ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
సిట్ ముందుకు రావాల్సిందే : హైకోర్టు- చార్మి కేసులో హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్: నిన్నటి నుంచి ఉత్కంఠ రేపుతున్న చార్మి కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. మహిళా లాయర్ల సమక్షంలోనే చార్మిని ప్రశ్నించాలని తీర్పిచ్చింది. అయితే తన వ్యక్తిగత న్యాయవాది సమక్షంలోనే విచారణ జరగాలన్న చార్మి విజ్ఞప్తిని అమలు చేయడం కుదరదని తేల్చి చెప్పింది.  ఇవాళ ఉదయం వాదనలు విన్న అనంతరం తీర్పును మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేసింది. అనంతరం దీనిపై హైకోర్టు తీర్పును వెలువరించింది. చార్మి లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందించిన హైకోర్టు ఆమెను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. మహిళా అధికారులు మాత్రమే విచారణ జరపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చార్మి అనుమతి లేకుండా ఆమె రక్త నమూనాలను సేకరించకూడదని స్పష్టం చేసింది. ఆమె విచారణ ప్రక్రియ మొత్తం తన వ్యక్తిగత న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పెట్టుకున్న అర్జీని మాత్రం హైకోర్టు తోసిపుచ్చింది. విచారణాధికారులకు ఏ విధంగా విచారణ జరపాలనే విషయంలో స్వేచ్ఛ ఉంటుందని స్పష్టం చేసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రణ్ వీర్ సింగ్ కు ఊరట

  బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు స్వల్ప ఊరట దక్కింది. కాంతార లోని సన్నివేశాన్ని కించ పరిచారంటూ దఖలైన పిటిషన్ పై విచారించిన  కర్నాటక హైకోర్టు  రణ్ వీర్ పై ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ఆదేశించంది

దేవ్ జీ తొ పాటు లొంగిపొయిన ముగ్గురు నేతలు

  మార్చి నాటికి మావోహిత దేశమై లక్ష్యం కేంద్రం చెపట్టిన కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న తరునం లో రెండేళ్లో 26 మంది డివిజన్ కమిటీ సభ్యులు ,16 మంది  ఎస్ ఈ ఎం లు, నలుగురు సిసిఎం లు సెక్రటరీలు, 85 మంది ఎ.సీ.ఎస్ లు, 60 మంది మావోయిస్ట్ పార్టీ సభ్యులు మొత్తంగా 591 మంది నక్సలైట్లు  వనం వీడి జనంలోకి  వచ్చారు.

పురుష శిశు ప్రాధాన్యత

 హర్యానాలో 37 ఏళ్ల మహిళ పది మంది కుమార్తెలకు జన్మనిచ్చిన తరువాత ఇప్పుడు ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ఘటన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న పురుష శిశు ప్రాధాన్యత తో పాటు మాతృ ఆరోగ్యంపై ఉన్న ఆందోళనలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. అయితే, ఈ కుటుంబంలో పితృస్వామ్య ఆలోచనలు కారణమనే ఆరోపణలను ఆ మహిళ భర్త ఖండించాడు