది. అలాగే వరుణ్ తేజ్ కూడా మార్కెట్ పటిష్టం చేసుకోవాలంటే.. సినిమాతో హిట్టు కొట్టాల్సిందే. వీటితోపాటు ఇంకొన్ని చిన్న సినిమాలు కూడా ఇదే నెలను టార్గెట్ చేయడం విశేషం. అందరూ కూడా సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవాలనే ఉద్యేశ్యంతో.. ఇలా ఏప్రిల్ వెంట పడ్డారనే చెప్పాలిమరి ఈ సమ్మర్‌ సీజన్‌లో పొటాపొటిన రిలీజ్‌ అవుతున్నా సినిమాల్లో ఏ సినిమా విజయం సాధిస్తోందో చూడాలి. 








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు