ఐదు రాష్ట్రాల ఫలితాలు అధికార పక్షానికి విరుద్దంగా
వచ్చాయి. అధిక్యాల వరవడి చూస్తే విషయం స్పష్టమౌతుంది. ఉత్తర ప్రదేశ్ 2012 ఎన్నికలలో
ఎస్పీకి 224 స్థానాలు వస్తే బీజేపీ కి 47 స్థానాలు దక్కాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలలో
310 స్థానాలో అధిక్యంలో బీజేపీ నిలిచింది.
క్రితం ఎన్నికల్లో కాంగ్రెస్ 60 స్థానాల్లో గెలిచిన బీఎస్పీ మాత్రం 22
స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక పంజాబ్ విషయానికి వస్తే అధికారంలో ఉన్న శిరోమణి
ఆకాలీదళ్ ఓటమి వైపు, కాంగ్రెస్
గెలుపువైపు పయనిస్తున్నాయి. కాంగ్రెస్ 75 చోట్ల అధిక్యంలో కొనసాగుతుంది.ఈ సారి
ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకొంది. 21 స్థానాలో అధిక్యంలో ఉంది. ఉత్తరాఖండ్ బీజేపీ
అధిక్యం దిశగా పయనిస్తోంది.కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో 32 స్థాదించే ఈ సారి 12 తోనే
సరి పెట్టకొవలసి వస్తుంది.బీజేపీ 55 చోట్ల
అధిక్యంలో ఉంది. గోవా లో కాంగ్రెస్ అధిక్యంలో కొనసాగుతుంది.21 చోట్ల బీజేపీ
అధిక్యం కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. మణిపూర్ లో బీజేపీ -కాంగ్రెస్ హోరహోరిగా
కొనసాగుతుంది. 2012 ఎన్నికల్లో 42 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పడు
రెండు పార్టీలు విజయం కొసం హోరాహోరిగా తలబడుతున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి