ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మన రాజకీయ పార్టీల లక్ష్యం, గమ్యం, అధికారం ....

దేశంలో రాజకీయ పార్టీలు ఎటు పయానిస్తున్నాయి. ప్రజలను ఓట్లు అడగటానికి అంశాలు, అభివృధ్దికి దోహద పడిన పనులు,చేస్తున్న మంచి కార్యక్రమాలను వివరించి ఓట్లు వేయ మని వేడుకుంటారు. కానీ మన రాజకీయ పార్టీలు మాత్రం వాటికి కంమ్యూనల్ రంగు పూస్తున్నారు. కొందరు జాతి, కులం ,మతం , ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చకొట్టి లబ్దిపొందాలని చూస్తున్నారు.   దేశ విభజనం  సమయంలో అమృత్‌సర్‌ సరిహద్దు ప్రాంతంలో రెండు పెద్ద నీటి కుండలను ఉంచి వాటిపై హింధువులకు, మరియు ముస్లీంలకు అని పేరు వ్రాసి  ఉంచేవారు... అదే తరహా లో పార్టీల దిశ, లక్ష్యం మారాయి.సమాజంలో ఉన్న వ్యత్త్యసాలను రూపమార్పడం పోయి ధ్వేషం,పగ, ప్రతికారలను,ఉపయోగించుకొనే ప్రయత్నం చేసుకొవడం కడూ సోచనియం. దీనికి వేధిక ఐదు రాష్ట్రాల ఎన్నికలు నిదర్శనంగా నిలిచాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక క్యాంపెన్‌ సమయంలో మన ప్రధాని నరేంద్రమోడీ ఉత్తర్‌ ప్రదేశ్ లో 24 ర్యాలీలో పాల్గోన్నారు.అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించకుండా... విధ్యుత్ ఓ వర్గం స్శశాన వాటికలకు, వారి పండుగలకు కావాలంటలే... అది ఇతర వర్గం స్శశాన వాటికలకు, పండుగలకు కావాలి... రావాలి... హోలీకి కావాలంటే ... ఈద్‌ కి కావాలి....అని స్వయాన మన ప్రధాన మంత్రి ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా ఆయన ప్రజలకు ఏం  చెప్పారో చెప్పకనే అర్ధమౌతుంది
 విశ్వవిధ్యాలయాలు విద్యార్థులను తీర్చి దిద్ది వారిని ఉన్నత పౌరులుగా సమాజానికి అందించటం  వాటి ప్రథమ కర్తవ్యం కానీ... ఇప్పడున్న పరిస్థితు విశ్యవిధ్యాలయాలో జరుగుతున్న తంతు మరో విధంగా ఉంది. జె.ఎన్‌.యు,యునివర్శిటీ ఆప్‌ హైదరబాద్‌,అలహమాద్‌ యునివర్శిటీ, జోధ్పూరు యునివర్శిటిలో ఒకే రకం ఐడియాలిజిని విద్యార్థులపై రుద్దటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్యార్థులకు విశ్వవిధ్యాలయాలలో వాధం ప్రతి వాధం ఉండటం, చర్చ జరగడం వలన ఆ అంశం పట్ల మంచి చేడులు తెలుసుకొనే ఆవకాశముంటుంది.అప్పుడు వారు సమాజంలో మార్పు తీసుకొని రావటానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఒకే రీతి,ఒకే ఐడియాలిజిని రుద్దే ప్రయత్నం వలన ఒకే ఆలోచన రీతి ఉన్న వారు యునివర్శీటీనుంచి రావడం వలన ఆలోచనలో భిన్నత్వం లేకపోవడంతో సమాజానిక ఉపయోగకరంగా ఉండకపోయే ఆవకాశముంది. మన శక్తి బిన్నత్వం లో ఏకత్వం...ఇదే అంశం మన దేశాన్ని బలం ఇస్తుంది.
డిసెంబర్‌ లో చేపట్టిన డిమోనిటటైజేషన్‌  చర్య ఒక ఉద్ధేశం ,లక్ష్యం  లేకపోయింది. ఈ చర్యవలను,బ్లాక్‌మనీ ఆరికట్టవచ్చాని మెదట పెర్కొన్నారు.. తర్వాత టెర్రరిజాన్‌, వారి పండింగ్‌ను ఆరికట్టవచ్చునని,నకిలీ కరెన్సీని అడ్డుకట్టవేయచ్చని.... ఆ తరువాత....క్యాష్లేస్‌ సమాజాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయని,ఆర్ధిక వ్యవస్థను లెస్‌ క్యాష్ మోర్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలను జరుపుదామని చెప్పుకొచ్చారు. కానీ.. ఈ విషయాల ఈ ఎలక్షన్‌ ప్రస్తావించకుండానే భారీ ర్యాలీలలో ప్రసంగించారు.
ఇతర పార్టీలు కూడా మతతత్వం,జాతి,కులం,ప్రాంతం పేరుతో ఓట్లలను వేయమని అభ్యర్థించారు. మనం ట్రాంప్‌ని విమర్శించే హక్కు ఉందా... మన దేశంలోనే రాజకీయ నాయకులు వారి స్వలాభలకు ఇటువంటి అంశాలను ఉపయోగించకొని సత్తాలోకి రావటానికి ప్రయత్నించినపుడు... ట్రాంప్‌ ను తప్పుపట్టడం సమంజసం కాదు.
నిన్న మీడియాలో ఎగ్జిట్‌ పోల్‌ తో హల్‌ చల్‌ చేశాయి. ఎగ్జిట్‌ పోల్స్ కొన్ని సార్లు తప్పుకావచ్చు. యు.ఎస్‌ లో కూడా డెమోక్రటిక్‌ అభ్యర్థి అధ్యక్ష పదవిని చేపట్టే ఆవకాశముందని ప్రకటించాయి. కానీ దానిక విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. ట్రాంప్‌ అధ్యక్ష పదవి చేపట్టారు. గత  బీహార్ అసెంబ్లీ ఎన్నికలో కూడా బీజేపీ హావా కొనసాగిస్తున్నందని..బీజేపీ ప్రభుత్వం చేపట్టే ఆవకాశముందని ఎగ్జీట్‌పోల్స్ చేప్పాయి. కానీ... నితిష్..లాలు కలిసిన మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే విధంగా తమిళనాడులో కూడా జయకు వ్యతిరేకంగా వచ్చాయి. ఎగ్జీట్‌ పోల్స్ ప్రజల మనస్సులో ఓ సందర్బంలో ఉన్న మూడ్‌ తెలియ పరుస్తాయి కానీ... అదే ఫైనల్‌ కాదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలంగాణా సర్కార్ లో కొత్త గా 6 మంత్రులు ప్రమాణ స్వీకారం

ఇస్రో సక్సెస్ లో మహిళ మూర్తులు

మౌమీతా దత్త-.విద్యార్థి దశలో ఇస్రొ వైపు ఆకర్షితురాలై.. మార్స్ మిషన్‌ ప్రాజెక్టు మెనెజర్‌గా పని చేస్తుంది ఎన్‌ వలమతి -మెదటి భారత రాడార్‌ ఇమెజింగ్‌ శాలిలైట్‌ రీసాట్‌1 తయారీ లో వాలమతి కీలక పాత్రం పోషించారు రీతు కలిథాల్‌ ఇద్దురు బిడ్డలకు తల్తి ఇంజనీర్‌ తో జరిగే అంతర్మాథనం వారాంతరంలో పాల్గోంటారు. థేసీ థామస్‌-మీసైల్ విమెన్‌ గా పేరు సంపాదించిన మహిళ,అగ్ని నాలుగు,అగ్ని ఐదు మిషన్‌ ను లీడ్‌ చేశారు. అనురాధ టికె-జియోశాట్‌ పొగ్రాం డైరక్టర్‌ గా ఇస్రొ సీనియర్‌ మహిళ అధికారిగా ఉన్నారు. మినాల్‌ సంపత్‌-మార్స్ అర్బిటల్‌ మిషన్‌ కు 18 గంటలు శ్రమంచారు. నందిని హరినాథ్-ఆమె మెట్టమెదటి ఉద్యోగం ఇస్రొలోనే... అలా కొనసాగుతూనే ఉంది.వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు. కీర్తి పజుంథార్‌-కంప్యూటర్‌ సైన్టిస్ట్ ,మాస్టర్‌ కంట్రోల్‌ రూంలో శాటిలైట్‌లు సరైన కక్ష్యలో ఉంచే బాధ్యత..

అమెరికా ఎన్నిక‌లు.. భారతీయ భాష‌ల్లో డిజిట‌ల్‌ ప్ర‌క‌ట‌న‌లు

    అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకున్న‌ది. అధికార రిప‌బ్లిక‌న్‌లు, ప్ర‌తిప‌క్ష డెమోక్రాట్‌లు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష డిమోక్రాట్‌లు అమెరికాలో ఉన్న‌ భారతీయుల మ‌న‌సులు దోచుకోవడానికి కొత్త‌కొత్త పోక‌డ‌ను అవ‌లంభిస్తున్నారు. మొత్తం 14 భారతీయ భాషల్లో త‌మ‌ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ గురించి డిజిటల్ ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌లు రూపొందించారు. ఆ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఇండో-అమెరిక‌న్‌ల ఓట్లు అడుగుతున్నారు.  ఆ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో హామీలు, అభ్య‌ర్థ‌న‌ల‌తోపాటు కొటేష‌న్‌లు, పాట‌లు కూడా ఉన్నాయి. బిడెన్‍ ప్రచార బృందంలో కీలక సభ్యుడైన అజయ్‍ జైన్‍ భుటోరియా భార‌తీయ భాష‌ల్లో రూపొందించిన‌ డిజిట‌ల్ ప్ర‌క‌ట‌న‌ల గురించి వెల్ల‌డించారు. ఇప్పటికే విడుదల చేసిన 'ఛలో ఛలో.. బిడెన్‍ కో ఓట్‍ దో' అనే పాట తారస్థాయిలో ప్రాచుర్యం పొందిందని చెప్పారు. ఇప్పుడు తాజాగా 'జాగో అమెరికా జాగో.. భూల్‍ న జానా బిడెన్‍-హారిస్‍ కో ఓట్‍ దేనా' పేరుతో మ‌రో పాట‌ను విడుదల చేసిన‌ట్లు తెలిపారు.