జపాన్ ఆర్థిక , వాణిజ్య , పారిశ్రామిక మంత్రిత్వ శాఖ ( మేటి ) మంత్రి యొసుకె తకాగి ఆధ్వర్యంలో 70 మంది పారిశ్రామిక ప్రతినిధుల బృందం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యింది . ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి అవకాశాలు , రాజధాని అమరావతి నిర్మాణానికి జపాన్ సహకారం వంటి అంశాలపై ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి . ఎలక్ట్రానిక్స్ , స్పోర్ట్స్ , సిటీ మాస్టర్ ప్లాన్ ల రూపకల్పన , రాజధాని ప్రాంతానికి డేటా సెంటర్ , క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ ఫాం , రాడార్ ద్వారా విపత్తుల నిరోధక వ్యవస్థ , ట్రాఫిక్ రద్దీ నియంత్రణ , తాగునీటి సరఫరా , మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటుకు జపాన్ సహకారంపై చర్చలు జరిగాయి.